సినిమా రివ్యూ : క్రేజీ ఫెలో
నటీనటులు : ఆది సాయి కుమార్, దిగంగనా సూర్యవన్షి, మిర్నా మీనన్, నర్రా శ్రీనివాస్, సప్తగిరి, అనీష్ కురువిల్లా, వినోదిని వైద్యనాథ్ తదితరులు
ఛాయాగ్రహణం : సతీష్ ముత్యాల
సంగీతం: ఆర్ఆర్ ధృవన్
సమర్పణ : లక్ష్మీ రాధామోహన్
నిర్మాత: కె.కె. రాధామోహన్
రచన, దర్శకత్వం : ఫణికృష్ణ సిరికి
విడుదల తేదీ: అక్టోబర్ 14, 2022
చేసే సినిమా కధల లో ఒక్క సినిమా అయినా హిట్ అవ్వదా అంటూ తన దగ్గరకు వచ్చిన కధ లలో విజయం కోసం దీయటర్స్ మీద రెండు మూడు నెలల కొకసారి ప్రత్యక్యమ్ అవుతున్న యువ కథానాయకుడు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar).
ఆది సరైన సూపర్ హిట్ అందుకుని చాలా ఏళ్లు అయ్యింది . ప్రస్తుతం మరో కొత్త దర్శకుడుతో ‘క్రేజీ ఫెలో’ అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చారు.
ఈ క్రేజీ ఫెల్లో సినిమా కి ఆ పేరే ఎందుకు పెట్టారు?
ఆది సాయికుమార్ క్రేజీ గా హిట్ కొట్టాడా ?
ఇద్దరమ్మాయులుతో లవ్ ఏంటి? ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు ?
వంటి ప్రశ్నలకు సమాదనాలు కావాలంటే క్రేజీ గా సినిమా ను ఫ్రెండ్స్ లేదా ఫామిలితో దీయటర్ లో చూసి తెలుసుకోవాలసిందే..!
కథ (STORY) ను పరిశీలిస్తే:
అభిరామ్ (ADHI SAIKUMAR) అన్నావదినల తో లైఫ్ లైఫ్ జాలిగా క్రేజీ గా ఎంజాయ్ చేస్తుంటాడు. అన్నయ్య వదినలు చాలా గారాబంగా పెంచుతారు. కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత అభి అన్నయ్య ( ANISH KURUVILLI) తమ్ముడు అభి ఫ్రెండ్స్, పబ్స్, పార్టీలు అంటూ తిరుగుతున్నాడని… తమ్ముడిని ఒక దారిలో పెట్టాలని స్నేహితుడి కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళమంటాడు.
అక్కడ ఆఫీసు లో మధుమిత (DIGINGANA SURYAVANI ) చూసి ఇస్తాపడుతూ ట్రై చేస్తూ ఉంటాడు. ఆమెకు ఆల్రెడీ అభిరామ్ క్రేజీ పనులు తెలిసి అభి గతంలో చేసిన వెధవ వేషాలు చూసి అభి తో ఎప్పుడూ గొడవ పడుతుంటారు. మధు యాక్సన్ కి అభి కూడా రియాక్ట్ అవుతూ మధు అంటే ఆయిస్తాత పెంచుకొంటాడు.
విచిత్రంగా చిన్ని, నాని అనే పెట్ నేమ్స్ తో డేటింగ్ యాప్‌లో చాటింగ్ చేసుకొంటూ ఒకరిని ఒకరు చూడ కుండ డీప్ లవ్ లోకి వెళతారు హీరో హీరోయిన్. ఒక రోజు ఒకర్ని ఒకరు కలుసుకొని తమ ప్రేమను ఇంకా ముందుకు తీసుకు వెళ్దాము అనికొన్నప్పుడు, తనతో ఛాటింగ్ చేసే చిన్ని అనుకుని మరొక చిన్ని కృష్ణ (MIRNA MENON) కి ప్రపోజ్ చేస్తాడు మన క్రేజీ నాని అనబడే అభిరామ్.
తర్వాత అనుకోని పరిస్థితుల కారణంగా నాని ఇంటికి చిన్ని అనే అమ్మాయి వస్తుంది. నాని మరియు తన వదిన ల ప్రేమ కు ఇంప్రెస్ అయ్యి పెళ్లికి రెడీ అవుతుంది.
తాను ఛాట్ చేసిన చిన్ని, తనతో పెళ్ళికి రెడీ అయిన చిన్ని ఒకరు ఒకరేనా అని అభి కి…తాను ఆఫీసులో గొడవ పడే అభిరామే తనతో ఛాటింగ్ చేసే నాని అని మధుమితకు..
ఎప్పుడు తెలుస్తుంది ?
తెలిసిన తర్వాత ఏమైంది?
ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు?
ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకున్నారు ?
నాని అనే అభిరామ్ చివరకరకు ఏం చేశాడు? అనేది సినిమా కధ.
కధనం ( SCREENPLAY) పరిశీలిస్తే:
జయాపజయాలతో సంబంధం లేకుండా ఆది సాయి కుమార్ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రతిసారీ వినిపించే విమర్శ… ఆది కొత్తగా కనిపించడం లేదని, కొత్తగా ప్రయత్నించడం లేదని! ఆయన నటన రొటీన్‌గా ఉంటుందని కొందరు ప్రేక్షకులూ చెప్పారు! ‘క్రేజీ ఫెలో’ చూసిన ప్రేక్షకుల నుంచి ఆ మాట వినిపించే అవకాశాలు తక్కువ.
క్రేజీ ఫెల్లో కథను కామెడీతో మిక్స్ చేసి చెప్పిన విధానం నచ్చుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో లవ్ సీన్స్ సీన్స్ కామిడీ బాగా వర్కవుట్ అయ్యింది. కథ లో సిట్యువేసినల్ సాంగ్స్ బాగా ఉన్నాయి.
దర్శకుడు ఫణి కృష్ణ స్క్రీన్ ప్లే రైటింగ్‌లో మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆది సాయి కుమార్ నర్రా శ్రీనివాస్ తో బాగానే చేయించారు. కామెడీ విషయంలో కొన్ని సన్నివేశాల్లో మీటర్ దాటి చేసినా అదే ఓవర్ యాక్షన్ అని సెల్ఫ్ సెటైర్ డయాలాగ్స్ తో హాస్యం పండించిన తీరు బాగుంది.
‘క్రేజీ ఫెలో’ ఫస్టాఫ్ లో ఫ్రెండ్స్ మద్య సీన్స్ విషయంలో ఇంకా కొత్తగా చేసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే క్రేజీ ఫెల్లో సినిమా మరో లెవెల్ లో ఉండేది అనేది మా ఆలోచన. ఫ్రెండ్స్ మద్యలో కామెడీ మీద పెట్టిన కాన్సంట్రేషన్ ఎమోషన్స్ మీద పెట్టలేదు అనిపించింది.
హెరోయిన్స్ ఇద్దరి పాత్రల్లో భావోద్వేగాలను చూపించే అవకాశం ఏంటో ఉన్నా దర్శకుడు కామిడీ కె ఎక్కువ ఇంపోర్టెన్స్ ఇచ్చినట్టు ఉంది. ప్రేమ విషయంలోనూ ఆ కాన్సంట్రేషన్ కొరవడింది.
హీరోతో చిన్ని కృష్ణ ( మీర్న మీనన్ ) ప్రేమలో పడటానికి గల కారణాన్ని ఇంకా ఏమోసనల్ గా చూపించాల్సింది.
నటుల నటన ( ARTIST FORMARMENCE) పరిశీలిస్తే:
ఆది సాయి కుమార్ లుక్ బావుంది. ఆ లుక్ చేంజ్ చేయడం వల్ల నటనలో కూడా డిఫరెన్స్ కనిపించింది. కొన్ని క్లోస్ షాట్స్ లో అయితే మిల్కీ బాయ్ లా క్యూట్ గా ఉన్నాడు. నర్రా శ్రీనివాస్ ఫర్ఫెక్ట్ టైమింగ్ తో కూడిన డైలాగ్స్ తో పాటు రియాక్సిన్స్ కి థియేటర్ లో అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. కామెడీ పరంగానూ అది ఈసారి చాలా పర్ఫెక్ట్ టైమింగ్ తో చేసినట్టు ఉంది.
దిగంగనా సూర్యవని తన పాత్ర ను చాలా బాగా పోసించారు. మిర్నా మీనన్ ఆకట్టుకుంది. ఆమె ముఖం రజిషా విజయన్‌లా ఉంది.
నర్రా శ్రీనివాస్ ఫుల్ లెంగ్త్ కామిడీ కేరెక్టర్ చాలా న్యాచురల్ మంచి టైమింగ్ తో బాగా చేశాడు. ఆది నర్రా మధ్య సీన్స్‌లో కామెడీ చాలా బాగా వర్కవుట్ అయ్యింది. సప్తగిరి, అనీష్ కురువిల్లా పాత్రలకు తగినట్లు చేశారు.
హీరో వదినగా నటించిన వినోదిని వైద్యనాథ్ డైలాగ్స్ డబ్బింగ్ మొదట కొంత ఇబ్బంది గా ఇనపడినా తెలుగు నటి కాదు కాబట్టి అలా ఉంటేనే న్యాచురల్ గా ఉంటుంది. సినిమా ఎండ్ కి వచ్చే సరికి ఆ పర భాశా నటులు తెలుగు మాట్లాడితే కొత్తగా అందులో కూడా కామెడీ గా మాట్లాడినట్టు ఉంది.
18F టీం ఒపీనియన్:
క్రేజీ ఫెల్లో కథ మొదటిలో రొటీన్ కామిడీ సీన్స్ తో ఉన్నా.. ఆది సాయి కుమార్ గత సినిమాలతో పోలిస్తే లుక్ వైస్ యాక్టింగ్ వైస్ చాలా ఇంపర్వవేమెంట్ ఉంది. సెకండాఫ్‌లో ట్రయాంగిల్ లవ్ సీన్స్కా, అది వినోదిని (వదిన పాత్ర ) మద్య కమెడీ వర్కవుట్ అయ్యింది. ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ తో కానీ వీక్ ఎండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ‘క్రేజీ ఫెలో’ సినిమా ని ఓక ఆప్షన్ గా పెట్టుకోండి .
వన్ వర్డ్ రివ్యూ :
క్రేజీ సినీ లవర్స్ ఇస్తపడే క్రేజీ ఫెల్లో …
18F రేటింగ్ : 2.75/5
Review by Krishna Pragada.