MattiKadha Won many International Awards: *మట్టి కథ” మూవీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యంగ్ ప్రామిసింగ్ హీరో అజయ్ వేద్

IMG 20230925 WA0136 e1695717602210

 

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది మట్టి కథ. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఒక కొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

IMG 20230923 WA0050

మట్టి కథ థియేటర్ లో చూసిన వారంతా అజయ్ వేద్ యాక్టింగ్ బాగుందని, అతనో ప్రామిసింగ్ టాలెంటెడ్ యాక్టర్ అవుతాడని అప్రిషియేట్ చేస్తున్నారు. మట్టి కథ ప్రచార కార్యక్రమాల్లో అజయ్ వేద్ మాట్లాడిన తీరు కూడా నటుడిగా అతనిలోని కాన్ఫిడెన్స్ చూపించింది.

IMG 20230925 WA0138

 

మట్టి కథ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ అజయ్ వేద్ టాలెంట్, పంక్చువాలిటీ, కమిట్ మెంట్ తనను ఆకట్టుకుందని, అతనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు. థియేటర్ లో ఆడియెన్స్ ను తన యాక్టింగ్ తో ఇంప్రెస్ చేశారు అజయ్ వేద్. క్రియేటివ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలనేది తన గోల్ గా చెబుతున్నారీ యంగ్ హీరో.

IMG 20230925 WA0137

మట్టి కథ సినిమాలో అజయ్ వేద్ తో పాటు మాయ, కనకవ్వ, దయానంద్ రెడ్డి, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి నిర్మించారు. సహనిర్మాత సతీశ్ మంజీర. పవన్ కడియాల దర్శకత్వం వహించారు. మట్టి కథ సినిమా ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూడు కేటగిరీల్లో అవార్డులతో పాటు 9 అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *