మూవీ : మంగళవారం (Mangalavaaram )
రిలీజ్ డేట్: 2023-11-17,
నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్, తదితరులు..
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం
సినిమాటోగ్రఫి: దాశరథి శివేంద్ర
మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి
బ్యానర్: A క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్
మంగళవారం రివ్యూ (Mangalavaaram)
RX100 తర్వాత అజయ్ భూపతి పాయల్ రాజ్ పుత్ కలయికలో సిన్మా అంటేనే ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి ఏర్పడింది. దర్శకుడు అజయ్ భూపతి ‘మంగళవారం’అనే టైటిల్ ఎనౌన్స్ చేయగానే ఫిల్మ్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరిగింది.
సినిమా విడుదలకు ముందే ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలు తీసుకు వచ్చిన ఈ మంగళవారం చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీమ్ సమీక్ష చదివి తెలుసుకుందామా!

కధ పరిశీలిస్తే (Story Line):
ఈస్ట్ గోదావరి లోని మాహాలక్ష్మీపురంలో గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజునే అక్రమ సంబంధాలు పెట్టుకున్న జంటలు చనిపోతూ ఉంటారు. వారంతా ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆ ఊరి ప్రజలంతా భావిస్తారు. కానీ, ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా (నందితా శ్వేత) మాత్రం ఎవరో వారిని హత్య చేశారని అనుమానిస్తోంది.
ఇంతకీ అక్కడ జరుగుతున్నవి హత్యలా ?ఆత్మహత్యలా ?,
వరుస మరణాలకు కారణం ఏంటి ?
కొన్నాళ్ళ క్రితం ఆ ఊరంతా వేలి వేసిన శైలజ (పాయల్) కి ఏమైనా లింక్ ఉందా ?
ఈ మధ్యలో శైలు, రవి ల కధ ఏమిటి?,
అలాగే ఆ ఊరు జమీందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ) ఎలాంటి వాడు?,
అసలు ఇంతకీ శైలు కథకు ఇప్పుడు ఊరిలో జరుగుతున్న హత్యలకు సంబంధం ఉందా ?
డాక్టర్, SI మీనా లా పాత్ర ఏమిటీ?
శైలు ప్రాబ్లెమ్ గుర్తించింది ఎవరు?, అసలు మాస్క్ వెనుక మనిషీ ఎవరూ?
వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే వెంటనే దియేటర్ కి వెళ్ళి మంగళవారం మూవీ చూసేయండి.

కధనం పరిశీలిస్తే (Screen – Play) :
మంగళవారం సినిమా కథ విలేజ్ లో జరిగే సంఘటనలతో మంచి క్రైమ్ డ్రామా రాసుకున్నా.. కొన్ని సీన్లు మాత్రం చాలా సింపుల్ కధనం ( స్క్రీన్ ప్లే) తో ఉన్నాయి.. అలాగే కొంత మేరకు బోల్డ్ పాయింట్ అండ్ షాట్స్ ఉన్నా కధలో భాగంగానే ఉన్నాయి
. అదేవిధంగా రవి పాత్రలో నటించిన నటుడు కూడా ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా ఉంది ఆ పాత్ర ప్రేక్షకులకూ షాకింగ్ లాంటిది. రవి. పాత్రధారుడు గురించి ముందు తెలియకుండా సినిమా చుస్తే థ్రిల్లింగ్ గా వుంటుంది.
మొత్తానికి మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేశారు.. మొదటి అంకం (ఫస్ట్ హాఫ్ ) కొన్ని న్నివేశాలు కూడా ఫస్ట్ గా అయిపోయినట్టు ఉంటుంది. ముఖ్యంగా అజయ్ ఘోస్ – లక్ష్మణ ల ట్రాక్ సూపర్ గా ఉంది. అప్పట్లో కోటా శ్రీనివాస రావు – బాబూ మోహన్ లా కామిడీ ట్రాక్ లా ఉంది.. కానీ మంగళవారం లో మాత్రం అంతా సిట్యువషనల్ కామిడీ గానే కధనం లో ఇమిడి పోయింది.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు అజయ్ భూపతి మంచి క్రైమ్ థ్రిల్లర్స్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. హీరోయిన్ ట్రాక్ ఇంకొంచెం ముందుగా ఇంటేర్డుస్ చేసి ఉండాల్సింది. కాని ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో మిస్టరీ థ్రిల్లర్ గా మంగళవారం మూవీ చేయడం చాలా గ్రేట్.
అక్రమ సంబంధాల నేపథ్యంలో వచ్చిన ఈ మర్డర్ మిస్టీరియస్ థ్రిల్లర్ లో కొన్ని హారర్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందలేదు.
దర్శకుడు రాసుకున్న క్రైమ్ డ్రామా కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా సినిమాలో ట్విస్ట్ లు ఆకట్టుకున్నాయి. నందిత శ్వేత సీరియస్ పోలీస్ అధికారిణిగా ఆకట్టుకున్నారు. కృష్ణ చైతన్య నటన అండ్ మేనరిజమ్ బాగున్నాయి.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

అజనీష్ లోక్నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంగళవారం సినిమా కి ప్రాణం పోసింది. కొన్ని సీన్లు లో ఇచ్చిన ట్రాక్ అయితె దియేటర్ నుండీ బయటకి వచ్చిన హంటింగ్ చేస్తూనే ఉన్నాయి. అజనిష్ కి కాంతారా, విరూపాక్ష తర్వాత ఈ మంగళవారం మంచి హిట్ సిన్మా అవుతుందీ.
దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. రాత్రుళ్లు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలా విజువల్ గా బాగా చూపించారు.
మాధవ్ కుమార్ గుళ్ళపల్లి ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సీన్లు లో వాడిన ఫ్రిజ్, బ్లాక్ ఔట్ ఎఫెక్ట్స్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి బాగా సెట్ అయ్యాయి.
నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి,, సురేష్ వర్మ ఎం ఖర్చుకి వెనకాడకుండా నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి సబ్జెక్ట్ ని సినిమా గా తియ్యాలి అంటే డబ్బుతో పాటు సిన్మా మీద ఫ్యాషన్ కూడా వుండాలి.

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
మంగళవారం’ సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి దర్శక రచయిత అజయ్ భూపతి ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కుచ్చిని చూసేలా సర్‌ప్రైజ్ చేస్తూ మొదటి భాగాన్ని మెయిన్ లీడ్ పాత్రలు (హీరో హీరోయిన్) లేకుండానే ముగించడం చాలా పెద్ద ఛాలెంజ్. ఇప్పటివరకూ ఎవరు టచ్ చేయని ఓక పాయింట్ తో హీరోయిన్ పాత్రను రాసుకోవడం మరో ఛాలెంజ్. ఇలా ఒక్కో ఛాలెంజ్ లతో, ట్విస్టులతో ఎంగేజ్ చేస్తూ కథ, క్యారెక్టర్లను ముందుకు నడిన తీరు బాగుంది.
ఎవరూ బయట మాట్లాడుకోలేని ( ముఖ్యంగా ఆడవారు) ఓక యూనిక్ పాయింట్ తీసుకుని ఈ సినిమా చేసినందుకు అజయ్ భూపతి ని అభినందించాలి. అజనీష్ మ్యూజిక్ కాంతారా, విరూపాక్ష తరువాత ఈ మంగళవారం లో మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. కొన్ని సీన్స్ ని బిజియం దామినెట్ చేసిందా అనిపిస్తుంది.
ఓవరాల్ గా ఈ మంగళవారం సినిమా ఎంగేజింగా ఉంటూ మిస్టరీ థ్రిల్లర్స్ ఇస్టపడేవారికి మంగళవారం సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. అందరు ప్రేక్షకులకు నచ్చుతుంది. తప్పకుండా దియేటర్స్ లో బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే మ్యూజిక్ & విజువల్ ట్రీట్ ని ఎంజాయ్ చేయగలం.

చివరి మాట: థ్రిల్స్ తో సాగే మిస్టరీ రాస్థీక్ విలేజ్ డ్రామా !
18F RATING: 3.5 / 5
* కృష్ణ ప్రగడ.