MOVIE PRODUCER ABHISEK AGARWAL Adopted Village in TELANGANA : సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ దత్తత తీసుకొన్న గ్రామం ఏంటో తెలుసా ?

ABHISEK AGARWAL PHOTO

సక్సెస్ ఫుల్, డైనామిక్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలంగాణ లోని  తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని  చంద్రకళ ఫౌండేషన్  ద్వారా అభివృద్ది చేయనున్నారు.

చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివాస్‌కు హాజరవుతున్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి

ABHISEK AGARWAL EVENT

సక్సెస్ ఫుల్, డైనామిక్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాలతో పాటు తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

కోవిడ్ 19 మహమ్మారి సమయంలో చాలా సామాజిక సేవ చేశారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకేశారు.

గత రెండు బ్లాక్‌బస్టర్‌లతో మంచి లాభాలను ఆర్జించిన ఈ యువ నిర్మాత ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు. యాదృచ్ఛికంగా.. తిమ్మాపూర్ కేబినెట్ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి జన్మస్థలం.

KISAN REDDY ABHISEK AGARWAL e1666985437881

అభిషేక్ అగర్వాల్- మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం వుంది. వివిధ ఈవెంట్‌లు , ఫంక్షన్లలో చాలాసార్లు వీరు కలిసి కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే.

ABHISEK KISAN REDDY

అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు.తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు.

ABHISEK AGARWAL EVENT 1

చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్ అక్టోబర్ 30న శ్రీ జి. కిషన్ రెడ్డి సమక్షంలో జరగనుంది. ఈ కార్యక్రమంకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదిక కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *