చిత్రం: మార్కెట్ మహా లక్ష్మీ ,
విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2024
నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ తదితరులు..,
దర్శకుడు: వీఎస్ ముఖేష్,
నిర్మాత: అఖిలేష్ కిలారు,
సంగీత దర్శకుడు: సృజన్ శశాంక,
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల,
ఎడిటింగ్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి,
మూవీ: మార్కెట్ మహా లక్ష్మీ రివ్యూ (Market Mahalakshmi Movie Review)
యువ నటుడు పార్వతీశం ప్రధాన పాత్రలో నూతన నటి ప్రణీకాన్వికా హీరోయిన్ గా వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో ‘మార్కెట్ మహాలక్ష్మి’ అనే సినిమా తెరకెక్కింది. బి2పి స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని అఖిలేష్ కలారు ప్రొడ్యూస్ చేశారు.
కాగా ఈ సినిమా ఈ శుక్ర వారం రోజు విడుదల అయింది. సినిమా స్క్రిప్ట్ మీద నమ్మకం తో మూవీ మేకర్స్ విడుదల కు ఒక్క రోజు ముందే మీడియా కు స్పెషల్ షో చేసి చూపించారు. మరి మీడియా మిత్రులను, ఈ శుక్ర వారం దియేటర్స్ లో ప్రేక్షకులను ఈ ‘మార్కెట్ మహాలక్ష్మి’ చిత్రం ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ఇంజీనీరు బాబు (పార్వతీశం), తండ్రి కట్నం కోసం ఆశపడి ఏర్పాటు చేస్తున్న పెళ్లి కూతుర్లు తనకు నచ్చక ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటూ అనుకోకుండా, మార్కెట్‌లో కాయగూరలు అమ్మే అమ్మాయి మహాలక్ష్మి (ప్రణీకాన్వికా)తో ప్రేమలో పడతాడు.
మరోవైపు పార్వతీశం తండ్రి మార్కెట్ అమ్మాయిని కాదంటూ మంచి కట్నం తెచ్చే అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇటు మహాలక్ష్మి మాత్రం తన కుటుంబ పోషణే ప్రదమ కర్తవ్యం అనుకొంటూ, ప్రేమకు దూరంగా ఉంటుంది.
ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య..
పార్వతీశం తన ప్రేమ కోసం ఏం చేశాడు ?,
మహా లక్ష్మీ నే ఎందుకు ప్రేమించాడు ?
తన ప్రేమను గెలిపించడం కోసం ఏ నిర్ణయం తీసుకున్నాడు ?,
ఇంతకీ, ‘మార్కెట్ మహాలక్ష్మి’ సాఫ్ట్ వేర్ బాబుతో ప్రేమలో పడిందా ? లేదా ?,
చివరకు ఈ కథ ఎలా ముగిసింది ?
అనే విశయాలు తెలియాలి అంటే వెంటనే సినిమా దియేటర్ కి వెళ్ళి మార్కెట్ మహా లక్ష్మీ ని చూసేయండి.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
మార్కెట్ మహాలక్ష్మి సినిమాలో పెద్దగా కథ లేకపోవడం కథనం (స్క్రీన్ – ప్లే) కూడా రెగ్యులర్ ఫార్మెట్ లో సాగడం ఈ సినిమా మొదటి అంకం ( ఫస్ట్ ఆఫ్ ) కొద్దిగా బోర్ అనిపిస్తుంది. మొదటి అంకమే ఈ సినిమా కి మైనస్ అయ్యింది.
అదేవిధంగా మార్కెట్ లో జరిగే కొన్ని సీన్స్ చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు కధనం ( స్క్రీన్ ప్లే) కూడా రొటీన్ గా చాలా స్లోగా సింపుల్ గా సాగింది.
కొంచెం డీటైల్ గా చెప్పాలి అంటే, హీరో పార్వతీశం తాను ఎందుకు మహాలక్ష్మిని ప్రేమిస్తున్నాడో ఒక్క సారీ కాకుండా సంధర్బం వచ్చినప్పుడల్లా గుర్తు చేస్తూనే ఉంటాడు. వీటి వలన చూసే ప్రేక్షకులకు రిపీటెడ్ సీన్స్ చూస్తున్నమా అనిపించింది.
ఇక రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో కొన్ని సన్నివేశాలు సంధార్బానుసారం కాకుండా డ్రామటిక్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ప్రధాన పాత్రలు క్లైమాక్స్ లోకి వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ గా అనిపించినప్పటికీ, సినిమా స్టార్టింగ్ నుండి ఇంటర్వల్ వరకూ ఆ క్యారెక్టరైజేషన్స్ కి క్లారిటీ మిస్ అయినట్టు అనిపించింది. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ నాటకీయత ఎక్కువవడంతో ఆ సీన్స్ లో పూర్తిగా సహజత్వం లోపించింది.
ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ముందుగానే చెక్ చేసుకొని కధనం (స్క్రీన్ -ప్లే ) సహజత్వానికి దగ్గిరిగా వ్రాసుకొని ఉంటే మంచి ఎమోషనల్ టచ్ ఉన్న సినిమా గానిలిచిపోయేది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు వీఎస్ ముఖేష్ తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఏ మేరకు సక్సెస్ అయ్యాడు అనేది చెప్పేకంటే మంచి ఫ్యామిలీ రిలేసన్స్ ఉన్న కధ వ్రాసుకొని దాన్ని కామిక్ జోనర్ లో చెప్పే ప్రయత్నం చేశాడు.
విజటబుల్ మార్కెట్ లో కాయగూరల అమ్మే అమ్మాయి మంచి తనమ చూసి, ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది ? అనే ప్రధాన కథాంశం బాగుంది. ఈ కధ కి తీసుకొన్న పాయింట్ బాగున్నా, కధనం (స్క్రిప్ట్, స్క్రీన్ -ప్లే) పై దర్శకుడు ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే సినిమా రిసల్ట్ ఇంకా బాగా వచ్చేది.
సినిమాలో కీలక పాత్రలో నటించిన పార్వతీశం చాలా బాగా నటించాడు. తన పాత్రకు తగ్గట్లు మెట్యూరూడ్ నటనతో ఎమోషనల్ డైలాగ్స్ చెప్తూ, కామెడీ సన్నివేశాల్లో కావలసిన దగ్గర హ్యూమర్ మిక్స్ చేస్తూ బాగా ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టరైజేషన్ తో, తన టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.
హీరోయిన్ గా నటించిన ప్రణీకాన్వికా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ మెప్పించింది. అక్కడక్కడా కళ్ళతోనే నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేసింది.
హీరోకి ఫ్రెండ్ గా నటించిన ముక్కు అవినాష్ కూడా తన కామెడీతో ఆకట్టుకున్నాడు. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన హర్షవర్ధన్ మెప్పించాడు.
మహబూబ్ బాషా తో పాటు ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో ప్రి క్లైమాక్స్ నుండి చాలా ఎమోషనల్ వే లో సాగుతూ యువతకి మంచి మెసేజ్ ఇచ్చే లా ఉంది.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
సృజన్ శశాంక మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ మాత్రేయమ్ సిట్యువేశనల్ ఉన్నాయి. అంతగా క్యాఛి ట్యూన్స్ కాకపోయినా సినిమా లో చూస్తున్నప్పుడు ఆకట్టుకొంటాయి.
సురేంద్ర చిలుముల సినిమాటోగ్రఫీ బాగుంది. ఎక్కువ బాగం కూరగాయల మార్కెట్ లోనే ఘాట్ చేసినా చాలా ఫ్రమ్స్ రిచ్ గా కనిపించాయి. హైదరాబాద్ సిటీ షాట్స్ కూడా బాగున్నాయి.
ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి ఎడిటింగ్ పర్వాలేదు, సినిమాలోని కొన్ని సాగతీత సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యేది.
నిర్మాత అఖిలేష్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా ప్రమోషన్స్ కూడా చిన్న సినిమా అని చూడకుండా, మంచి సినిమా అని నమ్మి బాగా చేశారు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
ఈ కధ కి ‘మార్కెట్ మహాలక్ష్మి’ అని పేరు పెట్టినా, కొత్తగా పెళ్లిచేసుకొనే వారిని ఆలోచనలో పడవేసే మంచి పాయింట్ తో వచ్చిన ఈ లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఫ్యూర్ లవ్ సీన్స్ బాగున్నాయి. కానీ స్లో నేరేషన్ అండ్ బోరింగ్స్క్రీన్ ప్లే తో కొంచెం నిరాశ పరిచింది అని చెప్పవచ్చు.
కానీ చివరి 40 మినిట్స్ సినిమా మాత్రం ప్రతి యువ జంటకు, తల్లి- తండ్రులకు బాగా కనెక్ట్ అవుతుంది. మార్కెట్ సీన్స్ మాత్రం న్యాచురల్ గా లేకుండా సినిమాటిక్ డ్రామా లాగే సాగడం వలన, ఓవరాల్ గా ఈ చిత్రం దియేటర్స్ లో కొంత మంది ప్రేక్షకులను మాత్రమే మెప్పించవచ్చు.
కానీ, ఓటీటీ లోనూ, టివి లోను ప్రతి ఫ్యామిలీ చూసేటువంటి మంచి పాయింట్ ఉన్న సినిమా.