రీ రికార్డింగ్ జరుపుకుంటున్న మోహన్ లాల్  1000 కోట్లు మూవీ !

1000 kotlu1 e1735825632888

మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “1000 కోట్లు. గతంలో “100 కోట్లు”వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన కాసుల రామకృష్ణ ప్రస్తుతం “1000 కోట్లు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత ఈ చిత్రం కేరళ లో డబ్బింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటుంది.

1000 kotlu

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాసుల రామకృష్ణ మాట్లాడుతూ” మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో 1000 కోట్లు పేరుతో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నాము. మోహన్ లాల్ సరసన కావ్య మాధవన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో విశేషమేమిటంటే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ నాగ మహేష్ మోహన్ లాల్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు.ఈ చిత్రానికి ప్రముఖ పీఆర్ ఓ వీరబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రీ రికార్డింగ్ కార్యక్రమాలు ముగించుకుని చిత్రాన్ని జనవరి ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అని అన్నారు.

మోహన్ లాల్, కావ్య మాధవన్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాతీష్ వేగ, డిఓపి: ప్రదీప్ నాయర్
, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాసింశెట్టి వీరబాబు, నిర్మాతలు: కాసుల శ్రీకర్ గుప్తా, కాసుల రామకృష్ణ, దర్శకత్వం: జోషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *