హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో నటుడు భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్ ను సందర్శించారు పద్మశ్రీ ఖాదర్ వలీ. దేశంలోనే మిల్లెట్స్ తో చేసిన సూపర్ పుడ్ కిచెన్ ను ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిర్ పోర్ట్ ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ కావడం విశేషం.
భరత్ రెడ్డి, సంగీత రెడ్డి ఆధ్వర్యంలో ఈ మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. తమ రెస్టారెంట్ కు వచ్చిన సందర్భంగా ఖాదర్ వలీకి భరత్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు.
పద్మశ్రీ ఖాదర్ వలీ మాట్లాడుతూ: – మన ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ లో మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. భరత్ రెడ్డి, సంగీత రెడ్డిలకు నా విశెస్ తెలియజేస్తున్నా. మన తెలుగు వారితో పాటు హైదరాబాద్ కు వచ్చే విదేశీయులకు కూడా మిల్లెట్స్ తో రుచికమైన వంటకాలు పరిచయం చేస్తున్నారు.
మిల్లెట్స్ తో చేసిన పూరి, దోశ రుచికరమే కాదు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మిల్లెట్స్ మన లైఫ్ లో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలికి ఉపయోగపడుతుంది. అన్నారు.