రవితేజ ‘మాస్ జాతర’ చిత్ర  గ్లింప్స్ ఎలా ఉన్నాయంటే ! 

IMG 20250126 WA0056 scaled e1737891640462

 మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది.

జనవరి 26వ తేదీన రవితేజ పుట్టినరోజు సందర్భంగా, ‘మాస్ జాతర’ గ్లింప్స్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ గ్లింప్స్, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మునుపటి అసలు సిసలైన మాస్ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఉంది.

తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ మరియు ఎనర్జీకి పెట్టింది పేరు రవితేజ. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటాయి. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్ గా మాస్ జాతర రూపొందుతోందని గ్లింప్స్ ను చూస్తే అర్థమవుతోంది.

రవితేజ సినీ ప్రస్థానంలో “మనదే ఇదంతా” అనే డైలాగ్ ఎంతటి ప్రాముఖ్యత పొందినదో తెలిసిందే. గ్లింప్స్‌ కు ఈ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అభిమానులను మళ్ళీ ఆ రోజులకు తీసుకొని వెళ్తుంది. అలాగే నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

దర్శకుడు భాను బోగవరపు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా ‘మాస్ జాతర’ గ్లింప్స్‌ ను మలిచారు. మాస్ మహారాజాగా రవితేజ మాస్ ప్రేక్షకులకు ఎందుకు అంతలా చేరువయ్యారో ఈ గ్లింప్స్‌ మరోసారి రుజువు చేస్తోంది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం, రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఉండటమే కాకుండా, గ్లింప్స్‌ కు ప్రధాన బలంగా ఉంది.

IMG 20250126 WA0318

‘మాస్ జాతర’ చిత్రాన్ని మాసివ్ ఎంటర్టైనర్ గా మలచడానికి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నందు సవిరిగాన సంభాషణలు సమకూర్చారు.

ఈ చిత్రంలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ-శ్రీలీల జోడి గతంలో ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరి కలయికలో ‘మాస్ జాతర’ రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

తాజాగా విడుదలైన గ్లింప్స్ ‘మాస్ జాతర’ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

తారాగణం:

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల..,

సాంకేతిక వర్గం: 

దర్శకత్వం: భాను బోగవరపు , నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య , రచన: భాను బోగవరపు, నందు సవిరిగాన, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కూర్పు: నవీన్ నూలి , ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల,ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, బ్యానర్స్: సితార,  ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌,,పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *