BHEDIAYA MOVIE TELUGU REVIEW & RATING: మనిషి తోడేలు గా మారితే అన్నీ వింతలే !

IMG 20221125 101806 e1669352730149

 

మూవీ: తోడేలు -తెలుగు  (BHEDIYA -HINDI),

రిలీజ్ డేట్: 25-11-2022,

నటీనటులు: వరుణ్ ధావన్, కృతిసనన్, దీపక్ దొబ్రియాల్, అభిషేక్ బెనర్జీ, సౌరబ్ శుక్లా తదితరులు

దర్శకత్వం: అమర్ కౌశిక్ రచన: నిరేన్ భట్

నిర్మాత: దినేష్ విజన్

సినిమాటోగ్రఫి: జిష్ణు భట్టాచార్జి

ఎడిటింగ్: సంయుక్త కాజా

మ్యూజిక్: సచిన్- జిగర్

బ్యానర్: మాడోక్ ఫిల్మ్స్20221125 101347

 

తోడేలు రివ్యూ (Thodelu Movie Review): బహుబలి సినిమా నుండి నిన్న కాంతరా వరకూ  పాన్ ఇండియా సినిమా  ట్రెండ్ నడుస్తుంది. ఏ భాష లో సినిమాను తీసినా అన్నీ భాషా ప్రేక్షకులకు నచ్చేలా స్క్రిప్ట్ టైమ్ లోనే దర్శకులు శ్రద్ద పెడుతున్నారు. అందుకే ఈ మద్య కాలం లో వచ్చే ఇతర భాషా చిత్రాలు తెలుగు డబ్బింగ్ విశయం లో కొంచెం జాగ్రత్తగా చేస్తున్నారు.

 

ప్రస్తుతం  హిందీలో  స్త్రీ (STREE), బాల  (BALA) చిత్రాలు తీసిన దర్శకుడు అమర్ కౌశిక్  మూడో చిత్రంగా వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా  ‘భేడియా’ (Bhediya) అనే సినిమా తీసి, తెలుగుకు ‘తోడేలు’గా (Thodelu) గా మార్చారు.  గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ లో అల్లు అరవింద్ విడుదల చేసిన ఈ సినిమా ఎలా ఉంది?

‘కాంతార’ తర్వాత గీతా ఆర్ట్స్ లో మరో  హిట్‌గా నిలుస్తాదా ??

తెలుగు ప్రేక్షకులు తోడేలు సినిమా కు కనెక్ట్ అవుతారా లేదా?..

మా 18F  మూవీస్ రివ్యూ (MOVIES REVIEW) తెలుగు లో  చదవండి. తెలుసుకోండి..

తోడేలు పోస్టర్

కథ ని పరిశీలిస్తే: (Movie Story):  భాస్కర్ (వరుణ్ ధావన్) ఢిల్లీ లో పనిచేస్తున్న  ఓ సివిల్  కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్‌ అడవి ప్రాంతం లో ఓ రోడ్డు వేయడానికి తాను పనిచేసే ఆఫీసు తరుపున తన ఫ్రెండ్ తో పాటు మరో ఆఫీసు కొలీగ్ తో  వెళతాడు. అడవిలో చెట్లు నరికి… రోడ్డు పనులు పూర్తి చేయాలనుకుంటాడు. ప్రకృతి ఏమైపోయినా పర్వాలేదని, తనకు రోడ్డు వేయడం ద్వారా వచ్చే డబ్బే ముఖ్యమని చెబుతాడు. అయితే… భాస్కర్‌ను అడవి లో అనుకోని విధంగా  ఒక తోడేలు కరుస్తుంది.

తోడేలు కరిచిన  తర్వాత ఏమైంది?

ప్రకృతికి హాని తలపెట్టాలని ప్రయత్నించే వ్యక్తులను ఒక వైరస్ అంతం చేస్తుందని అక్కడి ప్రజల నమ్మకం.

సొ ఆ వైరస్ పేరు  ఏంటి?

అప్పడప్పుడు తోడేలుగా మారుతున్న  భాస్కర్ రాత్రుళ్ళు మనుషులపై ఎందుకు దాడి చేస్తున్నాడు?

తోడేలు మనుషులపైన ఎందుకు దాడి చేస్తుంది ?

పశువుల (వెటనారీ డాక్టర్)కు వైద్యం చేసే అనికా (కృతి సనన్) బాస్కర్ కి ఎలాంటి వైద్యం చేసింది?

ఇంతకు అనికా ఎవరు ? చివరకు భాస్కర్ కి నాయమైందా ?

వంటి ప్రశ్నలు మీకు ఇంటరెస్టింగ్ గా ఉంటే మీ పిల్లల తో సినిమా చూడవచ్చు..

20221125 101229

కధ కధనం (SCREENPLAY) పరిశీలిస్తే: కథ పరంగా ‘తోడేలు’లో కొత్తదనం ఉంది. కానీ, మూడు గంటల సినిమా గా  ఆ కథను కధనం లో  చెప్పడంలో దర్శకుడు అమర్ కౌశిక్ కొంతఅర్దం కానీ స్క్రీన్ ప్లే తో ఇబ్బందికి  లోనయ్యారు. ఈ తరహా కథతో ఈ మధ్య కాలంలోఏ సినిమా  రాలేదని చెప్పవచ్చు.

ఎంతో ఆసక్తికరంగా మొదలైన సినిమాను మధ్య మధ్యలో ఇబ్బందికరమైన కామిడీ సంబాషణాలతో సాగదీశారు. ముఖ్యంగా రెండవ ఘట్టం లో ని  సన్నివేశాలు మరింతగా సాగదీశారు. విషయాన్ని వివరంగా చెప్పడం మానేసి గ్రాఫిక్స్ సహాయం తో  క్రియేటివిటీ తో  చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

ఈ ‘తోడేలు’ మూవీ లో కొంచెం  హారర్, కామెడీ, థ్రిల్స్ ఉన్నాయి. అంతే కాదు… ప్రకృతి, మన అడవుల ప్రాముఖ్యతనూ చాలా బాగా వివరించాడు. అయితే, సామాన్య సినీ ప్రేక్షకులు ఎంత మందిఈ మెసేజ్ తీసుకొంటారు అనేది ప్రశ్న!

మనిషిపై తోడేలు దాడి చేయడం పాయింట్ తో  సినిమా కధ అయినా, ఈ  సీన్స్ ఆసక్తిగా ఉన్నప్పటికీ ముందుగా  హీరో పరిచయ సన్నివేశాలు, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళే సీన్స్ వెళ్లిన తర్వాత వచ్చే పాట సాదాసీదాగా ఉంటాయి.

వరుణ్ ధావన్‌ను తోడేలు కరిచిన తర్వాత అసలు కథ మొదలైంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠకు గురి చేస్తూ సినిమా ముందుకు వెళ్ళింది.సెకండ్ ఆఫ్  లో  ఒక్కసారిగా ఆసక్తి సన్నగిల్లుతుంది. తోడేలుగా మారిన  మనిషి కొందరిపై ఎందుకు దాడి చేస్తున్నాడనేది తెలిశాక… ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడి ఊహకు అర్థం అవుతూ ఉంటుంది. ట్విస్టులు ఊహించడం కూడా పెద్ద కష్టమేమి కాదు, చాలా సాదా సీదాగా ఉన్నాయి.

20221125 101314

సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే: 
సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ బావున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం ఎంత అందంగా ఉంటుందనేది తెరపై బాగా చూపించారు. త్రీడీలో చూసేంత ఎఫెక్ట్స్ ఏమీ కనబడలేదు.

ఈ తోడేలు సినిమా త్రీడీ కంటే 2డీలో చూస్తే బావుంటుంది. తోడేలు వచ్చే కొన్ని సీన్స్ మాత్రమే త్రీడీ థ్రిల్ ఇచ్చాయి. సంగీతం  ఓకే. పాటలు హిందీలో వింటే బావున్నాయి కానీ  తెలుగులో సాహిత్యం సరిగా కుదరలేదు.

20221125 101335

నటి నటుల నటన పరిశీలిస్తే:

హిందీ నటుడు వరుణ్ ధావన్ (VARUN DHAWAN) కమర్షియల్ హీరోగా, కామిడీ హీరో గా ఎంతకూ ముందు బాగానే చేశాడు. కానీ, ‘తోడేలు’ వంటి సినిమా చేయడం ఫస్ట్ టైమ్. ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి ముందుకు రావడం అభినందనీయం.

కొన్ని సీన్స్, డైలాగ్స్ విషయంలో మొహమాటాలు లేకుండా బాగా చేశాడు. తోడేలుగా మారే సన్నివేశాల్లో, కామెడీ టైమింగ్ విషయంలో వరుణ్ ధావన్ నటన కు హ్యాట్స్ ఆఫ్.

హీరోయిన్ గా చేసిన కృతి సనన్ (KRUTI SANON) తోడేలు సినిమా లో  లుక్ అందరికీ నచ్చకపోవచ్చు. అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబాక్ నవ్వించారు. దీపక్ డోబ్రియాల్ క్యారెక్టర్ కొంత మందికి అయినా గుర్తు ఉంటుంది.

చివరాకరి సన్నివేశాల్లో రాజ్ కుమార్ రావు, అపరిక్షిత్ ఖురానా అతిథి పాత్రల్లో సందడి చేసే ప్రయత్నం చేశారు. చివరి ప్రోమోసనల్ పాటలో శ్రద్దా కపూర్ కనిపించారు. దర్శకుడు అమర్ కౌశిక్  ‘భేడియా’, ‘స్త్రీ’ – వీటితో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్న సంగతి తెలిసిందే.

20221125 101312

18FMovies టీం ఒపీనియన్ :

మనిషి అప్పడప్పుడూ తోడేలు రూపం లోకి మారితే? ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ! మనిషిని తోడేలు కరిచిన తర్వాత వచ్చే సన్నివేశాలు అంతే కొత్త ఉన్నాయి. లాజిక్స్ మర్చిపోయి స్క్రీన్ మీద ఏం జరుగుతుందో చూస్తే. ఎంజాయ్ చేస్తాం. మొదటి అంకం తర్వాత స్క్రీన్ ప్లే వీక్ గా ఉండటం వలన సినిమా మీద మొదటి అంకం లో ఉన్న ఎక్స్పెక్తసన్స్ కిందకు జరుతాయి.. .

చివరి అంకం సన్నివేశాల నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. సీన్స్ సీన్స్ గా చూస్తే తోడేలు  సినిమా బావుంటుంది. పిల్లలకు సెలవు రోజు చూపించండి. ఈ తోడేలు దియేటర్స్ లో మాత్రమే నచ్చుతుంది. స్మాల్ స్క్రీన్ మీద ఆ ఎఫెక్ట్ కనిపించదు, తెర మొత్తం డార్క్ గా కనిపిస్తుంది.

జంతువు నుండి  మనిషిగా మారిన మనం జంతువులు కూడా మన బందువులే.. వాటిKIకూడా వాటి ప్రదేశం లో బ్రతికే హక్కు ఉంది. అనేది ఈ సినిమా సారాంశం.

ప్రస్తుతం కొందరి మనుషులు డబ్బుకోశం ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్పే మంచి సినిమా !

18F MOVIES RATING: 2.5 / 5

  • కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *