Maruthi Nagar Subramanyam Movie Tittle Song Out: రావు రమేష్ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’  టైటిల్ సాంగ్ విడుదల !

IMG 20240322 WA0163 e1711108698845

 రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్‌ పోషించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం‘. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రధారులు.

పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంది.

ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఎవరూ చేయని విధంగా ప్రేక్షకుల చేత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి ఫస్ట్ లుక్ విడుదల చేసింది ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ టీమ్. తాజాగా సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు.

‘మారుతీ నగర్ లో ఫేమస్ అంటే నేనేలే

అందరూ ఇదే మాట అంటారులే!

మహారాజా యోగమే ఆన్ ద వేలో ఉందిలే…

నన్ను పట్టుకోవడానికే వస్తుందిలే!

చుట్టూ ఉంటారులే నవ్వేటోళ్లు ఏడ్సెటోళ్లు…

ఏం అన్నా గానీ నాకేం ఊడదే!

ఓ… ఇస్తారులే ఉంటే మరి వినేటోళ్లు

ఉచిత సలహాలనే!

నేనే సుబ్రమణ్యం… మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం!

నాకు నేనే ఇష్టం… మీకేంటంట కష్టం”

అంటూ సాగిన ఈ గీతాన్ని సెన్సేషనల్ క్రేజీ సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. కళ్యాణ్ నాయక్ అందించిన బాణీకి అందరూ పాడుకునేలా చక్కటి సాహిత్యం అందించారు భాస్కరభట్ల. లోధా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లో సాంగ్ రిలీజ్ అయ్యింది.

IMG 20240322 WA0168

సినిమాలో రావు రమేష్ క్యారెక్టరైజేషన్ వివరిస్తూ సాగిందీ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం‘ టైటిల్ సాంగ్. చుట్టుపక్కల ప్రజలు సలహాలు ఇచ్చినా పట్టించుకోనని, తనకు అదృష్టం తక్కువ ఉంది గానీ, త్వరలో మహారాజ యోగం పడుతుందని చెప్పే పాత్రలో హీరో కనిపించనున్నారు.

సోషల్ మీడియాలో ఎటు చూసినా ‘నేనే సుబ్రమణ్యం‘ ప్రోమోకు నెటిజన్స్ వేసిన స్టెప్పులే కనిపిస్తున్నాయి. ‘కచ్చా బాదాం’ రీల్, స్టెప్పులతో వైరల్ అయిన అంజలీ అరోరా దగ్గర నుంచి తెలుగు అమ్మాయిల వరకు అందరూ రావు రమేష్ పాటకు తమదైన శైలిలో స్టెప్స్ వేస్తున్నారు. దాంతో ఈ సాంగ్ సెన్సేషన్ అయ్యింది.

‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ దర్శక నిర్మాతలు మాట్లాడుతూ… ”లుంగీలో రావు రమేష్ గారి లుక్ బావుందని వాట్సాప్, సోషల్ మీడియాలో ఎంతో మంది మెసేజెస్ చేశారు. ఆయన్ను చూస్తే నేటివ్ ఫీలింగ్ వచ్చిందన్నారు. సినిమా సైతం అలాగే ఉంటుంది.

నేటివిటీతో కూడిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. వినోదంతో పాటు మంచి కథ, భావోద్వేగాలు సైతం సినిమాలో ఉన్నాయి. ఇప్పటి వరకు రావు రమేష్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. త్వరలో ట్రైలర్, సినిమా విడుదల తేదీలు వెల్లడిస్తాం” అని చెప్పారు.

నటి నటులు:

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి..

సాంకేతిక వర్గం:

సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *