మూవీ: అలిపిరికి అల్లంత దూరం లో
విడుదల తేదీ : నవంబర్ 18, 2022
నటీనటులు: ఎన్ రావణ్ రెడ్డి, శ్రీ నికిత, అలంకృత షా, రవీందర్ బొమ్మకంటి, ప్రసాద్ బెహరా, ఎం.ఎస్, లహరి గుడివాడ, అమృతవర్షిణి సోమిశెట్టి
దర్శకుడు : ఆనంద్ జె
నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి
సంగీత దర్శకుడు: ఫణి కళ్యాణ్
సినిమాటోగ్రఫీ: డి.జి.కె
ఎడిటర్: సత్య గిడుతూరి
కొత్త నటుడు రావణ్ నిట్టూరు (Raavan Nitturu) కధానాయకుడిగా కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్ పై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మించిన చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఈ చిత్రం ఈ రోజు శుక్ర వారం విడుదల అయింది. మరి ఈ సినిమా కధ కధనం ఎలా ఉందో రివ్యూ లోకి వెళ్లి చదువుకొందామా !
కథ ని పరిశీలిస్తే:
వారధి (Raavan Nitturu) తిరుమల తిరుపతి లో చిన్న షాప్ పెట్టుకుని దేవుడు పాటాలు అమ్ముతూ లైఫ్ లో సెటిల్ కావాలని ఆశ పడుతుంటాడు. అలాగే ప్రేమించిన అమ్మాయి కీర్తిని (Sri Nikhitha) పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు.
వారధి ఫ్యామిలీ ఆర్థికంగా వెనుకబడి ఉంటుంది. అంతలో వారధి జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల కారణంగా రెండు కోట్లు డబ్బు రాబరీ చేస్తాడు.
ఆ దొంగ తనం తర్వాత వారధి జీవితంఎలాంటి మలుపు తిరిగింది?,
వారధి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు?,
వారది కీర్తి ప్రేమ పొందుతాడా ? పెళ్లి జరుగుతుందా ?
అలాగే ఈ కథ ఎలా ముగిసింది ?
అనేది మిగిలిన కథ.
కధ కధనం (SCREENPLAY) పరిశీలిస్తే:
కధ బాగున్న కధనం (స్క్రీన్ – ప్లే ) లో సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లే ని సాగతీయడంతో మనకు కొంచెం బోర్ అనిపిస్తుంది.
ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ కి ఇచ్చిన గ్రాఫ్ కూడా బాగాలేదు. అయితే దర్శకుడు ఆనంద్ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ, అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సీన్స్ మరియు ఆఖరి ఘట్టం ( క్లైమాక్స్) సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం కూడా బాగాలేదు అనిపిస్తుంది.
కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ డ్రామా పండించలేదు. దర్శకుడు సినిమాని మొదటి అంకం లో ( ఫస్ట్ ఆఫ్ ) ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి ఆ తర్వాత రెండవ అంకం (సెకండ్ ఆఫ్ ) లో అనవసరమైన సీన్స్ తో కథనుకధనం తో పక్క దారి పట్టించాడు.
చివరాకరికి ఈ ఎమోషనల్ రాబరీ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఒకే అనిపించినా, ఓవరాల్ గా అవసరానికి మించిన స్లో సన్నివేశాలు లేకుండా ఇంకా కొంత గ్రిప్పింగ్ తో సీన్స్ ఉంటే బాగుండేది.
నటి నటుల నటన పరిశీలిస్తే:
అలిపిరికి……. సినిమా లో ప్రధాన పాత్ర అయిన రావణ్ నిట్టూరు పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు బాగానే నటించాయి అని చెప్పాలి.
ఈ సినిమాలో హీరోగా నటించిన రావణ్ నిట్టూరు తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు.
హీరోయిన్ పాత్రలో నటించిన శ్రీ నికిత కూడా చాలా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. హీరో ఫ్రెండ్ పాత్ర లో యం స్ నటన కామిడీ టైమింగ్ బాగున్నాయి. టోపీలు అమ్ముతూ టోపీ పెట్టె కామిడీ నచ్చింది.
సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:
దర్శకుడి పని తనం పరిశీలిస్తే…ముఖ్యంగా కామెడీ టోన్ తో సాగే రాబరీ సీన్ అండ్ మిగిలిన సీక్వెన్స్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సస్పెన్స్ ఎమోషనల్ రాబరీ డ్రామా లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు ఆనంద్ బాగా తీశాడు.
ముఖ్యంగా ఆకరి ఘట్టం ( క్లైమాక్స్లో) రివీల్ అయ్యే కంటెంట్ తో బాగా ఆకట్టుకున్నాడు
సినిమా కధ లో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడం గ్రిప్పింగ్ సీన్స్ ప్లోతో సాగక పోవడం స్లో గా సాగిందా అనిపిస్తుంది.
సంగీత దర్శకుడు సమకూర్చిన బాణీలు, పాటలు బాగున్నాయి. ఆలిపిరి సినిమా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నా .. కెమెరామెన్ మాత్రం వాటిని తెరకెక్కించిన విధానం బాగాలేదు.
ఎడిటింగ్ కూడా బాగాలేదు. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగాలేదు. తక్కువ బడ్జెట్ కాబట్టి ఇలానే ఉంటాయి అనుకొంటూ సారి పెట్టుకోవాలి.
18 ఫ్ టీం ఒపీనియన్:
‘అలిపిరికి అల్లంత దూరంలో’ అంటూ వచ్చిన ఈ రాబరీ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలో కొన్ని సీన్స్ బాగున్నా, కథలోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ముఖ్యంగా క్లైమాక్స్ బాగున్నాయి.
కథ కథనాలు స్లోగా సాగడం, మొదటి అంకం లో ( ఫస్ట్ హాఫ్) ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
ఓవరాల్ గా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు (రోబరీ, త్రిల్లింగ్ కంటెంట్ మెచ్చే) మాత్రమే కనెక్ట్ అవుతుంది. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం నచ్చదు.
ఆలిపిరికి అల్లంత దూరం పాటించడం మంచిది.
18F MOVIE RATING: 2 /5
- కృష్ణ ప్రగడ..