#Mayalo Movie Review & Rating: నేటి యువత మెచ్చే చిత్రం #మాయలో!

mayalo movie review by 18F movies e1702665233797

 #మాయలో మూవీ రివ్యూ ( #Mayalo Movie Review):

నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, RJ హేమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం # మాయలో. మేఘా మిత్ర పేర్వార్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సినిమాని ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్‌ పై షాలిని నంబు, రాధా కృష్ణ నంబు సంయుక్తంగా నిర్మించారు.

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం అలరించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !

కధ పరిశీలిస్తే (Story Line): 

mayalo movie review by 18F movies 6

మాయ (జ్ఞానేశ్వరి) తన ప్రియుడు పాల్ తో కలిసి వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆమెకు క్రిష్ అలియస్ శివ్ కృష్ణ (నరేష్ అగస్త్య), సింధు (భావన) చిన్ననాటి స్నేహితులుంటారు. వీరు అంతా కలిసి పెరిగి పెద్దవుతారు. అయితే వీరందరికీ ఒకరితో ఒకరికి రిలేషన్ ఉంటుంది.

అయితే మాయ క్రిష్, సింధుని తన వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. దాంతో వీరిద్దరూ కలిసి మాయ పెళ్లికి ఓ కారును అద్దెకు తీసుకుని రోడ్డు మార్గాన బయలుదేరుతారు.

అయితే వీరిద్దరి రోడ్డు ప్రయాణం ఎలా సాగింది?

క్రిష్, సింధూల మధ్య ఉన్న బంధం ఎలాంటిది?

అలాగే క్రిష్, మాయల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది?

మంచి స్నేహితులుగా ఉన్న మాయ, సింధూలు ఎందుకు దూరం అయ్యారు?

చివరకు క్రిష్ సింధు ఒకటయ్యారా ? 

తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా చూసే లోపు #మాయలో సినిమా మీద ఓక అవగాహన రావాలంటే మా 18F మూవీస్ టీం సమీక్ష చదవాలసిందే !

కధనం పరిశీలిస్తే (Screen – Play):

#మాయలో కు రాసుకొన్న కధ టార్గెట్ ఆడియన్స్ ని దృష్టి లో పెట్టుకొని రాసినా కధనం (స్క్రీన్ – ప్లే ) తో అందరికీ మెచ్చే విధంగా, దియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించే లా ఉండకుండా కొందరికోసమే అన్నట్టు సాగిపోతుంది ఈ సినిమా కధనం.    దర్శకుడు మేఘా మిత్ర పేర్వార్ యూత్ ని అలరించే కంటెంట్ అండ్ క్వాలిటీతో తెరకెక్కించారు.

సినిమా మొత్తం లో ఎక్కువ భాగం రోడ్డు జర్నీ లో డైలాగ్స్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్ తో సాగడం కూడా సాటి ప్రేక్షకులను దియేటర్స్ కి రప్పించడం కస్టం అవ్వవచ్చు. కొన్ని సీన్స్ అయితే కధనం (స్క్రీన్ – ప్లే ) లో బాగంగా రిపీట్ అవుటన్నాయా అనిపిస్తుంది.

ఇలాంటి చిన్న చిన్న విషయాలు కధనం రాసుకొనేటప్పుడు జాగ్రతపడి ఉంటే #మాయలో సినిమా అందరిని ఆలరించేది.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

mayalo movie review by 18F movies 3

చిత్ర దర్శకుడు మేఘా మిత్ర పేర్వార్  నేటి యూత్ ని టార్గెట్ చేసుకుని రాసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్   ఆద్యంతం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఓ రొమాంటిక్ కామెడీని బెస్ట్ సిట్యువేశనల్ కామెడీ కధనం తో వెండితెరపై ఆవిష్కరించారు దర్శకుడు. ముఖ్యంగా దర్శకుడు మేఘా మిత్ర సంభాషణలు నేటి మోడ్రన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి.

మత్తు వదలరా, పంచతంత్ర సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు పొందిన నరేష్ అగస్త్య  ఈ సినిమాలో కూడా తన మార్క్ నటనతో యూత్ ని బాగా ఆకట్టుకున్నాడు. భావనతో తన కెమిస్ట్రీ బాగా కుదిరిందది. ఇద్దరూ రోడ్డు జర్నీలో టామ్ జెర్రీ గుర్తొచ్చేలా నటించి ఆకట్టుకున్నారు.

అలాగే మాయ పాత్రలో జ్ఞానేశ్వరి తన మార్కు మోడ్రన్ గాళ్ గా మెప్పిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో భావనతో పోటీ పడినటించింది. వీరిద్దరి సంభాషణలు క్లైమాక్స్ లో నేటి యూత్ ని బాగా ఎంజాయ్ చేసేలా ఉన్నాయి.

ఆర్జే హేమంత్ పోలీసు పాత్రలో కాసేపు కనిపించి మెప్పించారు. మంత్ ఆఫ్ మధు, ధూత లలో జ్ఞానేశ్వరి ఎంతబాగా ఆకట్టుకుందో  ఇందులో కూడా అలానే ఆధునిక భావాలున్న అమ్మాయిగా నటించి కుర్రకారును ఆకట్టుకుంది. సర్కారు నౌకరిలో నటిస్తున్న భావన కూడా ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ గా మెప్పించింది.

mayalo movie review by 18F movies 1

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నటీనటులను చాలా మోడ్రన్ గా చూపించారు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. ఎక్కడా బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లేను చాలా గ్రిప్పింగ్ గా నడిపించారు. సంగీతం పర్వాలేదు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా క్వాలిటీతో నిర్మించారు.

mayalo movie review by 18F movies 5

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ కి అలవాటు పడిన మోడ్రన్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా చాలా సినిమాలు ఈ మధ్య కాలం లో వస్తున్నాయి. అవన్నీ ఎక్కువ గా  ఓటీటీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ నిర్మించినవే. అయితే ఈ శుక్ర వారం దియేటర్స్ లోకి వచ్చిన ఈ #మాయలో సిన్మా మాత్రం దియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులను  అలరించే కంటెంట్ అండ్ క్వాలిటీతో తెరకెక్కించారు దర్శకుడు మేఘా మిత్ర పేర్వార్.

యువత కి నచ్చే  ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో  ఇందులో అలాంటి స్క్రీన్ ప్లేకి సంభాషణల రూపంలో మసాలా జోడించి నవ్వులు పూయించారు దర్శకుడు మేఘా మిత్ర పేర్వార్. ఈ చిత్రం మొదటి అంకం నుండి చివరి భాగం వరకూ ఎక్కువ భాగం రోడ్డు ప్రయాణంలోనే సాగిపోతుంది.

నరేష్ అగస్త్య, భావనలిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ లేకుండా సినిమాను నడిపించాడు దర్శకుడు. ఓక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చూడాలి అనుకొనే సినీ లవర్స్ అందరికీ #మాయలో పడిపోతారు. చక్కగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఈ #మాయలో..

mayalo movie review by 18F movies 2

చివరి మాట: ప్రస్తుత యువత #మాయలో పడతారు !

18F RATING: 3 /5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *