మూవీ:Missశెట్టి Mrపోలిశెట్టి(Miss Shetty Mr Polishetty Movie):
విడుదల తేదీ :సెప్టెంబర్ 7, 2023
నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, నాసర్, సోనియా దీప్తి, జయసుధ, తులసి, భద్రం తదితరులు
దర్శకుడు : మహేష్ బాబు పచ్చిగొల్ల
నిర్మాతలు: : వి.వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
సంగీతం: రధన్, గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
Missశెట్టి Mrపోలిశెట్టి మూవీ రివ్యూ:
సినీయర్ హీరోయిన్ అనుష్క శెట్టి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిల కాలయకలో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా అన్నీ అవంతులనూ ఛేదించి నేడు థియేటర్ల లోకి వచ్చింది.
బాహుబలి సిరీస్ తర్వాత అనుష్కశెట్టి, జాతి రత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టి కలిసి వెండి తెరమీద కనిపిస్తున్నారు అనే భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది.
మరి ఈ చిత్రం ప్రేక్షకుల భారీ అంచనాల మద్యలో వచ్చి సినీ లవర్స్ ని ఎంత మేరకు మెప్పించిందో మా 18f మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !
కథ ని పరిశీలిస్తే (Story line):
అన్విత రవళి శెట్టి (అనుష్క శెట్టి) లండన్ లో స్థిర పడిన స్టార్ హోటల్ మాస్టర్ చెఫ్. తన తల్లి అనుభవించిన ఒంటరి జీవితం తను ఫేస్ చేయకూడదు అని ఆమె వివాహం చేసుకొకుండానే తల్లి కావాలని నిశ్చయించుకుంది.
అలా తను కృత్రిమ గర్భం కోసం తన భాగస్వామిగా స్టాండ్ అప్ కమెడియన్ అయిన సిద్ధు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి)ని ఎంచుకుంటుంది. సిద్ధూ ఆమె ఉద్దేశాలను పట్టించుకోకుండా, ఆమె ప్రేమలో పడిపోతాడు.
ఆమె అసలు ఉద్దేశ్యం తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. అయితే తల్లి కావాలనుకునే అనుష్క కలను సాకారం చేయడంలో..
సిద్దు అన్విత కు సహాయం చేశాడా ? లేదా ?,
అన్విత పెళ్లి కాకుండానే తల్లి అవటానికి ప్రేరేపించినది ఏమిటి ?
UK లో ఉండే అన్విత ఇండియా లో ఉన్న సిద్దు ని ఎలా కలిసింది ?
సిద్దు ప్రేమను మొదట్లో ఎందుకు వద్దు అనుకోంది ?
సిద్దు స్టాండ్ అప్ కామిడియాన్ గా ఎందుకు మారాడు ?
చివరాకరకు సిద్దు అన్విత పెళ్లి చేసుకొంటారా ?
అన్విత గర్బం దాల్చినదా ?
అనే ప్రశ్నల యొక్క జవాబులె సినిమా కధ.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):
స్టోరీ పాయింట్ చాలా సింపుల్ అండ్ బొల్డ్ గా ఉన్నా తన కధనం (స్క్రీన్ – ప్లే) తో చక్కగా ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ, రెండవ అంకం (సెకండాఫ్) లో స్లో అయిపోయింది సినిమా.
దర్శకుడు తన కధనం తో రెండవ అంకం (సెకండాఫ్) లో కొంచెం వేగం పెంచి ఉండొచ్చు. మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో అనవసరమైన సన్నివేశాల పెట్టడం వలన కధనం స్లోగా అనిపిస్తుంది.
కథలో ప్రేమ – పెళ్ళిళ్ళు అప నమ్మకాలతో విడిపోవడాన్ని ఇంకొంచెం డెప్ గా ఎమోషనల్ డెప్త్ తో నడిపి ఉంటే కధ లొని పాత్రలతో ప్రేక్షకుల అనుబంధం మరింత బలపడి ఉండేది. మురళీ శర్మ, సోనియా దీప్తి, అభినవ్ గోమతం చేసిన పాత్రలకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే సినిమా రిసల్ట్ ఇంకా బాగా ఉండేది.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
మహేష్ బాబు పి కధా రచన – దర్శకత్వం తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం ద్వారా తన బెస్ట్ అవుట్‌పుట్‌ను అందించాడు. అయితే, కధనం (స్క్రీన్ ప్లే) పై మరింత శ్రద్ధ పెట్టి కొంచెం గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే బాగుండేది.
ఈ చిత్రం ద్వారా కొత్త కాన్సెప్ట్‌ను చూపించడం జరిగింది. దీనిని దర్శకుడు మహేష్ బాబు పి చాలా బాగా తీయడానికి ప్రయత్నించాడు కానీ, కొన్ని సీన్స్ మాత్రం స్క్రీన్ మీద మాజిక్ చేయలేకపోయాయి.
అనుష్క శెట్టి అన్విత రవళి శెట్టి పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. తన పాత్రకి చాలా బాగా న్యాయం చేసింది. ఆమె స్క్రీన్‌పై బబ్లీ గా కనిపించడమే కాకుండా పవర్ ఫుల్ నటనతో మరో సారీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.
నవీన్ పొలిశెట్టి సిద్దు పోలిశెట్టి గా తనకు తగిన పాత్రలో చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని సపవంటినీస్ నటన, కామెడీ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీక్వెన్స్‌లను కూడా చక్కగా హ్యాండిల్ చేశాడు.
మురళీ శర్మ సిద్దు కి తండ్రి పాత్ర చాలా చేశాడు. లిమిట్ గా ఉన్నప్పటికీ మెచ్చుకోదగిన నటనను ప్రదర్శించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో బాగా నటించారు. తను చెప్పిన ఓక డైలాగ్ సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.
అనుష్క తల్లి పాత్ర లో జయసుధ, మిగిలిన నటీనటులు తమ పాత్రలను తగినంతగా న్యాయం చేశారు.
చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా సినిమా చాలా రిచ్ లుక్ లో కనిపించింది.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
మ్యూజిక్ డైరెక్టర్ రధన్ సౌండ్ ట్రాక్‌లో మూడు పాటలు ఉన్నాయి. మెలోడీ సాంగ్, ప్రేమ ను బంధాలను గుర్తించే పాట చాలా బాగా కుదిరాయి.
గోపీ సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా కి బాగా సెట్ అయ్యింది.
నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాగుంది. ఫారీన్ లొకేసన్స్ చాలా రిచ్ లుక్ లో కనిపిస్తాయి. విమెన్ సెంట్రిక్ పాయింట్ కాబట్టి, చాలా చోట్ల పింక్ కలర్ డ్రస్లు ఫ్లవర్స్ తో చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశాడు డిఓపి.
కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పరవాలేదు. ఇంకా కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.నిర్మాణ విలువలు బాగున్నాయి.
18F మూవీస్ టీం ఒపీనియన్:
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ సిన్మా ప్రేక్షకుల ను ఎంటర్ టైన్మెంట్ చేయడానికి వచ్చిన ఈ చిత్రం ఓక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టిల నటన చాలా బాగుంది. అలాగే కొన్ని సీన్స్ లో ఉన్న ఎమోషనల్ , కామెడీ ఆడియెన్స్ ను బాగా అలరిస్తాయి.
అయితే రెండవ అంకం (సెకండ్ ఆఫ్) లో స్క్రీన్ – ప్లే లో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం వలన సామాన్య ప్రేక్షకులు కొంచెం బోర్ ఫీల్ అవుతారు. ఎండింగ్ కి వచ్చేటప్పటికి డ్రామా లొని ప్రేమ తో కూడిన ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు. కొన్ని సీన్స్ ని మాత్రం మర్చిపోతే ఒవెరల్ గా ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.
టాగ్ లైన్: శెట్టి ల నాన్ వెజ్ కామిడీ వంటకం !
18FMovies రేటింగ్: 3.5 / 5
* కృష్ణ ప్రగడ.