మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ సినిమా వర్కింగ్ టైటిల్ ఏంటో అందరికీ తెలిసిందే. దీపావళి టపాసుల వెలుగుల ముందు వింటేజ్ చిరంజీవిని పరిచయం చేస్తూ “వాల్తేరు వీరయ్య” గా అధికారికంగా ప్రకటించారు.
వాల్తేరు వీరయ్య టైటిల్ పోస్టర్, టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
దిపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాకు సంబంధించిన అప్డేట్ మైత్రి విడుదల చేసింది. చిరంజీవి తో , బాబీ దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ మీద ఇన్ని రోజులు ఎన్నో చర్చలు జరిగాయి.
చిరంజీవి నోటి వెంట కూడా వర్కింగ్ టైటిల్ వాల్తేరు వీరయ్య చూచా ప్రాయంగా బయటకు వచ్చింది. శేఖర్ మాస్టర్ కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. సినిమా పేరు అదే అని చెప్పేశాడు.
వాల్తేరు వీరయ్య టైటిల్ ఫిక్స్ అయిందని ఎన్నో వార్తలు సోషల్ మీడియా, మెయిన్ మీడియా లో వార్తలు వచ్చాయి.
దీపావళి రోజున అధికారికంగా సినిమా టైటిల్‌ను మైత్రి సంస్ట ప్రకటించింది.
టిజర్ రివ్యూ (VARTERU VIRAYYA TEASER REVIEW)
ఏంట్రా ఆడొస్తే పూనకాలన్నాడు.. అడుగేస్తే అరాచకం అన్నాడు.. ఏడ్రా మీ అన్నయ్య.. సౌండే లేదు.. అంటూ విలన్ చెప్పే డైలాగ్.. రివర్స్ ఆర్డర్‌లో స్క్రీన్ ప్లేని తీసుకెళ్తూ.. బీడీ తాగుతున్న చిరంజీవిని చూపించేశాడు దర్శకుడు బాబీ.
బాబీ టేకింగ్‌కు.. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందంతే. చిరంజీవిలోని ఈజ్, అదిరిపోయే మ్యానరిజం, యాటిట్యూడ్ అన్నీ కూడా మెప్పించాయి.
చిరంజీవి నోటి వెంట….
ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే.. లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చేయండి అంటూ చిరు చెప్పిన ఫినిషింగ్ డైలాగ్ సూపర్బ్ అనాల్సిందే.
టిజర్ చివర్లో చిరు అలా నడుచుకుంటూ రావడం, బీడీ వెలిగించుకోవడం అన్నీ కూడా మాస్‌కు మత్తు విపరీతంగా ఎక్కేస్తాయి.
చివరాకరకు హ్యాపీ దివాళి.. తొందర్లోనే కలుద్దామంటూ రవితేజ వాయిస్ వినిపించడం హైలెట్.
బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మీద అందరి దృష్టి పడింది. అందుకే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చిరంజీవి సోలోగా రావడం మానేసినట్టు కనిపిస్తోంది. తన పక్కన మరో స్టార్ హీరో ఉండాలని భావిస్తున్నట్టుగా ఉంది. ఇక ఇందులో అయితే రవితేజ కనిపించబోతోన్నాడు.
అన్నయ్య సినిమా తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఇలా చిరంజీవితో కలిసి రవితేజ నటిస్తున్నాడు.
ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తోంది.
ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ అవుతుంది అని ఇండస్ట్రి టాక్. మాస్ సాంగ్స్‌తో దేవి చిరంజీవిని ఓక ఊపు ఊపేస్తాడని సమాచారం.
వాల్తేరు వీరయ్య సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో.. నేడు రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ చూస్తే తెలుస్తోంది.
ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించేందుకు మైత్రీ మూవీస్ ప్రయత్నిస్తోంది. ఈ సారి సంక్రాంతికి మైత్రి మూవీస్ ఇద్దరు పెద్ద స్టార్స్ సినిమాలు పోటీకి వాడులుతున్నారు.
చిరంజీవిని వాల్తేరు వీరయ్య , బాలయ్య ని వీర సింహా రెడ్డి సినిమాలతో మైత్రీ మూవీస్ తెలుగు లోగిళ్ళను సందడి సందడి చేయబోతోంది.