HIT 2 Movie USA PREMIER’S Review న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా, అడివి శేష్ మెయిన్ లీడ్ రోల్ లో హిట్ 2nd కేస్ సినిమా నేడు (డిసెంబర్ 2) తెలుగు లో థియేటర్లోకి వచ్చింది.
మరి ఈ హిట్ సినిమా ఎలా ఉంది హిట్టా ?.. లేదా ?
అసలు కిల్లర్ అదే కోడి బుర్ర హంతకుడు ఎవరు?
గత రాత్రి నుడి అమెరికా లో ప్రేమియర్స్ వేశారు. మన తెలుగు ప్రేక్షకులు వవర్సీస్ లో చూసి సోషల్ మీడియాలో వేధిక గా వారి అభిప్రాయాలు తెలియజేశారు . ఇంకా శేష్ సెంటర్ పాయింట్ గా చాలా హాట్ గా టాపిక్ నడుస్తుంది.
ఆ ట్విటర్, సోషల్ మీడియా లొని చర్చ ప్రకారం కధ లోకి వెళ్తే..
అడివి శేష్ హీరోగా, న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకుడిగా హిట్ 2 చిత్రం నిర్మించి డిసెంబర్ 2 న అంటే నేడు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి కూడా టాక్ కూడా వచ్చేస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. దీంతో హిట్ సెకండ్ కేస్ గురించి ఇప్పుడు ట్విట్టర్ వేదిక గా చర్చ నడుస్తోంది. ఇప్పటి సోషల్ మీడియా బ్యాచ్ థ్రిల్లర్, సస్పెన్స్ స్టోరీలకు చాలా పెద్ద అడ్డంకిగా తయారయ్యారు.
త్రిల్లర్ జోనర్ సినిమాలు ఎక్కువగా సస్పెన్స్ మాయింటెన్ చెయ్యాలి. కానీ ఇప్పటి బ్యాచ్ కి బయాపడి నిన్న రాత్రి నాని, శేష్ అండ్ దర్శకుడు ప్రెస్ కాన్ఫిరెన్స్ పెట్టి మరి రిక్వెస్ట్ చేశారు. సినిమా లొని సీన్స్ రివిల్ చేయవద్దు అని ..
సినిమా లో సస్పెన్స్ ఏంటి? థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ట్విస్టులు ఏంటి? అనేది ముందే సోషల్ మీడియాలో లీక్ ఆవితే తర్వాత సినిమా చూడాలి అనుకొనే వారికి ఆ త్రిల్ మిస్ అవుతుంది.
ఇలా స్పాయిలర్స్ చేసే వాటితో మిగతా ఆడియెన్స్‌కు ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. ఇదే విషయాన్ని నిన్న నాని, అడివి శేష్‌లు చెప్పారు. దయచేసి స్పాయిలర్స్ ఎవ్వరూ కూడా ట్విస్టులను రివీల్ చేయకండని వేడుకున్నారు.
కానీ సినిమాను చూసిన జనాలు మాత్రం హిట్ సెకండ్ కేస్ మీద మరీ అంచనాలతో వెళ్లకండని అంటున్నారు. మొదటి పార్ట్ నచ్చిన వాళ్లకి ఇది కూడా నచ్చుతుందని అంటున్నారు. మరీ హై ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్తే డిసప్పాయింట్ అవుతారు అని అంటున్నారు.
గుడ్ థ్రిల్లర్ అని ఇంకొకరు.. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉండి .. ఇంటర్వెల్ మాత్రం అదిరిపోయిందని, అడవి శేష్ ఇది ఇప్పటి వరకూ చేసిన వాటిలో ఇది ది బెస్ట్ కారెక్టర్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.
ఇంకా మరో మెయిన్ ట్విస్ట్ హిట్ -3 అంటే మూడో పార్ట్‌లో నాని పోలీస్‌గా నటించబోతోన్నాడు అని చెప్పేశారు. దీంతో జనాలు కూడా మూడో పార్ట్ మీద ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
న్యాచురల్ స్టార్ నాని మూడో పార్ట్ చేస్తాడనే ట్విస్ట్ రివీల్ అయింది. కానీ మెయిన్ విలన్ అన్నది ఎవరో ఇంకా తెలియడం లేదు.
ఇంకో బ్యాచ్ రాసినది ఏంటంటే విశ్వక సేన్ నటించిన మొదటి పార్టే బాగుందని, రెండో పార్ట్ ఎక్కువ ఇన్వెస్టిగేసన్ పాయింట్ లో వెళ్తూ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యింది అని అంటున్నారు.
మొత్తానికి, నేను చదివిన రివ్యూ ల వరకూ హిట్ సెకండ్ కేస్ సినిమా మాత్రం ఏ ఒక్కరినీ నిరాశపర్చలేదనిపిస్తోంది. వారి ఆంచానాలు ఎక్కువ గా ఉండటం వలన కొంత మంది ఫస్ట్ పార్ట్ – సెకండ్ పార్ట్ కి పోలిక తెస్తునాన్రు కానీ సినిమా అస్సలు నచ్చలేదు అని ఎవరూ చెప్పలేదు.
ఇక మూడో పార్ట్‌లో నాని ఎలాంటి కేస్‌ను సాల్వ్ చేస్తాడా అని ప్రేక్షకులలో ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. మా టీం రివ్యూ వచ్చేవరకు ఇది చదువుతూ ఉండండి. కొంత సమయం లోనే మా రివ్యూ పోస్ట్ చేస్తాము.