Maruthi Nagar Subramanyam Movie Update : అల్లు అర్జున్‌  సీన్లు రీక్రియేట్‌ చేస్తూ ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో రొమాంటిక్ సాంగ్ !

IMG 20240417 WA0049 e1713329300236

రావు రమేష్ హీరోగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం‘. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ను ఇవాళ విడుదల చేశారు.

IMG 20240322 WA0163

మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కొయ్య కనిపించనున్నారు. అందుకని, ఆయన అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను పాడుకున్నారు.

IMG 20240417 WA0073

‘తొలి తొలి సారి తొలిసారి

గుండె గంతులేస్తున్నదే!

ఏంటీ అల్లరి అంటే వినకుందే!

ఎందుకనో నువ్వు నచ్చేసి

వెంట వెంట పడుతున్నదే!

కన్ను తోడు రమ్మని పిలిచిందే!

నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత

నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత

ఒక్క మాట చెప్పు ఇంటి ముందు వాలిపోతా

ఏదో మాయ చేశావటే

నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెళ్ళిపోతా

నక్సలైటు లాగ నేను నీకు లొంగిపోతా

ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఎప్పుడు లేదే

తనందం ఎంతటి గొప్పది అంటే

తలెత్తి చూడక తప్పదు అంతే

తలొంచి మొక్కిన తప్పేం కాదే

మేడమ్ సారు మేడమ్ అంతే’ అంటూ సాగిందీ పాట.

‘మేడమ్ సార్ మేడమ్ సార్’ను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు. ఇప్పటి వరకు ఆయన ఇంత హుషారైన పాటను పాడలేదని చెప్పాలి. కళ్యాణ్ నాయక్ అందించిన అద్భుతమైన బాణీని తన గాత్రంతో మరో స్థాయికి తీసుకు వెళ్లారు. భాస్కరభట్ల పాటను రాశారు.

‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ దర్శక నిర్మాతలు మాట్లాడుతూ… ”టైటిల్ పాత్రలో రావు రమేష్ గారి లుక్, ఆల్రెడీ విడుదల చేసిన టైటిల్ సాంగ్ ‘నేనే సుబ్రమణ్యం… మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం’కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. భాస్కరభట్ల గారు తొలి పాటతో పాటు ఈ పాటకూ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

IMG 20240328 WA0199

ఈ రోజు సన్నాఫ్ సుబ్రమణ్యంగా నటించిన అంకిత్ కొయ్య సాంగ్ విడుదల చేశాం. అతను పోషించిన పాత్రకు, అల్లు అర్జున్ గారికి సినిమాలో చిన్న కనెక్షన్ ఉంటుంది. అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ‘జోహార్’, ‘తిమ్మరుసు’, ‘మజిలీ’, ‘శ్యామ్ సింగ రాయ్’తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించిన అంకిత్ కొయ్య మంచి నటన కనబరిచారు.

రమ్య పసుపులేటి ఈ జనరేషన్ ఇన్నోసెంట్ అమ్మాయి రోల్ చేశారు. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి. లిధా మ్యూజిక్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా మా సినిమాలో పాటల్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం” అని చెప్పారు.

నటి నటులు:

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి…

సాంకేతిక నిపుణులు:

సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, క్రియేటివ్‌ హెడ్‌: గోపాల్‌ అడుసుమల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *