మూవీ: “మార్టిన్ లూథర్ కింగ్”
విడుదల తేదీ : అక్టోబరు 27, 2023
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, చక్రధర్, రాఘవన్ తదితరులు,
దర్శకుడు : పూజ అపర్ణ కొల్లూరు,
నిర్మాతలు: ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, వెంకటేష్ మహా
సంగీతం: స్మరణ్ సాయి
సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగేరా
ఎడిటర్: పూజ అపర్ణ కొల్లూరు,
మూవీ రివ్యూ: “మార్టిన్ లూథర్ కింగ్” (MLK)
టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా, వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా తమిళ “మండేలా” చిత్రం రీమేక్ రైట్స్ తో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దగ్గర సన్నివేశాలు రాసుకొని పూజా అపర్ణ కొల్లు తన డైరక్టోరియల్ చిత్రంగా తెరెక్కెంచిన “మార్టిన్ లూథర్ కింగ్” సినిమా ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో మా 18F మూవీస్ టీమ్ సమీక్ష చదివి తెలుసుకుందామా!
కధ (Story Line) పరిశీలిస్తే:
“మార్టిన్ లూథర్ కింగ్” సిన్మా కధ లోకి వెళ్తే… పరమడపాడు ఆనే గ్రామంలో వృద్దప్యం తొ బాధ పడుతున్న పంచాయతీ ప్రెసిడెంట్ పెద్దాయనని కాదని ఆ ఊరికి యువ ప్రెసిడెంట్ కావాలని నియోజికవర్గ ఎమ్మెల్యే చెప్తాడు. ఇలాంటి అవకాసం కొసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న పెద్దాయన ఇద్దరూ కొడుకులు జగజ్జీవన్ రామ్(నరేష్) అలాగే లోక్ మాన్య తిలక్(వెంకటేష్ మహా) తనంటే తను ఊరికి ప్రెసిడెంట్ అవుదామని ఎన్నికల్లో పోటీ చేస్తారు.
అయితే ఈ ఎన్నికలు కాస్త ఆ ఊరి ప్రజలను ఉత్తరం, దక్షిణాది వర్గాలుగా విడిపోతుంది. ఓటరు లిస్టులో ఉన్న అందరూ ఓటర్లను రెండు వర్గాలు సరిసమానంగా పంచుకోగా ఎలక్షన్ నెల ఉంది అనగా అదే ఊర్లో ఒక సాధారణ చెప్పులు కొట్టుకునే వ్యక్తి స్మైల్(సంపూర్ణేష్ బాబు) కి ఓట్ హక్కు వస్తుంది. ఈ ఒక్క ఓటు మాత్రం రెండు గ్రూపుల మధ్యలో డిసైడింగ్ ఓట్ గా నిలుస్తుంది.
మరి ఈ ఒక్క ఓట్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?
అసలు కథ ఈ ఓటు తొ ఏలా మలుపు తిరిగింది?
స్మైల్ కి ఊర్లో సహాయం చేస్తున్నది ఎవరు?
ఇంతకీ మార్టిన్ లూథర్ కింగ్ ఎవరు?
గ్రామం లోకీ వచ్చిన ఆ విదేశీయుడు పేరు వెనుక కధ ఏంటి?
ఇంతకీ స్మైల్ ఎలక్షన్ లో ఎవరికీ మద్దతు తెలిపాడు?
అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెంటనే దియేటర్ కి వెళ్లి చూడాల్సిందే…
కథనం (Screen – Play) పరిశీలిస్తే:
చిత్ర కథ లో మంచి కథాంశం ఉంది కానీ దానిని ప్రెజెంట్ చేసిన విధానంలో మాత్రం స్లో నరేసన్ లో సాగినట్టు ఉంది . మొదటి అంకం ( ఫస్టాఫ్) లో ఇంకొంచం ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ని రాసుకొని గ్రిప్పింగ్ గా చేసి ఉండాల్సింది. స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ సీన్లు లేకపోవడంతో మంచి కథాంశం కూడా ఒక డల్ ప్లే తో స్లో గా సాగినట్టు ఉంది.
మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో కొన్ని పత్రాలు బాగానే ఉన్నప్పటికీ వాటిని కథనం లో ఇంకాస్త మెరుగ్గా, స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అలానే ఈ తరహా కొన్ని పొలిటికల్ సెటైర్ కథలలో మంచి కామెడీతో సీన్స్ రాసి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్ గా సాగేది.
ఈ చిత్రంలో ఎమోషన్ డ్రైవ్ చేసే స్ట్రాంగ్ ఎలిమెంట్ కూడా లేకపోవడం వలన కధ తో ప్రేక్షకుడు డిస్ కనెక్ట్ అవుతాడు. వీటితో పాటుగా సినిమాలో కొంతవరకు సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. వీటితో కొంచెం విసుగు రావచ్చు. ఓవరాల్ గా కథనం (స్క్రీన్ – ప్లే) మరింత గ్రిప్పింగ్ గా రాసివుంటే ఎక్కువ మంది ప్రేక్షకులని ఆకట్టుకునేది.
దర్శకురాలు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకురాలు పూజా అపర్ణ విషయానికి చుస్తే..
ఆమె ఈ తమిళ మండేలా కధ నీ కొన్ని మార్పులతో తెలుగు నేటివిటీ లోకీ అనువదించడం లో సక్సెస్ అయ్యారనిపిస్తుంది. కధ నరేషన్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది.సినిమా కథాంశానికి ప్రధాన బలాల్లో కథానాయకుని పాత్ర కూడా ఒకటి. సంపూర్ణేష్ బాబు తొ ఎమోషనల్ యాక్టింగ్ చేయించడం లో దర్శకురాలు సక్సెస్ అయ్యారు.
కులాలు సంబంధించి ఇప్పటికీ మన దేశంలో ఉన్న వివక్షత లాంటి కొన్ని సున్నితమైన అంశాలను సినిమాలో ఆకట్టుకునే విధంగా చూపించడం దర్శకురాలు బాగా హ్యాండిల్ చేసారు.
మండేలా లో నటించిన యోగిబాబు ప్రస్తుతం కామిడీ కింగ్ గా మంచి ఫాలోయింగ్ లో ఉన్నాడు కాబట్టి మండేలా తమిళ్ లో అంత సక్సెస్ అయ్యి ఇండియా తరుపున ఆస్కార్ కి వెళ్ళింది.
సంపూర్ణేష్ బాబు కూడా ఈ కధ లో పాత్రకు ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చ కాని, యోగిబాబూ కి ఉన్న మార్కెట్ సంపూ కి లేకపోవడం వలన సిన్మా రీచ్ తక్కువగా ఉంది. కానీ, ఈ పాత్ర కి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడమే కాకుండా పాత్రా కి తగ్గట్టు గా సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో జీవం పోసాడని చెప్పొచ్చు.
నటి శరణ్య ప్రదీప్ ఓ డీసెంట్ రోల్ లో కనిపించి మెప్పిస్తుంది. కొన్ని సీన్ల లో అయితే తన నటనతో ప్రేక్షకులను అహ్చ్చార్య పరుస్తోంది.
సీనియర్ నటులు నరేష్ గారూ మరియు వెంకటేష్ మహా లు కూడా మంచి పెర్ఫామెన్స్ తొ నటించి మెప్పించారు. అలాగే ఇద్దరి మధ్య వచ్చే హుద్రోగ సన్నివేశాలలో కూడా హాశ్యం పండించే ప్రయత్నం చేసారు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కుడా ఆసక్తిగా సాగింది.
నటులు మురళీధర గౌడ్ కూడా ఉన్న రెండూ, మూడు సీన్ల లో బాగా నటించి నవ్వించే ప్రయత్నం చేసారు.
మిగిలిన పాత్రలలో నటించిన నటి నటుల తమ పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పవచ్చ.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, వెంకటేష్ మహా చిత్ర నిర్మాతలుగా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా నిర్మాతలు సినిమాని గ్రామాలలో నాచురల్ గా తెరకెక్కించారు.
స్మరణ్ సాయి అందించిన బిట్ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ నీ బాగా ఎలివేట్ చేసింది.
దీపక్ యెరగేరా అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. గ్రామీణ నేపథ్యం లో మంచి గ్రీనరీ లొకేషన్స్ ఉన్నా కధ కు తగ్గట్టుగా పాడైపోయిన రోడ్లు, గొడలు నటురల్ గా చూపించారు.
దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం తో పాటు ఎడిటింగ్ కూడా తనే చేసింది కాబట్టి చాలా వరకూ సీన్లు బాగున్నాయి. ఇంకా ఎడిటింగ్ లో కొన్ని అనవసర సీన్స్ తీసివేసి వుంటే తక్కువ నిడివి లో చాలా క్రిస్ప్ గా ఇంకా బాగుండేది.
18F MOVIES టీమ్ ఒపినియన్:
“మార్టిన్ లూథర్ కింగ్” సిన్మా కి ములకధ తమిళ చిత్రం మండేలా అయినా, సోల్ మాత్రం తీసుకోని తెలుగునాట గ్రామాలలో ప్రజలకి – పాలకులకు మధ్య జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా సన్నివేశాలు రాసుకొని చిత్రీకరించడం మంచి ప్రయత్నం. కధ కి ములభిందువు ఆయిన ఎడ్డొడు (మార్టిన్ లూథర్ కింగ్) పాత్రదారి నటుడు సంపూర్ణేష్ బాబు తన అమాయక చిరు నవ్వుతో అధ్భుత నటనతో తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు.
చాలా పాత్రలు కొత్త నటులతొ చేయించడం వలన కొన్ని సన్నివేశాలలో డల్ ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్లు సినిమాని బలహీనపరిచాయి. ఈ సిన్మా బుర్ర కథ ఫార్మాట్ లో చెప్పడం వలన ఎక్కువ సీన్లు పాటల రూపం లో చెప్పవలసి రావడం కూడా ప్రస్తుత యువత కి కనెక్ట్ కాకపోవచ్చు.
గ్రామీణ నేపథ్యం కథలు ఇష్టపడే వారు బాగా ఎంజాయ్ చేస్తారు. మిగిలిన సినీ ప్రేక్షకులు తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సినిమా ట్రై చేస్తే మంచి కామిక్ పొలిటికల్ సెటైరికల్ సిన్మా చూసిన ఫీలింగ్ తో దియేటర్స్ నుండి వస్తారు.
వెంకటేష్ మహా రాసిన స్క్రీన్ ప్లే లో పూజ కూడ కొన్ని ఇన్పుట్స్ గా ప్రస్తుత యువతని దృష్టిలో పెట్టుకొని కొన్ని సీన్స్ రాసి ఉంటే పల్లెటూరు నుండి సిటీ వచ్చి ఉంటున్న యుత్ కూడా బాగా కనెక్ట్ అయ్యేవారు. అలా ఆన్ని వర్గాల వాళ్ళు కూ నచ్చితే ఖచ్చితంగా సినిమా అవుట్ పుట్ మరియూ రిజల్ట్ కూడా మరంత మెరుగ్గా బలగం లాంటి విజయం వచ్చి ఉండేది.
ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచి మారడం వలన ఈ మార్టిన్ లూథర్ కింగ్ సిన్మా ని దియేటర్ కి వచ్చి చూస్తారు అనేది డవుట్. మేము అయితే దియేటర్ లో బాగా ఎంజాయ్ చేసాము.
చివరి మాట: ఓటరే కింగ్ అన్న మార్టిన్ మూవీ
18F MOVIES RATING: 3 / 5
*కృష్ణ ప్రగడ.