మూవీ: లవ్ టుడే తెలుగు రివ్యు (LOVE TODAY – TAMIL),
రిలీజ్ డేట్: 25-11-2022,
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, సత్యరాజ్, యోగి బాబు, ఇవానా, రాధిక శరత్‌కుమార్, తదితరులు.
దర్శకుడు : ప్రదీప్ రంగనాథన్
నిర్మాత: కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్
సంగీత దర్శకులు: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
లవ్ టుడే తెలుగు రివ్యూ ( LOVE TODAY Movie Review):
తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరొ గా మారి నటించి దర్శకత్వం వహించిన తమిళ మూవీ లవ్ టుడే. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చదివి తెలుసుకుందాం..
కధ ( STORY) పరిశీలిస్తే:
ఉత్తమన్ ప్రదీప్ (Pradeep Ranganathan) – నిఖిత (IVAANA) ఇద్దరు ఖడంగా ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో నిఖిత – ప్రదీప్ ప్రేమ సంగతి నిఖిత పాదర్ (Satyaraj)కి తెలుస్తోంది. నిఖిత ఫాదర్ ప్రదీప్ ని ఇంటికి రమ్మని పిలుస్తాడు. ప్రదీప్ & నిఖిత వివాహాన్ని తాను అంగీకరించడానికి చిన్న షరతుగా ఒక రోజు పాటు ఒకరి మొబైల్ ఫోన్‌లను ఒకరు మార్చుకోవాలని నిఖిత ఫాదర్ చెబుతాడు.
నిఖిత తండ్రీ చెప్పినట్టు ప్రదీప్ & నిఖితలు ఆ షరతును అంగీకరించి ఫోన్‌లను మార్చుకున్న తర్వాత…
ప్రదీప్ నిఖిత ల పరిస్థితి ఏమిటి?
మొబైల్ ద్వారా ఒకరి గురించి మరొకరకి ఎలాంటి నిజాలు తెలిశాయి?
ఈ క్రమంలో వాళ్ళ మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి ?
చివరాఖరకు వీరి ప్రేమ కథ ఎలా సుఖాంతం అయింది ?
ఇప్పటి యువత మొబైల్ ఫోన్ ఒకరితో మరొకరు షేర్ చేస్తారా?
మొబైల్ ఫోన్లు ద్వారా మనం ఏమీ కోల్పోతున్నాం?
వంటి ప్రశ్నలు మీకు ఇంటరెస్టింగ్ గా ఉంటే మీ ఫ్యామిలీ తో కలస చూడవచ్చు, కొంచం ఇబ్బంది గా వుంటే ఒంటరిగా చూడండి. ఈ లవ్ టుడే సినిమా కంటెంట్ ఎక్కడైనా ఎప్పుడైనా తప్పక చూడ వలసిన కథ.
కధ కథనం (SCREEN – PLAY) పరిశీలిస్తే:
లవ్ టుడే సినిమా దర్శకుడు ప్రదీప్ తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్, రొటీన్ గా సాగుతుంది. ముఖ్యంగా రెండవ అంకం లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో స్లోగా సాగుతుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే ఉంటాయి. దీనికితోడు దర్శకుడు కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని అనవసరమైన కామెడీ సన్నివేశాలను జోడించాడు.
కథకు ఇంపార్టెంట్ అయిన లవ్ అండ్ ఫ్యామిలీ సీన్స్ ఎక్కువ గా ఉన్నా, అంత మెలో డ్రామా పండలేదు. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను తగ్గించి ఎమోషన్ మీద కధనం నడిపి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:
ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా, కథ కుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదు. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది.
ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
దర్నకుడి ప్రతిభ, నటుల నటన పరిశీలిస్తే:
ప్రేమ జంటలు చిన్న చిన్న విషయాలకే అపోహలు అపార్థాలతో విడిపోతున్న ఈ కాలం లో.. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో లవర్స్ మధ్య అద్భుతమైన ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుందో చాల చక్కగా చూపించాడు.
ఆ పాత్రల మధ్యనే చిలిపి నవ్వులను, కొంటే తనం తో కూడిన కన్నీళ్లను మరియు అభిమానాలతో కూడుకున్న ఆత్మాభిమానాలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మొత్తానికి సినిమాలో వాస్తవ పరిస్థితులు.. అలాగే ప్రస్తుత యువత భావోద్వేగాలు బాగున్నాయి.
ఇప్పటి తరం కుర్రాళ్ళు సరదా కోసం అవసరాల కోసం చాటుగా ఎలా ఉంటున్నారు ?, మళ్లీ బయటకు ఎలా కనిపిస్తారు? అనే కోణాలని కూడా బాగా చూపించారు. ఇక ప్రదీప్ రంగనాథన్ రాసుకున్న కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సత్యరాజ్ ఎపిసోడ్ చాల బాగుంది.
హీరోగా కూడా నటించిన ప్రదీప్ రంగనాథన్ తన కామెడీ టైమింగ్ తో అండ్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా నటించాడు.
సినిమాలోని కోర్ ఎమోషన్ని ప్రదీప్ రంగనాథన్ తన హావభావాలతోనే బాగా పలికించాడు. అలాగే హీరోయిన్ ఇవానా కూడా చాలా బాగా నటించింది. ఇక ఈ చిత్రానికి మరో బలం యోగిబాబు కామెడీ. ఆయన తన టైమింగ్ తో బాగా నవ్వించాడు.
మిగిలిన ప్రధాన పాత్రధారులు రాధికా శరత్ కుమార్, సత్యరాజ్ కూడా ,తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు
.
18FMovies టీం ఒపీనియన్ :
ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ టుడే లవర్స్ మధ్య నిజమైన లవ్ ను అండ్ ట్రూ ఎమోషన్స్ ను గుర్తుచేసే కథాంశంతో సాగిన ఈ చిత్రం.. మంచి మెసేజ్ మరియు ఎమోషనల్ సీన్స్ తో పాటు కొన్ని కుటుంబ భావోద్వేగాలతో బాగా ఆకట్టుకుంది.
తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది అనడం లో ఎటువంటి సందేసం లేదు. ఫ్రెండ్స్, లవర్స్, ఫ్యామిలీ అందరూ తప్పక చూడవలసిన ఫ్యామిలీ సోషల్ డ్రామా ఈ లవ్ టుడే.
18F MOVIES RATING: 3.5 / 5
కృష్ణ ప్రగడ.