ALLURI MOVIE REVIEW: శ్రీ విష్ణు అల్లూరి రివ్యూ

అల్లూరి శ్రీవిష్ణు

 

నటీనటులు: శ్రీ విష్ణు, కాయదు లోహర్, సుమన్, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శ్రీనివాసరావు, జయవాణి తదితరులు
దర్శకత్వం: ప్రదీప్ వర్మ
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్
సమర్పణ: బెక్కెం బబిత
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
మ్యూజిక్ డైరెక్టర్: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫి: రాజ్ తోట
ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కోసనమ్
ఫైట్స్: రామకృష్ణన్

రిలీజ్ డేట్: 2022-09-23

alluri sri vishnu1

అల్లూరి సినిమా కధ ఏంటంటే…

అల్లూరి సీతా రామారాజు (శ్రీ విష్ణు) చాలా  సిన్సియర్, సీరియస్ పోలీస్ ఆఫీసర్. ఎవరికి అన్యాయం జరిగినా  సరే సహించడు. తనదైన శైలిలో శిక్ష వేస్తుంటాడు. ఇలాంటి సిన్సియర్ పోలీస్ కి ప్రతి ఫలంగా  ఒకచోటి నుంచి మరో చోటికి ట్రాన్స్‌ఫర్ల రూపంలో అవార్డులు లభిస్తుంటాయి. అదే ఈ అల్లూరి సినిమా కి మెయిన్ పాయింట్.

పోలీస్ జీవితంలో రామరాజు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు ?.. .వాటిని స్వీకరిస్తూ  ఖాకీ డ్రెస్సుకు ఎలాంటి న్యాయం చేశాడు? తాను ఇష్టపడి పెళ్లి చేసుకొన్న భార్య (కాయదు లోహర్)తో దాంపత్య జీవితం ఎలా సాగింది? అనే ప్రశ్నలకు సమాధానం కావాలి అనుకొంటే  అల్లూరి సినిమా చూడాలి.

అల్లూరి 5

మొదటి అంకం (ఫస్టాఫ్) ఎలా ఉంది అంటే ….

ఫస్టాఫ్ అంతా  పోలీస్ కావాలనే పట్టుదలతో ఉన్న ఒక ముస్లిం రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ నజీర్ (తనికెళ్ల భరణి) కొడుకుకు ఎదురైన నిరుత్సాహ సంఘటనతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది.

పోలీస్ ఆఫీసర్‌ అంటే  సాహసాలు, ప్రజల కోసం చేసే  సేవల గురించి పోలీసులు చెప్పడం ద్వారా అల్లూరి కథలోకి రంగ ప్రవేశం చేస్తాడు. ఫస్టాఫ్‌లో నక్సలైట్లతో ఎపిసోడ్, యువతిపై అత్యాచార ఘటన హైలెట్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు యాక్షన్ ఎపిసోడ్ మాస్ ప్రేక్షకులను కేక పెట్టించేలా ఉంటుంది.

అల్లూరి 6

రెండవ  అంకం (సెకండ్ హాఫ్)ఎలా ఉంది అంటే ….

ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి అల్లూరిని హైదరాబాద్ పాతబస్తీకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అక్కడ జరిగే సంఘటనలు, ప్రజల ప్రేమను, అభిమానాన్ని సంపాదించే సీన్లు కొత్తగా ఉంటాయి.

చివర్లో పాకిస్థాన్ ఉగ్రవాదుల ఎపిసోడ్ కాస్త సాగదీసినట్టు.. రొటిన్‌గా రెగ్యులర్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథను లాగి లాగి సా ..గ దీయడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అన్నట్టు ఉంది .

శ్రీవిష్ణు

దర్శకుడు ప్రదీప్ వర్మ గురించి చూస్తే :

ప్రదీప్ వర్మ కి ఇది మొదటి సినిమా .. అల్లూరి ని సినిమా కధ గా  రాసుకొన్న పాయింట్.. కథను ఎపిసోడ్ వారీగా రాసుకొన్న విధానం బాగున్నా  కొత్త  సన్నివేశాలు లేకపోవడం, కథ చెప్పే తీరు కొత్తగా లేకపోవడం ఇబ్బంది కలిగించే అంశం లా ఉంది.

అయితే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ విష్ణును చూపించిన విధానమే కాస్త కొత్తగా ఉంది. రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. ఇక దర్శకుడిపై ఆగడు, ఘర్షణ చిత్రాల ప్రభావం ఎక్కువగానే ఉందనిపిస్తుంది. ప్రదీప్ వర్మ తనవంతుగా పొలీస్ కథను ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు.

అల్లూరి 4

శ్రీ విష్ణు కి ఇది మాస్ మసాలా బొమ్మ :

అల్లూరి సినిమా గురించి ఏమైనా చెప్పుకోవాలంటే.. శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ గురించే చెప్పాలి. ఇప్పటివరకు సెన్సిటివ్ రోల్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్న శ్రీ విష్ణు.. అల్లూరి సినిమాలో మాస్ హీరోగా చెలరేగిపోయారు.

ఆ లుక్, గెటప్‌కు తగినట్గుగా బాడీ లాంగ్వేజ్ మెంటాయిన్ చేసిన విధానం సూపర్బ్.  యాక్షన్ సీన్లలో ఇక చెప్పాల్సిన పనలేదు. ఇప్పటి వరకు చూసిన శ్రీ విష్ణు వేరు.. అల్లూరి తర్వాత శ్రీ విష్ణు వేరు అనే రేంజ్‌లో ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

అల్లూరి లో  రొటీన్ కథ, సంఘటనలు ఉన్నప్పటికీ.. తనదైన శైలిలో నటించి మరో రేంజ్‌కు తీసుకెళ్లాడనికి ప్రయత్నం చేశాడు  ఇక కాయదు లోహర్‌తో రొమాన్స్‌ విషయంలో బాగానే నటించి మెప్పించాడు. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో విష్ణు అదరగొట్టాడు అని చెప్పాలి. మీకు కూడా అల్లూరి సినిమా తో  కొత్తగా కనిపిస్తాడు శ్రీ విష్ణు .

alluri1

చివరాకరకు ఎలా  అనిపించింది అంటే?

పోలీస్ కథతో వచ్చే సినిమాల లో  లవ్, యాక్షన్, సీరియస్ ఎలిమెంట్స్ చక్కగా కుదిరితే ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. అయితే ఈ సినిమాలో అలాంటి అంశాలకు కొదువేమి ఉండదు….

కానీ కొత్తగా, ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు బీ, సీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చే అంశాలు బాగున్నాయి.

మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించగలిగితే సినిమా కమర్షియల్‌గా భారీగా వర్కవుట్ అవుతుంది. పోలీస్ కథలను, శ్రీ విష్ణు నటనను ఆస్వాదించడానికి థియేటర్లలో ఈ సినిమా ఓసారి చూడొచ్చు.

alluri sri vishnu1

18F Opinion:  శ్రీ విష్ణు సాహసానికి హ్యాట్స్ ఆఫ్ .. లక్కీ మీడియా లక్క పెట్టిని  (డబ్బుల బాక్స్ ఆఫీస్ )ని ఎతుక్కోవాలి.

-కృష్ణా ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *