Methun Chakraborty  Son’s Nenekkadunna :’నేనెక్కడున్నా’ చిత్రం విడుదల తేది ఖరారు.. ఎప్పుడంటే!

IMG 20231016 WA0073 e1697462252397

 

సీనియర్ హిందీ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న సినిమా ‘నేనెక్కడున్నా’. మాధవ్ కోదాడ దర్శకత్వం వహించారు. ఆయనకూ తొలి చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో సినిమా రూపొందింది. ఈ చిత్రంలో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 17న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు.

 

దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ ”జర్నలిజం & పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సశా ఛెత్రి , మిమో చక్రవర్తి ఇద్దరూ జర్నలిస్ట్ పాత్రల్లో కనిపిస్తారు. మొదటి నుంచి చివరివరకు ప్రేక్షకుల ఊహకు అందని మలుపులతో ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుంది. స్త్రీలకు బాగా కనెక్ట్ అయ్యే విమెన్ ఓరియెంటెడ్ సినిమా ఇది . దాంతోపాటు జర్నలిజంపై రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుందనేది సినిమాలో చూపించాం ” అన్నారు.

IMG 20231016 WA0075

చిత్ర నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ”సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశాం. ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో చిత్రీకరణ చేశాం. స్టోరీ , మ్యూజిక్, విజువల్స్, డైరెక్షన్ మా సినిమాకు బలం. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో రష్యన్ బెల్లీ డాన్సర్లతో చేసిన పబ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

నవంబర్ 17న తెలుగు , హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల అవుతోంది ” అని చెప్పారు.

IMG 20231016 WA0074

మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, శయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, సీ.వీ.ఎల్. నరసింహారావు, రవి కాలే, భాను చందర్, రమణ చల్కపల్లి, మిలింద్ గునాజి, మిహిర, ఉత్తర తదితరులు నటించిన ఈ చిత్రానికి డాన్స్ :  ప్రేమ్ రక్షిత్, లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, స్టంట్స్ : శంకర్ & మాధవ్ కోదాడ, ఎడిటింగ్ : ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల, సంగీతం : శేఖర్ చంద్ర, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : రాజేష్ ఎస్.ఎస్, సమర్పణ : కె.బి.ఆర్, నిర్మాత :  మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి, స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – డైరెక్షన్ : మాధవ్ కోదాడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *