MEMARIES Music Album Teaser Out: హీరో సుధాకర్ ‘మెమొరీస్’ మ్యూజిక్ వీడియో టీజర్ విడుదల  

IMG 20231117 WA0304 e1700235673200

 

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కొమాకుల ‘మెమొరీస్’ అనే మ్యూజిక్ వీడియోతో రాబోతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మిస్తున్నాడు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. అతి త్వరలో ‘మెమొరీస్’ వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివ్రితి యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు.

 

వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన ‘చోటు’ అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా.. సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం ‘మనోహరం’కి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది.

IMG 20231117 WA0200

ఈ పాటని వరుణ్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది.

 

సుధాకర్ కొమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది. ఈ సాంగ్ లోని మెలోడీ, వీడియో ఆకట్టుకుంటూ జీవితంలో చోటు చేసుకునే మార్పులని హైలైట్ చేసే విధంగా ఉంటుంది. త్వరలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మ్యూజిక్ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉండండి. సాంగ్ టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది.

IMG 20231117 WA0202

కో ప్రొడ్యూసర్ : శరద్ గుమస్తే (రెడ్ సీడర్ ఎంటర్టైన్మెంట్ )

సింగర్స్ : రితేష్ రావు జి (హిందీ), అర్జున్ విజయ్( మలయాళం), సుదర్శన్ ఎస్(తమిళ్), వాసుకి వైభవ్(కన్నడ) , రాహుల్ సిప్లిగంజ్ (తెలుగు),

సంగీతం: అరుణ్ సి,ఎడిటర్ : శ్రీకాంత్ ఆర్ పట్నాయక్ ,యానిమేషన్ : ఫనీంద్ర మైలవరపు ,కెమెరా : బ్రెయిన్ డూక్రి ,లిరిక్స్: పూర్ణ చారి( తెలుగు),విడుదల: నివ్రితి వైబ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *