Mangli’s song  from  Jithender Reddy Released : జితేందర్ రెడ్డి నుండి మంగ్లీ కొత్త పాట “లచ్చిమక్క”  విడుదల ! 

IMG 20240418 WA0064 scaled e1713436108949

ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి.

1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు.

గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. రీసెంట్ గానే విడుదల అయిన అ ఆ ఇ ఈ ఉ ఊ సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది,

IMG 20240418 WA0070

ముఖ్యంగా యువతకి ఆ పాట బాగా నచ్చింది. ఆ సాంగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ కాగా ఇప్పుడు విడుదలైన ఈ ‘లచ్చిమక్క’ సాంగ్ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఉంది. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు మంగ్లీ ఈ పాటని చాలా బాగా పాడారు.

జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగే పెళ్ళిలో సరదాగా సాగే ఒక పాటలా ఉంది. 1980′ లో లొకేషన్స్ అన్ని కూడా చాలా నాట్యురల్ గా ఉన్నాయి. ఈ పాత ద్వార కథలో ట్విస్టులు ఉన్నట్టు అర్ధమవుతుంది

IMG 20240418 WA0066

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ముదిగంటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ: ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరుకు రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా మంచి ఆదరణ పొందాయి. ప్రేక్షకులు కొత్త నిర్మాతలమైనా మన్నలిని ఇంత బాగా ఆదరిస్తున్నారు. కంటెంట్ ఉంటె మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆ సినిమాని ఆదరిస్తారు అని మరో సారి నిరూపించారు.

ప్రస్తుతం వస్తున్న కథలకి పూర్తి భిన్నంగా ఉంది ఈ జితేందర్ రెడ్డి. ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నటీ నటులు :

రాకేష్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్

టెక్నికల్ టీం :

డైరెక్టర్ : విరించి వర్మ, నిర్మాత : ముదుగంటి రవీందర్ రెడ్డి, కో – ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు, డి ఓ పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్, పి ఆర్ ఓ : మధు VR

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *