కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు.
బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ ‘కాన్సెప్ట్ మోషన్ పోస్టర్’ ని డైరెక్టర్ & రైటర్ ‘బివిఎస్ రవి’ ట్విట్టర్ ద్వారా డిజిటల్ లాంచ్ చేస్తూ, గతంలో హీరో పార్వతీశం తన మూవీస్ తో ప్రేక్షకులని అలరించాడని ‘మార్కెట్ మహాలక్ష్మి’ తో మంచి సక్సెస్ అందుకోవాలని టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
డైరెక్టర్ ‘వియస్ ముఖేష్’ మాట్లాడుతూ: సినిమా ఇండస్ట్రీ కి కొత్త వాళ్ళు ఎవ్వరు వచ్చిన మొదటగా వెల్కమ్ చెప్పి ప్రోత్సహించే వ్యక్తుల్లో ‘బివిఎస్ రవి’ గారు ఒకరు. మా సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయమని అడగగానే, ఓకే చెప్పి మా టీమ్ ని బ్లెస్స్ చేసినందుకు చాలా సంతోషం.
నటీనటులు:
పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు….
టెక్నికల్ టీమ్:
రచన & దర్శకత్వం: వియస్ ముఖేష్,, ప్రొడ్యూసర్: అఖిలేష్ కలారు, ప్రొడక్షన్ హౌస్: బి2పి స్టూడియోస్ , సంగీతం: మిష్టర్ జో, సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల, ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి పాటలు: వియస్ ముఖేష్, మిష్టర్ జో, బ్యాగ్రౌండ్ స్కోర్: సృజన శశాంక, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లోకేష్. పి, కొరియోగ్రఫీ: రాకీ, ఆర్ట్ డైరెక్టర్: సంజన కంచల, కాస్ట్యూమ్ డిజైనర్: ప్రియాంక పాండ, పోస్టర్ డిజైనర్: రానా, పీఆర్వో: తిరుమలశెట్టి వెంకటేష్