కార్తిక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా త్వరలో రీలిజ్ కానున్న చిత్రం “అథర్వ”. సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో రీలిజ్ డేట్ అన్నౌన్స్ చెయ్యనున్నారు. తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పింది సిమ్రాన్ చౌదరి. యథార్థ ఘటనల ఆధారంగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా అథర్వ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అథర్వ సినిమాను రూపొందించినట్లు నిర్మాత సుభాష్ వెల్లడించారు. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్ కి మంచి ఆధరణ లభించింది. ఈ సంద్రభంగా పోస్టర్ డిజైనర్ తో మా విలేఖరి చిట్ చాట్…
మీ పేరు, ఎక్కడ పుట్టి పెరిగారు?
నా పేరు ఎం.కే.ఎస్ మనోజ్. పుట్టి పెరిగింది శ్రీకాకుళం. 2011 లో హైదరాబాద్ కి వచ్చి VFX కోర్స్ లో జాయిన్ అయ్యాను. అప్పటినుండి ఇక్కడే ఉంటున్నాను.
మీ కుటుంభం గురించి మీ మాటల్లో?
నాన్నగారు శ్రీకాకుళం లోనే ఉంటారు. నేను నా వైఫ్ మాత్రం హైదరాబాద్ లో ఉంటున్నాం. వైఫ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నేను ఈ ఫీల్డ్ లో వర్క్ చేస్తా అంటే మొదట్లో నా ఫ్యామిలీ కి నేను సక్సెస్ అవుతానా లేదా అనే అనుమానం ఉండేది. తర్వాత నా వర్క్ చూసి వాళ్ళు కూడా నన్ను నమ్మి చాల సపోర్ట్ చేసారు. పెళ్లి తర్వాత నా వైఫ్ సపోర్ట్ లేకుండా ఇంతవరకు, ఈ ఇండస్ట్రీ లో కంటిన్యూ అయ్యేవాడిని కాదు. ఎన్నిసార్లు ఇబ్బంది పడిన నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్ గానే ఉండేది.
మీరు డిజైనింగ్ డిపార్టుమెంట్ ఎంచుకోవడానికి ముఖ్య కారణం?
నేను మొదట్లో డిజైనింగ్ తో పాటూ ఎడిటింగ్ & VFX కూడా చేసే వాడిని. కానీ, ఫోకస్ అంత డిజైనింగ్ మీద ఉండేది. అందుకే డిజైనింగ్ మెయిన్ స్ట్రీమ్ గా ఎంచుకున్నాను.
సినిమా ఇండస్ట్రీ కి ఎలా ఎంటర్ అయ్యారు?
మొదట్లో నేను షార్ట్ ఫిలిమ్స్ కి డిజైనింగ్ వర్క్ చేసేవాడ్ని, నా వర్క్స్ నచ్చి ఒక డైరెక్టర్ 2016 లో తన ఫిల్మ్ లో పబ్లిసిటీ డిజైన్స్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అలా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యాను.
మరి సినిమా ఇండస్ట్రీ లో మీ ప్రయాణం ఎలా సాగింది? ఎదురుకొన్న ఓడిదుడుకులు ఏంటి?
ఈ ఇండస్ట్రీ లో కాంపిటీషన్ చాల ఎక్కువ, అవకాశాలు అంతగా వచ్చేవి కావు. 2 – 3 నెలలకు ఒక్క సినిమా కూడా వచ్చేది కాదు. ఆ టైంలో చాల ఇబ్బందిగా ఉండేది. వచ్చిన ఫిలిమ్స్ కూడా ఎదో ఒక రీజన్ వళ్ళ క్యాన్సల్ అయ్యేవి. అలా మిస్ అయ్యిన ప్రాజెక్ట్ లో పెద్ద మూవీ కృష్ణవంశీ గారి ఫిల్మ్ “నక్షత్రం”. ఆ తరువాత మెల్లమెల్లగా ఒక్కో సినిమా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు సాఫీగా సాగుతుంది.
ఇండస్ట్రీ లో మీకు ముఖ్యమైన వ్యక్తులు ఎవ్వరైనా ఉన్నారా? వాళ్ళ గురించి?
ఇండస్ట్రీలో నాకు ముఖ్యమైన వ్యక్తులు అంటూ ఎవరు లేరు. ఏ ప్రాజెక్ట్ కి సంభందించిన వ్యక్తులు, ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తరువాత టచ్ లో కూడా ఉండరు. బహుశా, అందుకే అనుకుంట ఇప్పటికి వరుకు ముఖ్యమైన వ్యక్తులు లేకపోవటానికి కారణం.
షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అండ్ మూవీస్ కలిపి ఇప్పటివరకు దాదాపు 400+ ప్రాజెక్ట్స్ చేసారు కదా? ఈ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి ముఖ్య కారణం ఏం అనుకుంటున్నారు?
ఇప్పటివరకు 230+ Short Films, 90+ Independent Independent Films, 80+ Films మొత్తం కలిపి దాదాపు 400+ ప్రాజెక్ట్స్ కి వర్క్ చేశాను. ఇంత దూరం రీచ్ అవ్వడానికి ఒక్కటే రీజన్. ఈ ఫీల్డ్ లో ఎన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన ఓవర్ కమ్ చేసి ముందుకి వెళ్తే ఎప్పటికైనా సక్సెస్ అవుతాను అని గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇప్పటికీ ఇదే వర్క్ కంటిన్యూ చేస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే, నమ్మకమే బలం.
మీ డిజైనింగ్స్ చూసి, స్టార్స్ దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
నా సినిమాలకు సంభందించిన డిజైన్స్ ఫస్ట్ లుక్స్ చాలామంది సెలబ్రిటీస్ చేతుల మీద గా రిలీజ్ చేసారు. D-Company కి RGV గారి దగ్గరనుండి వచ్చిన కాంప్లీమెంట్ నాకు అన్నిటి కంటే ది బెస్ట్ కాంప్లీమెంట్ అండ్ స్పెషల్..
ఇప్పటి వరుకు వర్క్ చేసిన టాప్ ఫోర్ మూవీస్ ఏంటి?
Padipoya Nee Maayalo (1st Film)
SHUKRA (Most satisfying work)
D-Company (RGV’s Film)
Kanabadutaledu
సినిమాకి ప్రధాన బలం పోస్టర్ డిజైనింగ్ అని మీరు భావిస్తున్నారా?
ఖచ్చితంగా.. ఎందుకంటే ఏ సినిమాకి అయినా మొదటగా రిలీజ్ చేసేది టైటిల్ & ఫస్ట్ లుక్.. ఈ పోస్టర్స్ తోనే మన సినిమా ఏంటి అనేది చూసేవాళ్ళకి అర్ధం అవ్వాలి, అలానే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండాలి. అప్పుడే వాళ్ళు సినిమా కోసం వెయిట్ చేస్తారు.
డిజైనింగ్ డిపార్టుమెంట్ లో కాంపిటేషన్ ఉందా ? అప్డేట్ లో ఉండటానికి మీరేం ప్రయత్నాలు చేస్తుంటారు?
డిజైనింగ్ ఇండస్ట్రీ లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. అలానే ప్రతీ డిజైనర్ కీ వాళ్ళ ఓన్ క్రియేషన్ ఉంటుంది. ఈ డిజైనింగ్ ఇండస్ట్రీ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కొత్తగా ఆలోచించి ప్రతీ మూవీకి కొత్త లుక్స్ ఉంటేనే కంటిన్యూ అవ్వగలం.
మీ అప్ కమింగ్ సినిమాలు ఏంటి?
అథర్వ, తుపాకులగూడెం, #AP31 , ప్రేమదేశపు యువరాణి, అండర్ వరల్డ్ బిలినైర్స్, యద్భావం తద్భవతి.