Megastar “Bhaje Vaayu Vegam” racy teaser at Vishwambhara sets: మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా “భజే వాయు వేగం” సినిమా టీజర్ విడుదల!

Megastar Bhaje Vaayu Vegam racy teaser at Vishwambhara sets3 e1713670573882

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న “భజే వాయు వేగం” సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్ చేశారు. విశ్వంభర సినిమా సెట్ లో ఈ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ టీజర్ తో పాటు టైటిల్ ఇట్రెస్టింగ్ గా, ఇప్రెసివ్ గా ఉందని చెప్పారు. తన అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటించిన “భజే వాయు వేగం” సినిమా విజయం సాధించాలని మెగాస్టార్ తన బెస్ట్ విశెస్ అందించారు.

Megastar Bhaje Vaayu Vegam racy teaser at Vishwambhara sets1

“భజే వాయు వేగం”చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల సందర్భంగా

మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ: – యూవీ కాన్సెప్ట్స్ లో విక్కీ నిర్మాతగా, దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చంద్రపు రూపొందిస్తున్న “భజే వాయు వేగం” సినిమా టీజర్, టైటిల్ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. నా అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. నా అభిమాని హీరోగా ఓ మంచి సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.

Megastar Bhaje Vaayu Vegam racy teaser at Vishwambhara sets4

 

ప్రశాంత్ రెడ్డి లాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ కు రావాలి. ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ ఎంతమంది కొత్త కాన్సెప్ట్స్ తో వస్తే అంత ఫ్రెష్ గా మన ఫిలిం ఇండస్ట్రీ ముందుకు సాగుతుంది. యంగ్ డైరెక్టర్స్ ను నేను ఎప్పుడూ ఆహ్వానిస్తుంటాను. “భజే వాయు వేగం” సినిమా టీజర్ చూస్తుంటే తండ్రీ కొడుకు మధ్య మంచి ఎమోషన్ తో సాగే సినిమా అనిపిస్తోంది. యాక్షన్ బాగుంది. ఈ సినిమా స్టోరీ నాకు తెలిసినా ఇంతకంటే ఎక్కువ లీక్ చేయాలనుకోవడం లేదు. “భజే వాయు వేగం” సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అని అన్నారు

“భజే వాయు వేగం” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభిస్తారు. మొత్తం పోలీస్ డిపార్ట్ మెంట్ అంతా ఇదే టాస్క్ మీద ఫోకస్ చేస్తుంది. మరోవైపు కార్తికేయ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూనే తండ్రితో ఆయనకున్న ఎమోషనల్ బాండింగ్ ను చూపించారు. రాహుల్ టైసన్ క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.

Megastar Bhaje Vaayu Vegam racy teaser at Vishwambhara sets2

 

ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకడుంటాడు. వాడి కోసం ఏం చేయడానికైనా మనం వెనకాడం, నా లైఫ్ లో అది మా నాన్న అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఫాదర్, సన్ ఎమోషన్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు టీజర్ కు హైలైట్ గా నిలిచాయి. టీజర్ లో హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో పాటు కార్తికేయ గుమ్మకొండ ఎనర్జిటిక్ గా కనిపించారు. అన్ని ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో “భజే వాయు వేగం” సినిమా రూపొందించినట్లు టీజర్ తో తెలుస్తోంది.

“భజే వాయు వేగం” సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.

 

నటీనటులు: –

కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

టెక్నికల్ టీమ్:-

మాటలు: మధు శ్రీనివాస్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, ఎడిటర్: సత్య జి, సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, మ్యూజిక్ (పాటలు) – రధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్), కో ప్రొడ్యూసర్ – అజయ్ కుమార్ రాజు.పి, ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్,దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *