Movie Review & Rating: నవ్విస్తూనే బాధ్యతలు గుర్తుచేసే మారుతీనగర్ సుబ్రమణ్యం రివ్యూ మరియు రేటింగ్ !

mns review e1724384768426

చిత్రం: మారుతీనగర్ సుబ్రమణ్యం, 

విడుదల తేదీ : ఆగస్టు 23, 2024,

నటీనటులు: రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ తదితరులు,

దర్శకుడు: లక్ష్మణ్ కార్య,

నిర్మాతలు : బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య

సంగీత దర్శకుడు: కళ్యాణ్ నాయక్,

సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాలరెడ్డి,

ఎడిట‌ర్ : బొంతల నాగేశ్వర రెడ్డి,

మూవీ: మారుతీనగర్ సుబ్రమణ్యం రివ్యూ ( Maruthinagar Subramanyam Movie Review) ,

ప్రోమోషణల్ కంటెంట్ తో పాటు, సెలబ్రిటీస్ తోర్పాటు తో గ‌త కొన్ని రోజులుగా తెలుగు ఆడియెన్స్‌లో మంచి బజ్  కల్పించిన  చిన్న సినిమాల జాబితాలో మారుతి నగర్ సుబ్రమ‌ణ్యం ఒక‌టి. రావుర‌మేష్ మెయిన్ లీడ్ లో న‌టించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పుష్ప టీం అల్లు అర్జున్, సుకుమార్ లు  గెస్ట్‌గా రావ‌డంతో మారుతి నగర్ సుబ్రమ‌ణ్యంపై హైప్ ఏర్ప‌డింది.

ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో అంకిత్ కొయ్య‌, ఇంద్ర‌జ‌, ర‌మ్య ప‌సుపులేటి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాను అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ స‌తీమ‌ణి త‌బిత సమార్పిస్తూ, మైత్రి మూవీస్ నైజాం లో రిలీజ్‌చేస్తుండ‌టం ట్రేడ్ వర్గాలలో టాక్ ఆఫ్ తే ఇండస్ట్రి అయిన  ఈ మారుతి నగర్ సుబ్రమ‌ణ్యం సినిమా ఈ శుక్రవారం థియేట‌ర్ల‌లో విడుదల అవుతుంది.

mns review 3

కధ పరిశీలిస్తే (Story Line): 

మారుతీ నగర్ లో ఉండే సుబ్రహ్మణ్యం (రావు రమేశ్) చిన్నతనం నుంచే గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యంకు స్కూల్ టీచర్ గా  ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, అది కాస్త కోర్టు కేసులో ఇరుక్కుని దూరం జరుగుతూ మరో ఉద్యోగం లేకుండా చేస్తుంది.

అలా  పెళ్లయి 25 ఏళ్ళు అయినా సుబ్రహ్మణ్యం మాత్రం ఇంకా తన లైఫ్ లో ఏదో రూపం లో అద్భుతం  జరుగుద్ది, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తోంది అని ఏ పని చేయకుండా ఇంటికే పరిమితం అయి తన భార్య కళారాణి (ఇంద్రజ) సంపాదన మీద పడి బతికేస్తూ ఉంటాడు.

మరోవైపు సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్(అంకిత్) కూడా తండ్రిలానే ఊహల్లో పెద్దింటి ఆబ్బాయి గా ఫీల్ అవుతూ తనకు నచ్చిన ఎదురింటి  కాంచన(రమ్య)తో ప్రేమలో పడటం, ఈ మధ్యలో సుబ్రహ్మణ్యం అకౌంట్ లో 10 లక్షలు పడటం వంటివి జరుగుతాయి.

ఇంతకీ సుబ్రహ్మణ్యం అకౌంట్ లోకి వచ్చిన ఆ 10 లక్షల కథ ఏమిటి ?,

సుబ్రహ్మణ్యం అకౌంట్ లోకి ఎలా వచ్చి పడ్డాయి ?,

ఆ డబ్బులతో సుబ్రహ్మణ్యం ఏం చేశాడు ?,

ఎదురింటి  కాంచనమాల కధ ఏమిటి ?,

అర్జున్ తో కాంచన లవ్ కి కారణం ఏమిటి ?,

చివరాకరకు సుబ్రహ్మణ్యం కి జాబ్ వస్తుందా ?, డబ్బులు సమస్య తీరిందా అనేది మిగిలిన కధ. ఈ ప్రశ్నలు మీకు ఇంటరెస్ట్ అనిపించి, జవాబులు తెలుసుకోవాలి అంటే వెంటనే మీ దగ్గరలొని థియేటర్స్ లోకి వెళ్ళి  మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా చూసేయండి.

mns review 5

కధనం పరిశీలిస్తే (Screen – Play):

లక్ష్మణ్ కార్య తీసుకున్న కథాంశం, మరియు రావు రమేశ్ – అంకిత్ కొయ్య పాత్రలు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో సిల్లీగా సాగుతుంది. పైగా కీలక సన్నివేశాలు కూడా లాజికల్ గా కనెక్ట్ కావు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రతో పాటు ఆమె తల్లిదండ్రుల పాత్రలను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

అలాగే, ఎవరికో పడాల్సిన డబ్బులు ఇంకెవరి ఖాతాలోనో పడితే..? ఈ కోణంలో నడిచే డ్రామా కూడా ల్యాగ్ అయ్యింది. నిజానికి పాతికేళ్ళు కేవలం భార్య సంపాదన మీద ఆధారపడి బతికే సుబ్రహ్మణ్యానికి ఒక్క సారిగా లక్షలు వచ్చి పడితే.. అతని మనస్తత్వం ఎలా ఉంటుంది ?, అతని ప్రవర్తన ఎలా మారిపోతుంది ? వంటి అంశాలను ఇంకా ఎఫెక్టివ్ గా చూపించి ఉండి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడు స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ఎంటర్ టైన్ గా మలచలేకపోయారు.

mns review 4

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

లక్ష్మణ్ కార్య దర్శకుడిగా ఆకట్టున్నా.. స్క్రీన్ ప్లే పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.

ఈ సినిమాలో కామెడీ టచ్ బాగుంది. ఓపెనింగ్ నుంచి సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం, అతని కొడుకు పాత్ర మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఏళ్ళ తరబడి కోర్టులో ఆగిపోయిన గవర్నమెంట్ జాబ్ కేసు, అనుకోకుండా అకౌంట్ లో డబ్బులు పడటం.. ఈ రెండిటిని లింక్ చేస్తూ దర్శకుడు రాసుకున్న కామెడీ సీన్స్.. మొత్తమ్మీద ఈ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమాలో ఫన్ తో పాటు కొన్ని చోట్ల ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది.

 ప్రధాన పాత్రలో నటించిన రావు రమేశ్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ‘సుబ్రమణ్యం’ పాత్రను ఆయన చాలా బాగా పండించారు. ముఖ్యంగా రావు రమేష్ డైలాగ్స్, ఆయన హావభావాలు బాగానే నవ్వు తెప్పించాయి.

ఎమోషనల్ టోన్ లో నడిచిన భార్య పాత్రలో ఇంద్రజ ఆకట్టుకుంది. ఉద్యోగం చేస్తున్న మద్య తరగతి భార్యగా పాత్రలో ఒదిగి నటించింది.

యువ నటుడు అంకిత్ కొయ్య నటన చాలా బాగుంది. ముందు వారమే వచ్చిన ఆయ్ చిత్రంలో కూడా తననటన తో ఆకట్టుకొన్నాడు. ఈ చిత్రం లొని పాత్రలో నటన చూసి చాలా మంది డైరెక్టర్ రచయితలు మారాన్ని అవకాశాలు ఇవ్వవచ్చు.  అంకిత్ కొయ్య కి ఫిల్మ్ ఇండస్ట్రి లో మంచి ఫీచర్ ఉంది అని చెప్పవచ్చు.

తెలుగ అమ్మాయి రమ్య పసుపులేటి హీరోయిన్ గా మెప్పిస్తూ అందాల ప్రదర్శనతో  సినిమాకి ప్లస్ అయ్యింది.

ఇతర కీలక పాత్రల్లో నటించిన హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్, నూకరాజు మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

mns review 3

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగా సెట్ అయ్యింది.

ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది.

సినిమాటోగ్రఫర్  ఎం.ఎన్. బాలరెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా సీన్స్ న్యాచురల్ గా ఉన్నాయి.

నిర్మాతలు బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ ప్రజెంటర్ గా ఉండటం వలన సినిమా ప్రోమోసన్స్ పెరిగి ఎక్కువ మరియు మంచి థియేటర్స్ లో విడుదల అవ్వడం వలన సినీ లవర్స్ కి అద్భుత ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసిన అనుభూతి కలుగుతుంది.

mns review 9

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

అనుకోకుండా వచ్చి పడిన డబ్బు వల్ల ఒక మద్య తరగతి సామాన్యుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే లైన్ తో దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ సినిమా తెరకెక్కించారు. అయితే ఈ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనం మాత్రం సినిమాకు గ్లోరీ ని తీసుకొచ్చింది.

నిజానికి పక్కనోడి సమస్య మనకు చాలా కామెడీగానే అనిపిస్తుంది అనే లైన్ తో ఈ సినిమా నడిపించేసాడు లక్ష్మణ్. అక్కడక్కడ చిన్నచిన్న లాజిక్స్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతున్నా కొన్నింటిని కన్విన్స్ చేస్తూ దర్శకుడు కథలోకి ప్రేక్షకులను తీసుకువెళ్లిన విధానం బాగుంది.

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అల్లు అర్జున్ కి ట్రిబ్యుట్ లాగా చేసిన మేడం సార్ మేడం అంతే అనే సాంగ్ బాగా ఆకట్టుకునేలా ఉంది. అలాగే అల్లు అర్జున్ రిఫరెన్స్ లు కూడా చాలా వాడారు కాబట్టి ఆయన అభిమానులకు సినిమా బాగా నచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఓవరాల్ గా ఈ మారుతీ నగర్ సుబ్రమణ్యం సినీ ప్రేక్షకులను అందరినీ అలరిస్తుంది. ఫ్రెండ్స్, ఫామిలీస్ తో కలిసి చూడవలసిన క్లీన్ ఎంటర్టైనర్.

చివరి మాట: నవ్విస్తూనే బాధ్యతలు గుర్తుచేసే సుబ్రమణ్యం !

18F RATING: 3 / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *