MATA  President Srinivas Announce New Welfare Program : మాటతో నేను చేస్తున్న సేవలకు నా జీవితం ఆనందం అంటున్న మాట అధ్యక్షుడు శ్రీనావాస్‌ గనగోని 

MATA President Srinivas Announce New Welfare Program5 e1709117285573

మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్‌ ) ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 వరకు జరగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఈ రోజుతో కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న కంటి కాటరాక్ట్‌ ఆపరేషన్ల క్యాంప్‌ ముగిసింది.

ముగింపు కార్యక్రమంలో భాగంగా మాట అధ్యక్షుడు శ్రీనివాస్‌ గనగోని మాట్లాడుతూ–‘‘ మాట ( మన అమెరికా తెలుగు అసోసియేషన్‌) ప్రారంభించిన పదినెలల్లోనే 22 బ్రాంచిలను దాదాపు 5000 మందితో అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇండియాలో ఈ నెల 17న వరంగల్‌లో 500 మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు మరియు జనరల్‌ మెడిసిన్‌ ట్రీట్‌మెంట్‌లు చేశాము. 18న ఆశలపల్లిలో మరో 300 మందికి క్యాన్సర్‌ టెస్ట్‌లతో పాటు జనరల్‌ టెస్ట్‌లు కూడా చేసి మందులను ఉచితంగా పంచిము.

MATA President Srinivas Announce New Welfare Program1

అలాగే 19న కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శంకర్‌ నేత్రాలయ వారితో కలిసి కంటి ఆపరేషన్లకు సంబంధించి 2300మంది వరకు టెస్ట్‌లు చేశాము. దాదాపు 200 మందికి ఆపరేషన్‌లు నిర్వహించి 100 మందికి ఉచిత కళ్లజోళ్లను పంపిణి చేశాము. మరో 250 మందిని చెన్నైకి పంపించి వైద్యం చేయిస్తున్నాం. ఇదంతా చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని మాట అధ్యక్షుడు శ్రీనివాస్‌ గనగోని అన్నారు.

MATA President Srinivas Announce New Welfare Program3

ఫెస్టివల్స్‌ ఫర్‌ జోయ్‌ అధ్యక్షురాలు సుమ కనకాల మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎంతో మానవత్వం ఉండాలి. అలాంటి మానవత్వం ఉన్న ఎంతో మంది కలిసి చేయబట్టే దాదాపు 2000మందికి పైగా ఈ రోజు ఐ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయగలిగారని దాదాపు 195 ఆపరేషన్లు జరిగినందుకు శంకర్‌ నేత్రాలయ టీమ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అన్నారు.

రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ–‘‘ గతంలో నన్ను అందరూ సుమ భర్త అని ఎవరన్నా అంటుంటే చిరగ్గా ఉండేదని ఇప్పుడు సుమ ఇలాంటి మంచిపనులు చేస్తున్నందుకు సుమ భర్త అంటుంటే ఎంతో గర్వంగా ఉందని కాలర్‌ ఎగరేసుకుని మరి సుమ భర్తనే అని చెప్పుకోవాలి అనిపిస్తుంది’’ అన్నారు. కార్యక్రమంలో శంకర్‌ నేత్రాలయ ప్రతినిధి అరుల్, డాక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ బొలగం, ప్రవాసాంధ్రుడు ప్రదీప్‌ సామల టివి ఫెడరేషన్‌ సభ్యులు విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *