మూవీ: మసూద
విడుదల తేదీ : నవంబర్ 18, 2022
నటీనటులు: సంగీత, తిరువీర్,కావ్య, భాందవి, సుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, అఖిలా రామ్ తదితరులు
దర్శకుడు : సాయి కిరణ్
నిర్మాత: రాహుల్ యాదవ్
సంగీత దర్శకులు: ప్రకాశ్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: నాగేష్
ఎడిటర్: జెస్మిన్ ప్రభు
గత కొంత కాలంగా హర్రర్ సినిమాల హవా చాలా తగ్గిపోయింది. వచ్చిన ఒకటి రెండు సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక, కంటెంట్ ఉన్న హర్రర్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ఆత్మ దెయ్యం ఉండే హర్రర్ చిత్రాలకు తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉంది.
తెలుగులో పూర్తి స్థాయి హర్రర్ సినిమాలు వచ్చి చాలా కాలమైంది. ప్రేక్షకులు కూడా ఓ మంచి ఫుల్ లెన్త్ ఘోస్ట్ హర్రర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మసూద’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలుగులో చాలా ఏళ్ల తర్వాత వచ్చిన ఈ పుల్ లెన్త్ ఘోస్ట్ హర్రర్ సినిమా ఎలా ఉంది?
సినీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది ?
అసలు మసూద లో ఆత్మ ఉందా లేదా?
మసూద ఎవరిని టార్గెట్ చేసింది?
అన్నా ప్రశ్నలకు జవాబులు వెతికితే సమాధానంగా మసూద సినిమా చుడాలిసిందే?
మసూద సినిమా ప్రోమోసన్స్ కోసం నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు దగ్గరికి వెళ్ళి మసూద ప్రమోషన్స్ చేయించుకొన్నారు సినీ మేకర్స్.
స్వధర్మ్ బ్యానర్ మీద తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి అభిప్రాయం ఉంది. గతం లో నిర్మించిన మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కాకు మంచి ఇమేజ్ ఏర్పడింది.
అదే కోవలో మరోసారి హిట్ కొట్టేందుకు ఘోస్ట్ హర్రర్ పాయింట్ కధ తో మసూద అంటూ ప్రేక్షకుల ముందుకు నేడు వచ్చారు.
మరి ఈ చిత్రం ఎలా ఉంది? మసూద కథ ఏంటి? ఆడియెన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పిస్తుందో ఇప్పుడు చదివి తెలుసుకుందాం?.

కథ ని పరిశీలిస్తే:
నీలం (Sangeeta) తన భర్త అబ్దుల్ (Satya Prakash) కు దూరంగా ఉంటూ తన కూతురు నాజియా(Bhandavi Sridhar) ను పెంచుకుంటూ ఉంటుంది. నీలం పక్కింట్లోనే ఉండే గోపీ (Thiru Veer) కాస్త భయస్థుడు. గోపీ తన సహోద్యోగి మినీ (Kavya Kalyan Ram)ను ప్రేమిస్తుంటాడు.
నీలంకు గోపీ అన్నీ పనులలోనూ చేదోడువాదోడుగా ఉంటాడు. అలాంటి సమయంలో నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. అప్పుడు ఆ కుటుంబానికి తోడుగా ఉంటాడు గోపీ. దెయ్యం పట్టి ఉంటుందన్న అనుమానంతో ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈక్రమంలో గోపీకి ఎదురైన సంఘటనలు ఏంటి?
మినీతో ప్రేమ వ్యవహారం లో ఘోస్ట్ పాత్ర ఏమిటి ?
నీలం తన కూతురిని రక్షించుకుంటుందా?
నాజియాకు దెయ్యం ఎందుకు పట్టింది?
అసలు మసూద ఎవరు నాజియా ను ఎందుకు టార్గెట్ చేస్తుంది ?
మసూద గతం ఏంటి ఎవరి మీద పగతో ఉంటుంది?
చివరకు గోపీ నీలాం నాజియా కోసం ఏం చేశాడు?
ఈ కథలో పీర్ బాబా (Subhaleka Sudhakar), అల్లాఉద్దీన్ (Satyam Rajesh) పాత్రలు ఏంటి?
అన్నది వెండి తెరపై చూడాల్సిందే…..

కధ కధనం (SCREENPLAY) పరిశీలిస్తే:
‘మసూద’.. ఈ సినిమా టైటిల్‌కు నూటికి నూరు శాతం న్యాయం జరిగింది అనే చెప్పాలి. కథ ఏం లేకపోయినా కధనం లో హర్రర్ కామెడీ కలిపి హిట్టు కొడుతున్న దర్శకుడు ‘మసూద’ కధ కు ఓ మంచి స్క్రీన్ ప్లే రాసుకొని విజయం సాదించాడు అని చెప్పాలి.
దర్శకుడు సాయి కిరణ్ సినిమాను మంచి గ్రిప్పింగ్ సీన్స్ తో తెరకెక్కించిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు. కథ కొత్తదేమీ కాకపోయినా కథనం (స్క్రీన్ – ప్లే) విషయంలో మాత్రం దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఓ హర్రర్ సినిమాకు ఉండాల్సిన అన్ని కోణాలు ఈ సినిమాలో ఉన్నాయి.
మసూద సినిమా చూస్తున్నంత సేపూ తర్వాత సీన్ ఎలా ఉండతుంది ? ఏమి ఏం జరుగుతుందా అని ప్రేక్షకులకు అనిపిస్తూ ఉంటుంది.

నటి నటుల నటన పరిశీలిస్తే:
నటీనటులు వారి పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ప్రధాన పాత్రధారులైన సంగీత, తిరువీర్, కావ్య, భాందవి సినిమాకు ఓ బలం అని చెప్పొచ్చు. సంగీత చాలా ఏళ్ళు తర్వాత మంచి పాత్రతో ఆకట్టుకోంది.
మసూద దెయ్యం పట్టిన అమ్మాయిగా భాందవి నటనను మెచ్చుకోక తప్పదు. ఆ అమ్మాయిని బాగు పర్చడానికి కష్టాలు పడే పాత్రల్లో సంగీత, తిరువీర్ భయపడుతూనే మనల్ని భయపెడతారు. కధను ముందుకు తీసుకెళ్లే పాత్రల్లో నటించిన సుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, అఖిలా రామ్ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:
మామూలుగా ఓ హర్రర్ సినిమాకు సౌండ్, విజువల్స్ ప్రధానం. సంగీత దర్శకుడు ప్రకాశ్ ఆర్ విహారి అద్భుతమైన సంగీతాన్ని మసూద కి ఇచ్చారు. ప్రతి సీన్, ప్రతి షాట్‌కు తగినట్లు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు.
ఆ తర్వాత కెమెరా పనితనం కూడా సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. నాగేష్ తన పనితనంతో సినిమాను మరింత భయంకరంగా మాయపెట్టేలా తీర్చిదిద్దారు. సినిమా ఎడిటింగ్‌లో జెస్మిన్ ప్రభు పనితన కనిపిస్తుంది.

18 ఫ్ టీం ఒపీనియన్:
మసూద’ మిమ్మల్ని దియేటర్ లో స్క్రీన్ మీద నుండి సీటు వరకూ వచ్చి భయపెడుతుంది. ఫ్యామిలీ మొత్తం ఒకసారి చూడవలసిన చిత్రం ఈ మసూద. మా 18 f టి కి అయితే చాలా నచ్చింది బాగా ఎంజాయ్ చేశారు అంట. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకొంటున్నాను.
తమ్ముడూ మసూద నిజంగానే భయ పెట్టింది.
18F MOVIE RATING: 3.25 /5
- కృష్ణ ప్రగడ..