సినిమా పేరు : గాడ్ ఫాదర్
నటీనటులు : చిరంజీవి, నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్
డైరెక్టర్ : మోహన్ రాజా
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
సినిమా విడుదల తేదీ : అక్టోబర్ 5, 2022
మలయాళంలో పృద్వి రాజ్ సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన లూసిఫర్ సినిమాలో హీరోగా మోహన్ లాల్ నటించిన విషయం తెలిసిందే.
తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో ఆ లూసిఫర్ సినిమా ను మోహన్ రాజా దర్శకత్వం లో ఎన్వీ ప్రసాద్, రామ్ ప్రసాద్ నిర్మాతలుగా మెగా స్టార్ చిరంజీవి తో పునర్నిర్మించారు.
తెలుగుతో పాటు, హిందీ, తమిళ భాషల్లో నిర్మించి విడుదల చేశారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు.
సత్యదేవ్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. నయనతార ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించింది.
కథ గురించి చూస్తే :
గాడ్ ఫాదర్ సినిమా 157 నిమిషాల నిడివితో ఉంటుంది. అంటే రెండు గంటలా 37 నిమిషాలు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా నటించాడు.
పూరీ జగన్నాథ్ పాత్రతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి బ్రహ్మ అనే పాత్రలో నటించాడు. సెకండాఫ్ నుంచి సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఉంటుంది.
జన జాగృతి పార్టీ లీడర్ రాస్ట్రా ముఖ్యమంత్రి పొలిటికల్ గాడ్ ఫాదర్(పీకేఆర్) మరణం తర్వాత ఆయన స్థానాన్ని దక్కించుకోవాలని చాలామంది చూస్తుంటారు. పన్నాగాలు పన్నుతుంటారు.
అయితే.. ఆ గాడ్ ఫాదర్ వారసత్వం గురించి ప్రశ్న వచ్చినప్పుడు ఆయనకు ఇష్టమైన బ్రహ్మ, మరికొన్ని పేర్లు బయటికి వస్తాయి. గాడ్ ఫాదర్ కూతురు సత్యప్రియ(నయనతార).. బ్రహ్మ పట్ల అసంతృప్తితో ఉంటుంది. దానికి కారణం.. బ్రహ్మను పొలిటికల్ వారసుడిగా ప్రకటించడం.
సత్యప్రియ బ్రహ్మను ఎందుకు ద్వేషిస్తోంది?
సత్యప్రియకు వారసత్వాన్ని ఇచ్చాడా?
కుటుంబంలో ఉన్న సమస్యలను బ్రహ్మ ఎలా తీర్చాడు?
జైదేవ్ ఎవరు? జైదేవ్ కు, సత్యప్రియకు ఉన్న సంబంధం ఏంటి?
అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.
నటి నటుల గురించి విశ్లేషణ:
సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, లూసిఫర్ చూడని వాళ్లకి ఏమీ చెప్పాల్సిన పనిలేదు. కానీ చూసినవాళ్లకి తెలుస్తుంది, అందులోని సవితికూతురు పాత్రని ఇందులో మరదలిగా, ఇంకా అందులో ఉన్న సీయం కొడుకు క్యారక్టర్ని ఇందులో పూర్తిగా ఎత్తేసారు అని.
ఇలాంటి చిన్న మార్పుల వలన ఒవెరల్ గా మంచి పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా సినిమా గా ఉంది.
మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
చిరంజీవి సినిమా అంటేనే హీరోయిన్ తో డ్యాన్సులు, ఫైట్లు గుర్తొస్తాయి. కానీ, గాడ్ ఫాదర్ మూవీ లో ఫైట్లున్నా హీరోయిన్ తో డ్యాన్సులు మాత్రం లేవిందులో. అసలు హీరోయినే లేని మొదటి చిరంజీవి సినిమా ఇదేనేమో. పేరుకి లూసిఫర్ రీమేకే అయినా చాలా మార్పులు చేసారు.
చిరంజీవి నటన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏం ఉండదు. కానీ న్యూ జనరేశన్ కి మెగా స్టార్ నటన స్టైల్ చూపించే అవకాశం ఈ గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఏర్పడింది.
చిరంజీవి అద్భుతంగా నటించారు. అయితే.. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా కథలో కొన్ని మార్పులు చేశారు.
సినిమాలో చిరంజీవి చెప్పే కొన్ని డైలాగ్స్ అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను ప్రతిబింబిస్తాయి. సినిమా దర్శకత్వం, టేకింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అదిరిపోయాయి.
ఇతర నటీనటుల విషయనికొస్తే మురళీశర్మ మెథడ్ యాక్టింగ్ చేసారు. విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో ప్రత్యేకంగా కనిపించే ప్రాయత్నం చేసాడు.
చాలానాళ్ల తర్వాత సయజీషిండే కనిపించాడు. సముద్రఖని మలయాళమాతృకలోని పాత్రకి యథాతథంగా న్యాయం చేసాడు.
సీయం పాత్ర వేసింది “సిరివెన్నెల” హీరో సర్వదమన్ బెనర్జీ అని ఎంతమంది గుర్తుపట్టారో తెలియదు. షఫీ కూడా చాలా రోజుల తర్వాత వెండితెర దర్శనమే.
టాప్ కమెడియన్ గా వెలుగు వెలిగి, హీరోగ ఉనికి చాటుకుని ఇప్పుడు అస్సలు ప్రాధాన్యత లేని చిన్న చిన్న పాత్రలో సునీల్ కనిపించడం బాధాకరం.
నయనతారది మొత్తం సీరియస్ పాత్రే. కన్నీళ్లు పెట్టుకోవడానికే తప్ప వైవిధ్యం చూపించడానికి పెద్దగా స్కోప్ లేదు.
సత్యదేవ్ మాత్రం విలన్ గా తనవరకు న్యాయం చేసాడు.. ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ మరింత క్రుయల్ గా కనిపిస్తాడు.
చిరంజీవితో కలిసి యాక్షన్ సీన్స్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ఉన్నంత లో బాగానే చేశాడు.
విజయ దశమి పండుగ సందర్భంగా చిరంజీవి తన సినీ అభిమానులకు మంచి విందు భోజనం అందించారు. మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా చేసి మంచి పనే చేశారు. మళ్లీ ఫామ్ లోకి వచ్చి తనేంటో నిరూపించుకునే మంచి సినిమా ఈ గాడ్ ఫాదర్.
ప్లస్ పాయింట్స్:
రాజకీయ సన్నివేశాలు
లక్ష్మీ భూపాల్ మాటలు
చిరంజీవి నటన
నయనతార యాక్టింగ్
సత్యదేవ్ టాప్ క్లాస్ యాక్టింగ్
సినిమాటోగ్రఫీ
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లో సల్మాన్ ఖాన్ సన్నివేశాలు
18F MOVIE VIEW:
గాడ్ ఫాదర్ మూవీని ఫ్యాన్స్ మాత్రమే కాదు. ఇంటిల్లి పాది చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. మెగాస్టార్ ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు.
దితెలుగున్యూస్ రేటింగ్ : 3.5/5