మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దు కుంటున్న చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఈ సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ చిత్రంలో నటించడం విశేషం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు.
ఈ నెల 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
నటుడు రంగస్థలం మహేశ్ మాట్లాడుతూ – “దక్ష” చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మంచు లక్ష్మి గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో ఆమెతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. సోషల్ మీడియాలో ఒక పర్సన్ గురించి చూపించే విధానానికి మనం దగ్గరగా వెళ్లి ఆ వ్యక్తి గురించి తెలుసుకునేదానికి చాలా తేడా ఉంది. మంచు లక్ష్మి గారు చాలా స్వీట్ పర్సన్. ఆమెతో ఈ మూవీ చేశాక నాకు అర్థమైంది. ఈ సినిమా ఆమెకు మరింత మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నా. అన్నారు.
నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ – “దక్ష” సినిమాలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా కనిపిస్తాను. ఈ క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన మంచు లక్ష్మి గారికి థ్యాంక్స్. “దక్ష” ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.
డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ – “దక్ష” ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. మీ అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం ఇలాంటి తరహా మూవీస్ నే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు లక్ష్మి అక్కకు థ్యాంక్స్. ఈ సినిమాలో మోహన్ బాబు గారు సహా ఎంతోమంది పెద్దవాళ్లను డైరెక్ట్ చేశాను. వాళ్లు నటనపట్ల అంకితభావం ఉన్నవాళ్లు కాబట్టే అంత పై స్థాయికి వచ్చారు. ఈ నెల 19న మా “దక్ష” మూవీ చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా.
నేను మనోజ్ అన్న ఫ్యాన్ ను. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక నాకు కన్నీళ్లు ఆగలేదు. విష్ణు అన్న కన్నప్ప, మనోజ్ అన్న మిరాయ్ సక్సెస్ అయినట్లే లక్ష్మి అక్క “దక్ష” సినిమా కూడా విజయం సాధించాలి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మిరాయ్ అంత స్థాయిలో వసూళ్లు చేస్తోందని మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. కన్నప్ప, మిరాయ్ లాగే మా సినిమాను కూడా వాళ్లే రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ కు “దక్ష”తో హ్యాట్రిక్ దక్కాలి, మాకూ విజయం రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ – “దక్ష” కథను నా దగ్గరకు నాన్న గారు తీసుకొచ్చారు. ఆయనే ఈ కథను తీసుకొచ్చారా అనేది మొదట్లో నమ్మలేకపోయాను. ప్రతి చిత్రంతో మనకొక సొంత టీమ్ తయారవుతుంది. మహేశ్, జెమినీ సురేష్ వంటి కో ఆర్టిస్టులతో మాకొక కొత్త టీమ్ ఫార్మ్ అయ్యింది. “దక్ష” సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఇది తమ సినిమా అనుకునే నటించారు. మహేశ్ అయితే ప్రమోషన్స్ గురించి ఎలా చేయాలో చెప్పేవాడు. ఈ చిత్రంలో నాన్న గారి ఇమేజ్ కు తగినట్లు పర్పెక్ట్ క్యారెక్టర్ ఉంది. అందుకే ఆయనను అడిగాం. సముద్రఖని, సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా..ఇలా పాన్ ఇండియా వైజ్ చూస్తే ప్రతి భాష నుంచి పేరున్న ఆర్టిస్టులు మా చిత్రంలో నటించారు. నాన్న గారి తర్వాత నన్ను అంత బాగా చూసుకునేది మనోజ్. అతను సినిమా చేయనప్పుడు ఇలాంటి మంచి ఆర్టిస్ట్ స్క్రీన్ మీద మళ్లీ ఎప్పుడు కనిపిస్తాడు అని ఒంటరిగా బాధపడ్డాను. మనోజ్ హీరోగానే కాదు విలన్ గానూ మెప్పించగలడు, కామెడీ చేయగలడు. వర్సటైల్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు.
“దక్ష” సినిమాకు మనోజ్ ఇచ్చిన సజెషన్స్ ను తీసుకున్నాను. ఎందుకంటే మనోజ్ కు ఫిలిం మేకింగ్ మీద, ప్రతి క్రాఫ్ట్ మీద పట్టుంది. నాన్న గారితో అమితాబ్ పీకూ లాంటి మూవీ చేయాలని ఉంది. నటిగా నా ప్రయాణాన్ని ఆపను. తమిళం, మలయాళంలో కూడా నటించాను. నా దగ్గరకు వచ్చే ప్రాజెక్ట్స్ ముందు నటిగా వచ్చి, ఆ తర్వాత ప్రొడ్యూస్ చేయమని అడుగుతున్నారు. ప్రొడక్షన్ అంత ఈజీ కాదు.
మా “దక్ష” చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ వాళ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కన్నప్ప, మిరాయ్ తర్వాత వాళ్లకు మా సినిమా హ్యాట్రిక్ అవ్వాలి. అన్నారు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ – నా మిరాయ్ మూవీని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. నెక్ట్స్ వీక్ అక్క, నాన్న కలిసి నటించిన “దక్ష” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను కూడా మీరు పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కోసం అక్క చాలా కష్టపడింది. “దక్ష” టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నా.
ప్రస్తుతం ప్రేక్షకులతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. లిటిల్ హార్ట్స్ హిట్ అయ్యింది, బెల్లంకొండ సాయి కిష్కిందపురి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మా మిరాయ్ ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.
ఒకే రోజు రెండు చిత్రాలు రిలీజై మంచి విజయం సాధించాయి. అందుకు బెల్లంకొండ సాయి బ్రదర్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. నెక్ట్స్ “దక్ష” రాబోతోంది, ఆ తర్వాత ఓజీ వస్తోంది. ఈ నెల మూవీ లవర్స్ కు ఫీస్ట్ లా ఉంటుంది. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు:
మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, సముద్రఖని, సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేశ్, జెమినీ సురేష్, తదితరులు..,
టెక్నికల్ టీమ్:
సంగీతం: అచు రాజమణి,ఛాయాగ్రహణం: గోకుల్ భారతి,నృత్య దర్శకురాలు: బృంద,పీఆర్ఓ – వీరబాబు,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ కృష్ణ మల్లా.