మూవీ: మీటర్ (Meter Movie)
విడుదల తేదీ : ఏప్రిల్ 07, 2023
నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పవన్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి తదితరులు
దర్శకుడు : రమేష్ కాడూరి
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సంగీత దర్శకులు: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్

మీటర్ సినిమా రివ్యూ (Meter Movie Review):
యువ హీరో కిరణ్ అబ్బవరం పూర్తి కమర్షియల్ కధ లో హీరోగా నటించి మెప్పించే ప్రయత్నం చేసిన సినిమా “మీటర్”. దెబ్యూ దర్శకుడు రమేష్ కాడూరి తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో మా 18 f మూవీ టీం రివ్యూ చదివి తెలుసుకుందామా !
కధ ను పరిశీలిస్తే (story line):

సిన్సియర్ గా పోలీసు ఉద్యోగం చేసుకునే హీరో అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి పై అదికార్ల కోపామికి గురి అయ్యి తరచూ ట్రాన్స్ఫర్స్ కి గురౌతుంటాడు. లంచగొండులైన తన సీనియర్ ఆఫీసర్స్ లా కాకుండా అతని కొడుకుని ఒక నిఖార్సైన పోలీస్ అధికారిగా చూడాలనుకుంటాడు. కానీ కొడుకు అర్జున్ కి పోలీస్ అవ్వడం ఇస్టం ఉండదు. తను ఒక సిన్సియర్ పోలీస్ అయితే, ఆ నిజాయితీ వల్ల తన తండ్రి పడిన కష్టాలను, అవమానాలను తను అనుభవించాలమో అని పోలీస్ జాబ్ పైనే అసహ్యం పెంచుకుంటాడు.
అనుకోని పరిస్తుతుల వలన అర్జున్ కళ్యాణ్ పోలీస్ ఉద్యోగం లో జాయిన్ అవ్వవలసి వస్తుంది. తన తండ్రి కోరిక మేరకు జాబ్ చేస్తున్నట్టు నటిస్తూ తన ప్రమేయం లేకుండా డిపార్ట్మెంట్ సస్పెండ్ చేయాలను చూస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో..
అర్జున్ కళ్యాణ్ ఇష్టం లేని పోలీస్ జాబ్ ను ఎలా చేశాడు ?,
నిర్లక్ష్యంగా జాబ్ చేసిన కారణంగా జరిగిన సంఘటనలు ఏమిటి ?,
ఈ మధ్యలో హీరోయిన్ అతుల్య రవితో ఎలా ప్రేమలో పడ్డాడు?,
మగాళ్లు అంటేనే విరుచుకు పడే ఆమెను ఎలా ప్రేమలో పడేశాడు?,
చివరకు అర్జున్ కళ్యాణ్ పోలీస్ జాబ్ ఉందా?, పోయిందా?,
ఎస్ ఐ అర్జున్ కళ్యాణ్ లో ఫైనల్ గా ఎలాంటి మార్పు వచ్చింది ?,
పోలీస్ జాబ్ ఇస్తాపడిన తర్వాత అర్జున్ ఏం చేశాడు ?
తన తండ్రి ఆశయాన్ని తీర్చగలిగాడా ?
అనే ప్రశ్నలు జవాబే మిగిలిన కథ.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

దర్శకుడు రమేష్ కాడూరి రాసుకున్న కథగా బాగా ఉన్నా కథనం (స్క్రీన్ – ప్లే) లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయింది. దీనికి తోడు సినిమాలోని కీలక సన్నివేశాలన్నీ స్ట్రాంగ్ ఎమోషన్ లేకుండా పూర్తి సిల్లీగా సినిమాటిక్ గా సాగాయి. ఏ సీన్ బలంగా ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించదు.
ఇక మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో ఒకటి రెండు సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. పైగా చాలా సన్నివేశాల్లో హీరో పాత్ర ఓవర్ బిల్డప్ తో కథకు అవసరం లేని యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువ గా ఉండటం వలన చూసే ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు,
హీరో కిరణ్ అబ్బవరం కి యాక్షన్ పై ఉన్న మమకారం కారణంగానో లేక దర్శకుడు ఆలోచన విధానమో తెలియదు కానీ చాలా సీన్స్ లో బిల్డప్ షాట్స్ బలవంతంగా ఇరికించబడ్డాయి అన్నట్టు ఉంది. వీటి వలన కథనంలో నాటకీయత ఎక్కువవడంతో సహజత్వం చాలా వరకు లోపించింది.
ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా సాగింది. పైగా అవసరానికి మించి యాక్షన్ సీన్స్ ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలు అయితే కావాలని ఇన్సర్ట్ చేసినట్టు ఉన్నాయి.
పైగా కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని కథకు అవసరం లేని సీన్స్ ను క్రియేట్ చేయడం సినిమాకి మరో మైనస్ గా ఉన్నాయి. మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కధ ని ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించే కధనం తో ఎలివేట్ చేయలేకపోయాడు.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

దర్శకుడు రమేష్ రాసుకొన్న కధలో, జులయి గా తిరిగే ఓక అబ్బాయి తండ్రి ఆశయాన్ని లక్ష్యంగా చేసుకొని నిజమైన పవర్ ఫుల్ పోలీస్ గా మారితే ఎలా ఉంటుందనే పాయింట్ తో తెరకు ఎక్కించినా మాస్ ఇమేజ్ ఉన్న హీరో చేయవలసిన పాత్రని, ఇమేజ్ లేని చిన్న హీరో తో చేయించడం వలన యాక్షన్ సీన్స్ అన్నీ సిల్లీ గా వచ్చాయి. కధనం మరి పేలవంగా ఉంది.
కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం సాగింది. ఇష్టం లేని జాబ్ చేస్తూ సరదగా తిరిగే ఓ కుర్రాడి జీవితంలో జరిగిన ఓ బాధాకరమైన సంఘటన తో సీరియస్ పోలీస్ గా మరీ కిరణ్ అబ్బవరం చేసిన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి న్యాయం చేశాడు. కాకపోతే హీరో పాత్ర కి బిల్డప్ షాట్స్ మరీ ఓవర్ యాక్షన్ చేసినట్టు ఉన్నాయి.
అతుల్య రవి హీరోయిన్ gaa మొదటి చిత్రమైనా తన పాత్రలో చాలా బాగా నటించింది. నటనతో పాటు అందంగా కనిపిస్తూ మాస్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ ఆకట్టుకుంది.
సప్తగిరి పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు సప్తగిరి బాగా నటించాడు.
ధనుష్ పవన్ ప్రధాన విలన్ పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నాడు.
పోసాని కృష్ణ మురళి తో పాటు ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

ముందు చెప్పుకున్నట్లుగానే దర్శకుడు రమేష్ కాడూరి ఆకట్టుకునే విధంగా మంచి కమర్షియల్ కథ రాసికొన్నా కథనం విశయం లో గాడి తప్పి లాజిక్ లెస్స కధగా మిగిలిపోయింది.
ఇక వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సాంగ్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు.
కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కధలో – కధనం లో ఉన్న లోపాల వలన సినిమా పలితం ఆశించిన స్తాయిలో ఉండకపోవచ్చు.
18F మూవీస్ టీం ఒపీనియన్:

స్టార్ట్ అవ్వాడమే మీటర్ 100 మీద ఉంటుంది అంటూ చెప్పి కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తీసిన ఈ మీటర్ చిత్రంలో ఒక ఎమోషనల్ సీన్ మరో యూత్ జాబ్ సీన్ తప్ప ఏమి లేదు. అయితే, హీరో బిల్డప్ సీన్స్ మరీ సిల్లీ గా లాజిక్ లేకుండా తీసి, ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మరీ స్లో గా సాగడం వలన అన్నిటికి మించి సినిమాలో రొటీన్ కంటెంట్ తో పాటు అనవసరమైన యాక్షన్ సీన్స్ చాలా బోర్ గా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.
కిరణ్ అబ్బావరం సినిమా అంటే మంచి కంటెంట్ తో ఉండేవి ఇప్పటివరకూ…. కానీ తను కూడా స్టార్ హీరోల లాగా స్టార్ అవ్వాలంటే కమర్షియల్ సినిమాలు చెయ్యాలి అని ఫిక్స్ అయ్యినట్టు ఉన్నాడు. తన ఇమేజ్ కి మించిన కధలు ఎంచుకోవడం వలన గత సినిమాల పలితం గాడి తప్పి ఎటో పోతుంది. ఈ మీటర్ సినిమా సామాన్య సినీ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం చాలా కస్టం.
టాగ్ లైన్: మీటర్ కధ లో మేటర్ లేదు.
18f Movies రేటింగ్: 1.5 / 5
* కృష్ణ ప్రగడ.