సినిమా: కాంతార
విడుదల తేదీ : అక్టోబర్ 15, 2022
నటీనటులు: రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, వినయ్ బిడ్డప్ప
దర్శకత్వం : రిషబ్ శెట్టి
నిర్మాతలు: విజయ్ కిరగందూర్
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్
ఎడిటర్స్: ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్
కన్నడ సినిమా ఇండిస్ట్రీ లో తనడంటూ ఓక స్తానాన్ని స్టరుసటయించుకొన్న రిసబ్ శెట్టి హీరోగా నటిస్తూ తన దర్శకత్వం లో తెరకెక్కించిన కన్నడ చిత్రం “కాంతారా”.
కన్నడ లో సెప్టెంబర్ 30 న విడుదల అయ్యి అద్భుతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సక్సెస్ తో కాంతార ను తెలుగు, హిందీ లో డబ్బింగ్ చేశారు.
ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..
కథ పరిచిలిస్తే:
డీప్ ఆటవిక ప్రాంతంలోని ఓ గ్రామం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఆ గ్రామానికి భూస్వామ్య దొర (ACHUTH KUMAR), ఆ గ్రామానికి పెద్ద.
మరోపక్క శివ (RISHAB SETTY) తన స్నేహితులతో కలిసి అడవిలో వేటాడుతూ తాగి తిరుగుతూ జల్సా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్ మురళీ(KISHORE) తో శివ కి గొడవ జరుగుతూ ఉంటుంది.
అంతలో శివ లవర్ లీల (SAPTAMI GOWDA) కూడా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఫారెస్ట్ గార్డ్‌గా చేరుతుంది. ఈ లోపు పై ఆదికారుల ఆదేశాలతో అటవీ భూమిని సర్వే చేయడానికి ఫారెస్ట్ ఆఫీసర్ మురళీ తన టీం తో రెఢీ అవుతాడు.
ఈ క్రమంలో అనుకోకుండా కొన్ని సంగటనలు జరుగుతాయి. శివకి ఎప్పటి నుంచో దైవ సేవకుడు కలలోకి వస్తూ భయ పెడుతూ ఉంటాడు.
అసలు ఈ దైవ సేవకుడు ఎవరు?,
ఎందుకు శివ కలలో కి మాత్రమే వస్తున్నాడు?,
ఆ గ్రామానికి వచ్చిన మరో పెద్ద సమస్య ఏమిటి?,
దాన్ని శివ ఎలా పరిష్కరించాడు?
ఫైనల్ గా శివ ఎవరు ?
అనేది మిగిలిన కథ. పైన వ్యక్త పరిచిన అన్నీ ప్రశ్నలకు సమాదానాలు కావాలి అంటే కాంతార సినిమా థియేటర్ లోనే చూడాలి.
కాంతార ప్లస్ పాయింట్స్ పరిశీలిస్తే:
కర్ణాటక అడవులలో నివసించే ఓ తెగకు సంబంధించిన ఆచారాలు దైవ సేవలను, వారి జీవనం తో ముడిపడిన భూమి లాంటి ఇతివృత్తం ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో గుడ్ ఎమోషన్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెన్స్ ఉన్నాయి.
దైవ సేవకుడు కుటుంబ వారసుడు గా శివ పాత్రల్లో రిషబ్ శెట్టి తన పరిపక్వతమైన నటనతో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా తన పీన-తమ్ముడు గురవా చనిపోయాడని తెలిసే సన్నివేశంలో మరియు హెవీ ఎమోషన్స్ అండ్ భారీ యాక్షన్ తో సాగే క్లైమాక్స్ లో..
అలాగే మిగిలిన క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో.. రిషబ్ శెట్టి అద్భుతమైన భావోద్వేగాలను పండిస్తూ పూనకం తో నటించాడు.
ఇంకా రిషబ్ శెట్టికి జోడిగా నటించిన సప్తమి గౌడ కొన్ని సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ.. తన అందంతో అభినయంతో ఆమె ఆకట్టుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించిన కిషోర్ కుమార్ కూడా సినిమాలో కనిపించనంతసేపూ తన నటనతో ఆకట్టుకున్నాడు.
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన అచ్యుత్ కుమార్ తన నటనతో మెప్పించాడు. ప్రమోద్ శెట్టి, వినయ్ బిడ్డప్ప మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.
దర్శకుడు రిషబ్ శెట్టి సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ తో పాటు అద్బుతమైన ఎమోషన్స్ ను కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు.
ముఖ్యంగా దర్శకుడు రిషబ్ శెట్టి సినిమా క్లైమాక్స్ లో చక్కని నటన తో పాటు దర్శకత్వ పనితనం కనబర్చాడు. క్లైమాక్స్ 20 నీమూశాలు అంటే ప్రేక్షకులకు కూడా పుణ్యకాలు వచ్చేలా చేశాడు.
మైనస్ పాయింట్స్ పరిశీలిస్తే:
రిషబ్ శెట్టి మంచి స్టోరీ లైన్ తో పాటు డెంట్ ఫారెస్ట్ నేపథ్యం తీసుకున్నప్పటికీ.. కొన్ని సీన్స్ లో మాత్రం టిపికల్ నేరేషన్ తో, తెలుగు ప్రేక్షకులకు అర్దం కాకుండా ఉండుట వలన ఇంకా ఆసక్తికరంగా సాగని యాక్షన్ డ్రామాతో సినిమాను కొన్ని చోట్ల పూర్తిగా ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కథనం కొంచెం అర్దం కాకుండా ఉంది . అయితే, ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సినిమాని ప్రారంభించి.. అలాగే మంచి ఎమోషనల్ సన్నివేశాలతో రిషబ్ శెట్టి ఆకట్టకున్నా..
కాంతార సినిమా కొన్ని చోట్ల స్లోగా, హడల్ట్ కామిడీ సీన్స్ తో సాగుతుంది. అలాగే కథ తాలూకునేటివిటీ కూడా తెలుగు ప్రేక్షకలకు కనెక్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది.
సాంకేతిక విభాగం పరిశీలిస్తే :
రిషబ్ శెట్టి అద్భుతం మైన స్టోరీ ఐడియాతో గుడ్ ఎమోషన్స్ తో సీట్ లో కూర్చున్న వారికి కూడా పునకాలు వచ్చే క్లైమాక్స్ తో ఆకట్టుకున్నారు.
బి అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ముఖ్య సన్నివేశాల్లో ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.
అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.
హంబలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
18F Movies Opinion:
దర్శకత్వం తో కధ లో తానే హీరోగా నటించి మెప్పించిన రిషబ్ శెట్టి, తన నట విశ్వ రూపం తో పాటు భారీ యాక్షన్ విజువల్ డ్రామాతో బరువైన భావోద్వేగాలు, ప్రాంతీయ దైవత్వం తాలూకు నమ్మకాలు ప్రపంచ సినీ ప్రేక్షకులకు మరో ప్రపంచాన్ని పరిచయం చేశాడు.
అద్భుతమైన రా -యాక్షన్ తో సాగే ఎమోషనల్ సీన్స్ మరో అద్భుతం అనిపించే క్లైమాక్స్ తో కాంతార సినిమా చూసే సినీ ప్రేక్షకులకు కూడా పునకాలు వచ్చేలా ఉన్నది.
అయితే సినిమాలో కొన్ని చోట్ల పూర్తిగా లోకల్ గా జరిగే ఆచారాలు తో సాగే సీన్స్ వలన మన తెలుగు ప్రేక్షకులు ఎంత వరకూ కధ లో ఇన్ వాల్వ్ అవుతారో తెలియదు.
కానీ, రిషబ్ శెట్టి తన అద్భుతమైన నటనతో, దర్శకత్వ ప్రతిభతో, హంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ వాల్యూ తో ఈ సినిమా స్థాయిని పెంచేశాయి.
నటులు ఎవరు అనేది పక్కనపెట్టి మంచి సినిమా చూద్దాం అనే వారికి ఫుల్ మీల్స్ లాంటిది ఈ “కాంతార”
By Krishna Pragada.
18F Movie Team Rating: 3.25/5