మెగా స్టార్ చిరంజీవి చేతి నిండా సినిమా లు తో బిజీ బిజీ గా సెట్స్ లో గడుపుతున్నారు. కానీ ఇక్కడ ఫిల్మ్ ఇండిస్ట్రీ లోనూ ఫిల్మ్ నగర్ చౌరస్తా లోనూ చాలా జరిగిపోతున్నాయి.

చిరంజీవి గారు ఒంటరిగా తన పని తాను చేసుకు పోతున్నారు అని ఫాన్స్ సర్ది చెప్పినా, అప్పట్లో ఇండిస్ట్రీ పెద్ద దిక్కుగా అందరి కస్టాలు తన భుజాలు పై వేసుకొని పని చేసిన చిరుని ఇప్పుడు కొంత మంది పట్టించుకొంటూ లేదా ?

ఇదే విశయం మీద సోషల్ మీడియా లో చాలా చర్చ జరుగుతుంది.
మెగా క్యాంప్ అనే ఫిల్మ్ నగర్ పెద్దలు పిలిచే చిరు క్యాంపు లో పరిస్థితులు చిత్రంగా వున్నాయి అంటున్నారు. మరి ముక్యంగా చెప్పాలి అంటే ఇండిస్ట్రీ లోని ఒక వర్గం మాత్రం గట్టిగా చిరు కి ఉన్న మెగా ఇమేజ్ ని తగ్గించాలి అని ప్రయత్నం చేస్తున్నారు అని చిరు కి క్లోస్ అయినా కొంత మంది అభిమానులు లో లోపల భాద పడుతున్నారు.

ముక్యంగా సినిమా టికెట్స్ విసయం లో చిరంజీవి, మరో ఇద్దరూ పెద్ద హీరో లు అమరావతి వెళ్లి జగన్ ను కలిసిన దగ్గర నుంచి చిరు ని టార్గెట్ చేస్తూ విపరీతంగా ఆన్ లైన్ లో ట్రోల్ చేసారు.

ఈ ట్రోలింగ్ ఎవరు చేసారు? వీటి వెనుక ఏవర్గం వుందన్నది బహిరంగ రహస్యం. అది అలా వుంచితే చిరంజీవి గారు నటించిన వాల్తేర్ వీరయ్య విడుదల అన్నది తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతికి రావాలి అని ముందే డిసైడ్ అయింది.

అలాగే వాల్తేరు వీరయ్య సినిమా నిర్మాతలు నిర్మిస్తున్న బాలయ్య సినిమా వీర సింహా రెడ్డి ని డిసెంబర్ లో విడుదల చేయాలి అని ప్రోడుకర్స్ ప్లాన్స్ వేసుకొన్నారు.

కానీ ఇక్కడే ఒక వర్గం చిరు నెంబర్ వన్ ఇమేజ్ తగ్గేలా ఎక్కువ కలెక్షన్స్ రికార్డు కాకుండా బాలయ్య సినిమా ని పట్టుపట్టి మరీ సంక్రాంతి కి తెచ్చారు.

ఇప్పుడు రెండు వైపులా అటు బాలయ్య ఫ్యాన్స్ ఇటు మెగా ఫాన్స్ నువ్వా నేనా అంటూ కాలు దువ్వుతున్నారు. రేపు దియటర్స్ దగ్గర ఫ్లెక్సీ, కట్ అవుట్ల వార్ మరోలా ఉంటుంది.

మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ఎదురు పడినా చాలా ఆప్యాయంగా పాలకరించుకొంటారు. కానీ కొంత మంది మీడియా లో ఉన్న వారు చిరు- బాలయ్య కి అసలు పడదు అని చెత్త రాతలు రాస్తూ ఫాన్స్ కి కొన్ని చెత్త పోస్ట్ చేస్తూ రెచ్చగొడుతుంటారు.

ఇంకా నందమూరి బాలయ్యకు చిరంజీవి కి అసలు మాటలు లేవు అని ఇది ఓపెన్ టాక్ అని కొన్ని వర్గాల మీడియా సంస్థలు నమ్మయిస్తూ ఉంటాయి.

ఇంకా ఆహా ఓటిటి లో హిట్ షో అన్ స్టాపబుల్ కి చిరంజీవిని పిలుద్దాం అంటే బాలయ్య వద్దని వీటో చేసారని తెర వెనుక గుసగుసలు అడుతుంటారు. కానీ అదే షో కి పవన్ ను మాత్రం బహిరంగంగానే పిలవాలి అని చెప్తారు.

ఇలా రాసేవారికి అసలు నిజాలు తెలియనిది కాదు. ఆహా లో అన్ స్టాపబుల్ షో ఏర్పటు చేసింది ఎవరు ? ఆహా ఓటిటి లో ఎవరి డబ్బులు పెట్టుబదులూగా ఉన్నాయి అనేది ఇలా రాసేవారు అందరికీ తెలుసు.

ఇంకో పక్క మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నేరుగా నందమూరి బాలయ్యతో బంధాలు పెనవేసుకుంటున్నారు అని. తమ తండ్రులు తరంలోనే నందమూరి-అల్లు బంధం వుందని ఆయన గతంలోనే చెప్పారు అని కోయలు కూతలు ఎందుకు కుస్తూన్నారో వాటి ద్వారా ఎవరిని మెప్పించాలి అని చూస్తూన్నరో అలా రాసే వారికే తెలుసు.

అలా రాయడం ద్వారా మెగా- అల్లు ఫాన్స్ ని దూరం చేయడం, పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగూదలను తగ్గించాలి అని చూడడం ఇంకా రేపు టిడిపి – జె ఎస్ పి పొత్తు ఉంటుందో లేదో తెలియదు కానీ, పవన్ కి చిరంజీవి ఫాన్స్ కి దూరం పెంచే ప్రయత్నం మాత్రం చాలా గట్టిగా జరుగుతుంది.
