Manamey Movie Review & Rating: మనమే మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా!

manamey review by 18fms e1717793036517

చిత్రం: మనమే !,

విడుదల తేదీ : జూన్ 07, 2024,

నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి, మాస్టర్ విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి సుదర్శన్ తదితరులు,

దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య,

నిర్మాతలు : టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల,

సంగీత దర్శకుడు: హేశం అబ్దుల్ వహాబ్,

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్,

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,

మూవీ: మనమే మూవీ రివ్యూ  ( Manamey Movie Review) 

ఈ మనమే సినిమా తో చార్మింగ్ స్టార్ అయిన శ‌ర్వానంద్ ఎనర్జెటిక్ పాత్రలో  నటించిన లేటెస్ట్ మూవీ ‘మ‌న‌మే’. టాలెంటెడ్ దర్శకుడు  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణం లో ఈ మనమే చిత్రాన్ని తెరకి ఎక్కించగా, తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ  శుక్ర వారం రోజు వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందామా  !

manamey movie review by 18fms

కధ పరిశీలిస్తే (Story Line): 

విక్రమ్ (శర్వానంద్) లండన్ లో పీజీ చేసి అక్కడే,  సరదాగా తిరుగుతూ తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఐతే, విక్రమ్ క్లాస్ మెట్ & ఫ్రెండ్ అయిన అనురాగ్ అతని భార్య లండన్ నుండి హైదరాబాద్ వస్తూ ఓ ప్రమాదంలో చనిపోతారు.

UK సిటిజన్ అయిన వారి కొడుకు ఖుషి ( మాస్టర్ విక్రమ్ ఆదిత్య)  అనాథగా ఒంటరిగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్ సుభద్ర (కృతి శెట్టి) ఆ పిల్లాడికి నాలుగు నెలల పాటు కేర్ టేకర్స్ గా ఉండాల్సి వస్తోంది.

ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ, అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది.

విక్రమ్ తను ఇష్టపడుతున్న సుభద్ర కోసం ఏం చేశాడు ?,

తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా ?,

విక్రమ్ కి – అనురాగ్ కి మద్య ఉన్న బౌండింగ్  ఏమిటి ?,

సుభద్ర ఎవరు ? ఎందుకు ఖుషి – విక్రమ్ తో ఉండాలనుకొంటుంది ?,

జులయి గా తిరిగే విక్రమ్ లక్ష్యం ఏమిటి ?, 

అనురాగ్ అతని భార్య చనిపోవడానికి కారణం ఏమిటి ?,

చివరకు విక్రమ్ – సుభద్ర ఒక్కటి అయ్యారా ? లేదా ?, 

అనే ప్రశ్నలకు జవాబులు కావాలి అంటే వెంటనే మీ దగ్గరలోని దియేటర్ కి వెళ్ళి మనమే సినిమా చూసేయండి.

manamey movie review by 18fms 1

కధనం పరిశీలిస్తే (Screen – Play):

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సినిమా రెండవ అంకం (సెకండ్ హాఫ్) లోని ఫ్యామిలీ సీక్వెన్సెస్ అలాగే కొన్ని లవ్ సీక్వెన్సెస్ రొటీన్ గా నే ఉన్నాయి. ఇక హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డ్రామా కూడా రెగ్యులర్ గానే సాగింది.

మొత్తానికి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసినా, లేక మరో వెర్షన్ లో కధనం (స్క్రీన్ – ప్లే) రాసుకొన్నా సినిమా విజయానికి ఇంకా ప్లస్ అయ్యేది.

అలాగే, శ్రీరామ్ ఆదిత్య కధనం ( స్క్రీన్ ప్లే) విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఇంటర్వెల్ లో ఓ చిన్న కాన్ ఫ్లిక్ట్ ఇచ్చి, రెండవ అంకం (సెకండాఫ్) పై కొంత ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేసినా, అది అంత ఎఫెక్టివ్ గా స్క్రీన్ మీద వర్కౌట్ కాలేదు.

మ్యూజిక్ బాగున్నా, ఎక్కువ సాంగ్స్ ఉండటం వలనా, ప్రతీ సీన్ ను పొడగించడం వల్ల కొన్ని సీన్స్ బోర్ కొట్టాయి. ఇక క్లైమాక్స్‌ కూడా రెగ్యులర్ కినేయం టెంప్లేట్ మాదిరిగానే అందరూ ఊహించిన విధంగానే ముగిసింది.

manamey movie review by 18fms 2

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

శ్రీరామ్ ఆదిత్య దర్శకుడి గా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే, ఆయన టేకింగ్ కూడా చాలా బాగుంది. కానీ, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఆయన తడబడ్డాడా అనిపిస్తుంది. గతం లో కచ్చిన కొన్ని సినిమాల ప్రభావం ఈ కధనం మీద పడిందా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సీన్స్ రొటీన్ గా కొత్తదనం లేకుండా సాగాయి.

కధకుడిగా శ్రీరామ మాత్రం సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు, ముఖ్యంగా డీసెంట్ కాన్సెప్ట్ తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్ గా సాగే లవ్ ఎమోషన్స్, చైల్డ్ సెంటిమెంట్  వంటి హైలైట్స్ కంటెంట్ తో  ఆకట్టుకొన్నాడు. ముఖ్యంగా శర్వా- కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమ్ ఆదిత్య పాత్ర ట్రాక్.. ఆ పాత్ర ద్వారా హీరోహీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి.

విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్ లో ఓ సగటు తండ్రిగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా క్లైమాక్స్ సీక్వెన్స్ లో శర్వానంద్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్ కి – కృతి శెట్టి కి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది.

 కథానాయకగా నటించిన కృతి శెట్టి సుభద్ర పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. ఉప్పెన సినిమా తర్వాత నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరకడం కృతి అదృష్టమే !

అతిధి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. ఇంకా అయేషా ఖాన్ కూడా తన గ్లామర్ తో మెప్పించింది.

శివ కందుకూరి కూడా ఒక ముక్య పాత్రలో బాగానే నటించాడు. మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్ర అని చెప్పవచ్చు.

మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్ తో మెప్పించాడు. స్క్రీన్ మీద చాలా క్యూట్ గా అందంగా కనిపించాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించాడు అని చెప్పవచ్చు.

అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ నాచ్యురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు.

విజయ్ కుమార్ , ముకేష్ ఋషి, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

IMG 20240608 WA0006

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది. ఈ మనమే కధ మొత్తం మ్యూజికల్ మ్యాజిక్ లాగా సాగిపోతుంది. ముఖ్యంగా BGM నే ఈ సినిమా కి ప్రాణం.

విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ మంచి కలర్ ఫుల్ గా ఉన్నాయి. లండన్ సిటీ తమ కెమెరా లెన్స్ లో బందించారు అని చెప్పవచ్చు.

నిర్మాత టిజి విశ్వప్రసాద్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చుకి తగ్గకుండా చాలా రిచ్ గా నిర్మించారు.

ఎడిటర్ ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా చాలా సీన్స్ కి ప్లస్ అయ్యింది. కానీ కొన్ని రొటీన్ మరియు  అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది.

IMG 20240608 WA0003

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

శర్వానంద్ ని  చాలా గాప్ తర్వాత  ఛార్మింగ్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వచ్చిన ఈ మనమే సినిమా మంచి “ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా’” అని చెప్పవచ్చు. ఈ మనమే చిత్రం హ్యూమన్ బంధాలు తో కూడిన మంచి ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది.

గుడ్ కాన్సెప్ట్ తో పాటు డీసెంట్ గా సాగే పేరెంట్స్ ఎమోషన్స్ మరియు లవ్ సీన్స్, క్లైమాక్స్ ఈ సినిమాకి  హైలైట్స్ గా నిలిచాయి. ఐతే, ఈ మనమే సినిమాలో కొన్నిసీన్స్ గత సినిమాలలో చూసిన సీన్స్ లానే అనిపిస్తూ,  స్లోగా సాగడం సినిమాకి  సక్సెస్ కి మైనస్ అయ్యాయి.

లీడ్ ఫెయర్ అయిన శర్వానంద్ – కృతి శెట్టి తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ ‘మనమే’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను చాలా బాగా మెప్పిస్తోంది. ఈ వారాంతం లో ఫ్యామిలీ తో కలిసి దియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

IMG 20240607 WA0306

చివరి మాట: ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా !

18F RATING: 3  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *