Mee Kadupuninda Resturant Opens in Hyd: ఏపీ మినిస్టర్ రోజా మరియు సినీ సీరియల్ ఆర్టిస్టుల సమక్షంలో హోటల్  “మీ కడుపునిండా”  గ్రాండ్ గా ప్రారంభం. 

IMG 20231016 WA0180 e1697469403362

 

మీ కడుపునిండా తెలుగువారి రుచులు ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీమతి రోజా గారు మాట్లాడుతూ శ్రీవాణి సీరియల్ లో మనందరికీ తెలిసిన వ్యక్తి. శ్రీవాణి విక్రమాదిత్య సందీప్ లకు నా శుభాకాంక్షలు మీ కడుపునిండా అనేది మణికొండలో ఉంటున్న వారి  అందరికీ..

IMG 20231016 WA0184

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోని  సీనియర్ ఆర్టిస్టులు కానీ యాక్టర్లు గాని ఎంతోమంది మణికొండలో ఉంటున్నారు, సో మణికొండ లో ఉన్న వారందరికీ అందుబాటులో దగ్గరగా ఉండేలాగా మీ కడుపునిండా హోటల్  ప్రారంభించారు వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

IMG 20231016 WA0183

అలాగే మీడియాతో ముచ్చటించిన రోజా గారు తనకు నచ్చిన నాన్ వెజ్ వంటకాలు గురించి సరదాగా రొయ్యల ఇగురు చేపల పులుసు ఇవన్నీ నాకు ఇష్టం నేను వంట కూడా బాగా చేస్తాను కానీ నేను చేసిన దానికి నా భర్త పిల్లలు ఎలా ఉందని వాళ్లే చెప్పాలి నేను కాదు కదా అంటూ సరదాగా ముచ్చటించడం జరిగింది.

IMG 20231016 WA0181

అలాగే ఈ మీ కడుపునిండా లో వెజ్ నాన్ వెజ్ వంటకాలు అన్నీ కూడా ఆంధ్ర స్టైల్ లో అందుబాటులో ఉంటాయి. అచ్చమైన తెలుగు వంటకాలు ఇక్కడ కచ్చితంగా లభిస్తాయి సో తెలుగు వారందరూ ఇక్కడొకసారి వచ్చి టేస్ట్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *