మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్  ‘L2 ఎంపురాన్’ అప్ డేట్! 

IMG 20250316 WA0211 scaled e1742141794177

కంప్లీట్ యాక్టర్ మోహన్‌ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయబోతోన్నారు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.

IMG 20250316 WA0234

మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా తెరపైకి రాబోతోన్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ’నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

IMG 20250316 WA0235

అక్టోబర్ 5, 2023న ఫరీదాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత సిమ్లా, లేహ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముంబై, కేరళతో సహా పలు ప్రదేశాలలో షూటింగ్ జరిగింది.

1:2.8 రేషియోతో అనమోర్ఫిక్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ అఖిలేష్ మోహన్, ఆర్ట్ డైరెక్టర్ మోహన్‌దాస్, స్టంట్ డైరెక్టర్ స్టంట్ సిల్వా, క్రియేటివ్ డైరెక్టర్ నిర్మల్ సహదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ దీపక్ దేవ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు.

జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 9న సినిమాలోని పాత్రను పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ అందరినీ మెప్పించింది. ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానెల్‌లలో గత కొన్ని రోజులుగా సినిమాలోని అన్ని పాత్రలను రివీల్ చేస్తూ వదిలిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఫిబ్రవరి 26న ఖురేషి-అబ్రహం అలియాస్ స్టీఫెన్ నేడుంపల్లిగా మోహన్‌లాల్ పాత్రను గ్రాండ్‌గా రివీల్ చేయడంతో అభిమానులలో అంచనాలను మరింత పెంచింది.

మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ హై ఆక్టేన్, స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *