“Market Mahalakshmi” Movie Producer Special Interview: మా సినిమా “మార్కెట్ మహాలక్ష్మి” పెద్ద హిట్ అవుతుంది: ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు!

Market Mahalakshmi producer Akhilesh special Interview e1713346369792

బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ ఉండగా, ఈ క్రమంలో ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు మా 18F మూవీస్ మీడియా ప్రతినిధితో జూమ్ మీటింగ్ లో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు.

Market Mahalakshmi producer Akhilesh special Interview 2

మీ పేరు, మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా?

నా పేరు అఖిలేష్ కలారు. నేను ఇండియానాపోలిస్, USలో ఉంటున్నాను & ఫార్చ్యూన్ 500 కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను.

మీరు సినిమా లోకి రావడానికి ఇన్స్పిరేషన్ అండ్ రీజన్ ఏంటి?

చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. సినిమా పరిశ్రమలో పనిచేయాలని అనుకున్నాను. కుటుంబ కమిట్‌మెంట్‌ల కారణంగా, నేను మొదట ఆ బాధ్యతలను పూర్తి చేసి, ఆపై నా అభిరుచిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను.

Market Mahalakshmi producer Akhilesh special Interview 1

డైరెక్టర్ ముఖేష్ మీకు ఎలా పరిచయం? & మార్కెట్ మహాలక్ష్మి మూవీ కి ప్రోడ్యుజ్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు?

దర్శకుడు విఎస్ ముఖేష్ నాకు దాదాపు రెండేళ్లుగా తెలుసు. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎలా వచ్చాడో నాకు తెలుసు. 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్. “మార్కెట్ మహాలక్ష్మి” కథను ఆయన చెప్పినప్పుడు, నేను దానిని ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నాను.

 ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ప్రోడ్యుజ్ చేస్తున్నందుకు మీకు రిస్క్ అనిపించలేదా?

రిస్క్ లేని వ్యాపారం లేదు. దర్శకుడు ముఖేష్‌ స్క్రిప్ట్‌ని నమ్మి ఆ రిస్క్‌ నేను తీసుకున్నాను.

మార్కెట్ మహాలక్ష్మి కథ ఏంటి? ప్రేక్షకులని మీ కథ ఆకట్టుకుంటుంది అని అనుకుంటున్నారా?

“మార్కెట్ మహాలక్ష్మి” కథ చాలా సింపుల్. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ ఇది. మేము మా ప్రమోషన్‌లలో ఒక మెయిన్ పాయింట్ నీ చెప్పలేదు. ఆ పాయింట్ 19వ తేదీన ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుందని ఆశిస్తున్నాం.

market mahalaxmi trailer launch highlights 3

 మీరు US లో ఉంటూ, India లో షూటింగ్ ఎలా మేనేజ్ చేయగలిగారు?

మొదట్లో నాకు ఆ డౌట్స్ ఉండేది ఇండియాలో షూటింగ్ మేనేజ్ చేస్తూ, ఇక్కడ యూఎస్ లో జాబ్ ఎలా మేనేజ్ చేయాలా అని. అయితే, మా చేతిలో మంచి టీమ్ ఉంది, డైరెక్టర్ ముఖేష్ వాళ్లని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశాడు. నా పని కొంచెం ఈజీ అయిపోయింది.

సినిమాలో హీరో & హీరోయిన్ తమ పాత్రలకి న్యాయం చేసారు అని అనుకుంటున్నారా?

నటీనటులు తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. పార్వతీశం మరియు ప్రణీకాన్విక ఇద్దరూ తమ పాత్రల్లో జీవించారు. వారి కెమిస్ట్రీ చాలా బాగుంది.

సినిమా కంప్లీట్ అయ్యాక చూసి, పెద్ద ఆర్టిస్ట్ లతో వెళ్లి ఉంటె బాగుండు అని ఫీల్ అయ్యారా?

పెద్ద నటీనటులతో ఈ సినిమా చేస్తే బాగుండేదని నాకెప్పుడూ అనిపించలేదు. పార్వతీశం, ప్రణీకాన్విక, అవినాష్, బాషా మరియు ఇతర నటీనటులు వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

Market Mahalakshmi producer Akhilesh special Interview 4

మొదట్లో మీకు ఏదయితే డైరెక్టర్ కథ చెప్పాడో అది పెర్ఫెక్ట్ గా డెలివరీ చేశాడా?

నిజానికి దర్శకుడు ముఖేష్‌ నాకు చెప్పిన కథనే తెరపైకి తెచ్చారు. ముఖేష్ కథ చెప్పినప్పుడు నేను వారి పాత్రలను విజువలైజ్ చేసుకున్నాను. ఫైనల్ గా సినిమా చూసాక, నేను ఊహించిన వాటిని తెరపై చూసినట్టు అనిపించింది.

మీరు పెట్టిన డబ్బులు రికవరీ అవ్వుతుందని మీరు నమ్ముతున్నారా?

నేను పెట్టుబడి పెట్టిన డబ్బును “మార్కెట్ మహాలక్ష్మి” రికవరీ చేస్తుందని నమ్ముతున్నాను. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం చాలా కష్టం, కానీ మేము దానిని విజయవంతంగా పూర్తి చేసాము. ఏప్రిల్ 19న విడుదల కూడా చేయబోతున్నాము. మా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుందన్న నమ్మకం ఉంది.

ఈ ఫ్రైడే వేరే సినిమాలతో పాటు, మీ సినిమా కూడా రీలిజ్ అవ్వుతుంది? మీ సినిమా హిట్ అవ్వుతుందని మీరు భావిస్తున్నారా? ఎందుకు?

నాకు సినిమాలంటే ప్రాణం. ఈ శుక్రవారం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి సినిమా నిర్మాతను ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నాను. అందులో నా సినిమా మరింత విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.

IMG 20240413 WA0063

మీకు ఇది ఫస్ట్ మూవీ కదా? సినిమా ప్రోసెస్ ఏమైనా కొత్తగా అనిపించిందా?

ఈ సినిమా పూజా కార్యక్రమం నుంచి షూటింగ్ ముగిసే వరకు ఫస్ట్ కాపీ వరకు చాలా నేర్చుకున్నాను. ఇది నాకు గొప్ప అవకాశం. ముఖేష్ సినిమా గురించి నాకు ప్రతిరోజూ అప్‌డేట్ చేస్తూ సపోర్టుగా నిలిచారు.

ఈ సినిమా తరువాత మీ ప్ల్యాన్ ఏంటి?

సినిమాలంటే చాలా ఇష్టం, ఎన్నో కష్టాలతో ఈ స్థాయికి చేరుకున్నాను. “మార్కెట్ మహాలక్ష్మి” కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. గ్రాండ్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. మరిన్ని సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో ఒక ప్రముఖ స్థానం సాధించాలని ఆశిస్తున్నాను.

ఒకే థాంక్ యు అండ్ అల్ ది బెస్ట్ అఖిలేష్ గారూ..,

  * కృష్ణ ప్రగడ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *