Market Mahalakshmi Movie Director Special Interview: మార్కెట్ మహాలక్ష్మి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: దర్శకుడు విఎస్ ముఖేష్ !

IMG 20240416 WA0141 scaled e1713263392792

బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు.ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

IMG 20240409 WA0168

అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ ఉండగా, ఈ క్రమంలో దర్శకుడు వియస్ ముఖేష్ మా 18F మూవీస్ మీడియా ప్రతినిధి తో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. వాటిని మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము.

నా పేరు విఎస్ ముఖేష్. YouTube ప్లాట్ ఫామ్ ‌లో దాదాపు 100+ షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అలా ఒకరోజు నేను అఖిలేష్‌ గారిని కలవడం “మార్కెట్ మహాలక్ష్మి” స్క్రిప్ట్‌ను నరేట్ చేయడం జరిగింది.

“మార్కెట్ మహాలక్ష్మి” స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. చాలా మంది తమ సినిమాలలో కొత్త పాయింట్ ని టచ్ చేశామని చెప్తుంటారు. అలానే మేము కూడా నిజాయితీగా, ఇప్పటి వరకు ఆడియన్స్ కి తెలియని ఒక కొత్త పాయింట్‌ను టచ్ చేసాము. ఆ మేజర్ పాయింట్ ని ప్రమోషన్ల కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే టీజర్, ట్రైలర్‌లో చూపించలేదు. ఆ కొత్త పాయింట్ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము.

IMG 20240416 WA0145

పార్వతీశం నాకు చాలా కాలంగా తెలుసు, అతను నాకు మంచి స్నేహితుడు. నేను పార్వతీశం & కొత్త నటిని ఎంచుకోవడానికి కారణం వాళ్ళు ఈ పాత్రలకి సరైన న్యాయం చేయగలరని నమ్మకమే. ఒక కొత్త దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఆ తర్వాతే స్టార్స్ అవకాశాలు ఇస్తారు.

“మార్కెట్ మహాలక్ష్మి” పూర్తి లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిజ జీవితంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అది బేస్ చేసుకొని సినిమా కథ గా రాయడం జరిగింది. రియల్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. వాస్తవికత కు దగ్గర గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. అల్లాగే, నేను మార్కెట్‌లో కొంతమంది వ్యక్తులను కూడా గమనించాను.

IMG 20240416 WA0139

“మార్కెట్ మహాలక్ష్మి” బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పాటలు అద్భుతంగా మరియు ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. థియేటర్లలో ఒకసారి సినిమా చూస్తే, మీకు ఆ ఫీల్ కలుగుతుంది.

IMG 20240413 WA0063

శ్రీముఖి మరియు పార్వతీశంతో ఒక ఇంటర్వ్యూలో, వైరల్ చెంప దెబ్బ సంఘటన వంటి వినూత్న ప్రమోషన్స్ సినిమాకి బజ్ ని పెంచాయి

మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. నా నమ్మకం నటీనటులపై కాదు, నా స్క్రిప్ట్‌పై, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నేను నమ్ముతున్నాను.

IMG 20240407 WA0140 1

మార్కెట్ మహాలక్ష్మి సెన్సార్ పనులన్నీ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి థియేటర్ లో ఈనెల 19న వచ్చేస్తుంది. ఈ సినిమా మొదటి నుంచే కథతో ప్రారంభమవ్వుతుంది అందుకే, సినిమాలో ఎక్కడ మీకు డ్రాగ్ అనిపించదు. కొంతమంది పరిశ్రమ వ్యక్తులకు కూడా మేము చిత్రాన్ని ప్రదర్శించాము. సినిమా విడుదలైన తర్వాత గర్వంగా తమ అభిప్రాయాలను పంచుకుంటారని ఆశిస్తున్నాను.

మా సినిమా లో 6 పాటలు, ఒక ఫైట్‌తో సహా మొత్తం షూటింగ్ భాగాన్ని 24 రోజుల్లో పూర్తి చేసాము. ముందు నుంచే ప్రీ-ప్రొడక్షన్ మీద కూర్చోవడం వళ్ళ త్వరగా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో నా పొటెన్షియల్ ఏంటో చూపించాలి అనుకున్నాను. అందుకే, చాలా జాగ్రత్త గా ప్లాన్ చేసి షూట్ చేసాము.

IMG 20240411 WA0099

పార్వతీశం మరియు ప్రణీకా అన్విక ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పార్వతీశంకి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని భావిస్తున్నాను.

మాకు చాలా OTT ఆఫర్‌లు వచ్చాయి, కానీ మా టీమ్ థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆడియన్స్ ఆదరిస్తారనే భావంతో రిస్క్ తీసుకున్నాం.

IMG 20240416 WA0137

మా సినిమా అందరికీ నచ్చుతుంది. థియేటర్లలో నా సినిమాను ఒక్కరు చూసినా, తప్పకుండా నచ్చుతుందని నమ్మకంతో చెప్పగలను.

ఒకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ ముకేష్ బ్రో..

  * కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *