KARTHI MOVIE SARDAAR TELUGU REVIEW: కార్తీ డుయల్ రోల్ తో రెచ్చిపోయి నటించి మెప్పించిన సర్దార్ !

sardaar movie telugu review by 18 f

 

సినిమా: సర్దార్

విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022

నటీనటులు: కార్తి, రాశిఖన్నా, రజిషా, చుంకీ పాండే, లైలా తదితరులు

దర్శకత్వం : పీఎస్ మిత్రన్

నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్

సంగీతం: జీవి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: జార్జ్ విలయమ్స్

సూర్య తమ్ముడు కార్తి హీరోగా రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్ గా తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ థ్రిల్లింగ్ స్పై యాక్షన్ త్రిల్లర్ మూవీ సర్ధార్.

సర్ధార్ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..

SARDAAR PRE RELEASE UA CENSORED

సర్దార్ కథ ను పరిశీలిస్తే:

విజయ్ ప్రకాష్  (Karthi ) ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. సమాజం లో గుర్తింపు కోసం తాను  చేసే ప్రతి పనిలో ఆవకాశం వెతుక్కుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో విజయ్ (కార్తి) కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాష్ ట్యాగ్ కూడా పలుమార్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో వెళ్తుంది. మరో పక్క లాయర్ షాలిని (రాశిఖన్నా) ని విజయ్ (కార్తి) చిన్న తనం నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమ కథ ఇలా సాగుతూ ఉండగా..

ఇండియాలో ‘వన్ లైన్ వన్ పైప్’ అనే వాటర్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతూ ఉంటాయి. మాజీ ‘రా’ ఆఫీసర్స్ ఇద్దరు ఈ వాటర్ ప్రాజెక్టును ఆపాలని.. దానికి సమర్ధుడు ఒక్క సర్దార్ (కార్తి) మాత్రమే అని అతని కోసం వెతుకుతూ ఉంటారు.

ఇంతకీ ఈ సర్దార్ ఎవరు ?,

వన్ లైన్ వన్ పైప్ వాటర్ ప్రాజెక్టు ఏమిటి ?,

విజయ్ ప్రకాష్  కి – సర్దార్ కి మధ్య కనెక్షన్ ఏమిటి ?,

సర్దార్ ఈ వాటర్ ప్రాజెక్టును ఏం చేశాడు ?,

విజయ్ (కార్తి ) సర్దార్ మిషన్‌ లో ఎలా భాగమయ్యాడు ?

ట్రైలర్ లో కనిపించిన ఆ చిన్న బాబు ఎవరి కొడుకు ?

ఇంటెలిజెన్స్ లో  స్పై దేశానికి నిజంగానే  ద్రోహం సేశాడా ?

అనేప్రశ్నలకు జవాబులు కావాలి అంటే సర్దార్ సినిమా చూడవలసిందే..!

SARDAAR PRE RELEASE3 1

సర్దార్ లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే:

కార్తి తన కెరీర్ ఈ సర్దార్ సినిమా  ఒక ఛాలెంజ్ గా తీసుకొని  రెండు పాత్రల్లో అద్బుతంగా నటించాడు. పైగా సర్దార్ పాత్రకి – విజయ్ పాత్రకి ఒకదానికి మరొకటి సంబంధం లేకుండా, అనేక గెట్ అప్స్ మారుస్తూ కార్తి చాలా వైవిధ్యంగా నటించి మెప్పించాడు అనే కంటే నట విశ్వ రూపం చూపించాడు అని చెప్పవచ్చు.

కార్తి గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో విజయ్ పాత్ర కోసం  కొత్త లుక్స్ తో చాలా ఫ్రెష్ గా కనిపించాడు. ఇంకా విజయ్ తండ్రిగా 60 సంవత్సరాలు ముసలోడీ పాత్రలో నటన లుక్స్ అదరహో అనేటట్టు ఉన్నాయి.

హీరోయిన్ రాశి ఖన్నాతో ప్రేమ సన్నివేశాల్లో గాని, అటు యాక్షన్ సన్నివేశాల్లో గాని విజయ్ ( కార్తి ) చాలా సెటిల్డ్ గా చక్కగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నా (rashi Khanna)  తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు మరియు ఆమె నటన బాగుంది.

సర్దార్ చిత్రానికి మరో ప్రధానాకర్షణ చుంకీ పాండే (Chunky Pandey), లైలా (laila ) పాత్రలు. చీన్న బాబుకి తల్లి పాత్రలో కనిపించిన లైలా తన నటనతో మెప్పించింది. చుంకీ పాండే విషయానికి వస్తే.. రా ఆఫీసర్ గా, కార్పొరేట్ కంపనీ అధిపతిగా తనడైన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

మరో హీరోయిన్ రజిషా విజయన్ మరో ముఖ్యమైన పాత్రలో చాలా బాగా నటించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

కొన్ని కీలక సన్నివేశలను దర్శకుడు మిత్రన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే హై టెక్నికల్ వేల్యూస్‌ తో ఈ చిత్రం తెరకెక్కింది.

SARDAAR 2 DAYS TO GO 2

సర్దార్ లో మైనస్ పాయింట్స్ ఏంటంటే:

సర్దార్ లో మెయిన్ కంటెంట్ అండ్ పాయింట్ చాలా బాగున్నాయీ ..  దర్శకుడు పీఎస్ మిత్రన్ సెకండ్ హాఫ్ కథనం (screen -play ) విషయంలో ఇంకా కొంచెం స్పీడ్ పెంచి సర్దార్ పాత్ర నిడివి పెంచి ఉంటే మరో లెవెల్ లో ఉండేది.

సెకండాఫ్ లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు పీఎస్ మిత్రన్ ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు.

అలాగే సెకండ్ హాఫ్ ను కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు గాని, కొన్ని చోట్ల అది ముక్యంగా స్టేజ్ డ్రామా సాంగ్ ) స్క్రీన్ మీద అంతా ఎఫెక్టివ్ గా లేదు ఇంకా పాటలు త్రిల్లర్ స్పీడ్ ని తగ్గించినట్టు అయ్యింది.

ఇలాంటి స్పై త్రిల్లర్ యాక్షన్ సినిమాలు సాంగ్స్ లేకుండా లేదా సాంగ్స్ లో యాక్షన్ సీన్స్ వాడితే  బాగుంటుంది. లవ్ అండ్ మెలోడీ సాంగ్స్ ఉండటం వలన 2 వ అంకం (2 nd off )  స్లో ఆవినట్టు ఉంది.

SARDAAR PRE RELEASE1

దర్శకత్వం సాంకేతిక విభాగం పరిశీలిస్తే:

విశాల్ తో అభిమన్యూడు, శివ కార్తికేయన్ తో హీరో, చిత్రాల ద్వారా  మంచి సోషల్ మెసేజ్ ఉండే కథలు  రాసుకోవడంలో సక్సెస్ ఆయ్యాడు  పీఎస్ మిత్రన్.

ఇప్పుడు కూడా మంచి సోషల్ మెసేజ్ ఉండే కధ తో ఉత్కంఠభరితమైన కథనాన్ని రూపొందించడంలో, దాన్ని ఇంకా ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు.

సినిమాకు పనిచేసిన సాంకేతిక టీమ్ పనితనం బాగుంది. సన్నివేశాలకు అనుగుణంగా సాంకేతిక వర్క్ సాగింది.

సంగీత దర్శకుడుజీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. అలాగే ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

జార్జ్ విలయమ్స్ సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకునేలా సాగింది. ఎక్కడా బ్యూటీ తగ్గకుండా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు ఆయన. నిర్మాణ విలువలు బాగున్నాయి.

SARDAAR LIVE 1

18F MOVIES OPINION:

సర్ధార్ అంటూ మన ముందుక వచ్చిన ఎమోషనల్  స్పై యాక్షన్ త్రిల్లర్ డ్రామాలో.. అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉన్నాయి, మరియు కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

స్క్రీన్ ప్లే మాత్రం కొన్ని చోట్ల స్లో అనిపించినా కార్తీ యాక్షన్ తో మేకింగ్ వాల్యూ తో చూసే వారికి బోర్ అనిపించదు. సినిమాలో కార్తి యాక్టింగ్ మరియు కధలో మెయిన్ పాయింట్ హైలైట్ గా ఉంది సినిమా ఓవరాల్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

ఆకరి మాట: కార్తీ నట విశ్వ రూపం ఈ సర్దార్ …

రివ్యూ బై కృష్ణా ప్రగడ.

18F MOVIES RATING: 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *