Mayuki’s first look was launched by DJ Tillu directed by Vimalakrishna మయూఖి ఫస్ట్ లుక్ లాంఛ్ చేసిన డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ…!!

8BD827BC 1E87 4C29 907D B6D513708992

టి.ఐ.ఎం. గ్లోబల్ ఫిల్మ్స్ సమర్పణలో నంద కిషోర్, డి. టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మయూఖి చిత్రం పోస్టర్ ను ఈ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ, రచయిత డార్లింగ్ స్వామి పాల్గొన్నారు. ఏ.ఎల్. నితిన్ కుమార్ దర్శకత్వం వహించిన మయూఖి చిత్రం డల్లాస్ ఘర్షణలో అనే సబ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మేనకోడలి కోసం మేనమామ చేసే సాహసాలు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగిపోయే ఈ చిత్రం షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరుపుకుంది. అమెరికాలో స్థిరపడ్డ వందమందికి పైగా భారతీయులు, అమెరికన్ల నుండి ఎంపిక చేసిన సరికొత్త నటీనటులకు స్వయంగా శిక్షణనిచ్చి నితిన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్, అడ్వెంచర్ మూవీ అమెరికాలో నిర్మించినా తెలుగువారి అభిరుచికి అనుగుణంగా ఉంటుంది.

FFF3A68C 7988 4810 B9D1 66A7EA31AADD

ఎంతో శ్రమపడి డల్లాస్ పరిసరాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో మయూఖి చిత్రీకరించారు. ఇవి ఖచ్చితంగా ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నామని నితిన్ కుమార్ తెలిపారు.

మాటీవీలో 15 ఏళ్ళపాటు ప్రసారమైన పర్యాటక కార్యక్రమం విహారి ది ట్రావెలర్ కి దర్శక నిర్మాత అయిన ఏ.ఎల్. నితిన్ కుమార్ గతంలో నిర్మించిన లోటస్ పాండ్ అనే బాలల చిత్రం హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవానికి ఎంపిక అయ్యింది.

159F9742 4E10 41FD BBC8 3B8C2CC5F617

నితిన్ కుమార్ దర్శకత్వం వహించిన ఎ టీచింగ్ ఛెఫ్ లాస్ ఏంజెల్స్ లో జరిగిన డ్రీమ్ మెషైన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లోనూ, ఫ్లోరిడాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లోనూ ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుంది. అలానే అనేక అతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికై ఫైనల్స్ కు చేరి ప్రశంసలు అందుకుంది.

AD783BA4 A8F4 4E88 B496 4662130F4540

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త పంథాలో సాగిపోయే మయూఖి చిత్రానికి మాటలు గణపతి రామం, ఎడిటింగ్ జి. అశోక్ కుమార్, ఎన్. వినయ్, ఎఫెక్ట్స్ కె. రాజేష్, డిజైనర్ బి. రవికుమార్, ప్రొడక్షన్ డిజైనర్ యు.సందీప్, సినిమాటోగ్రఫీ కె. అనిల్, ఎ.ఎల్. నితిన్ కుమార్, సంగీతం లుబెక్ లీ మార్విన్, నిర్మాతలు నంద కిషోర్, డి. టెరెన్స్, కథ, దర్శకత్వం ఏ.ఎల్. నితిన్ కుమార్.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *