Manam saitham helping hand from Kadambari : దీనజనబాంధవుడిగా ‘మనం సైతం’ కాదంబ‌రి కిర‌ణ్

IMG 20240127 WA0151 e1706368222563

ఒకేసారి ప‌లువురికి ఆర్థిక సాయం  

▪️ ‘మనం సైతం’.. ఒక స్ఫూర్తి కిరణం!

▪️ దశాబ్ద కాలంగా మనం సైతం సేవలు

▪️ మ‌రోసారి ప‌రిమ‌ళించిన మాన‌వ‌త్వం

కష్టానికి చలించటం మానవ సహజం.. పరుల దుఃఖానికి స్పందించటం మానవ సుగుణం.. ఉత్తమమైన మానవ జన్మకి పరమార్ధం.. నిస్సాహ‌యుల‌కు సాయం చేస్తూ దీనజనబాంధవుడిగా మారారు సినీ న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్. తాజాగా ఒకేసారి ప‌లువురికి ఆర్థిక సాయం చేసి మ‌రోసారి మాన‌వ‌త్వం చాటుకున్నారు.

IMG 20240127 WA0149

 సినీ నటుడు,‘మనం సైతం’ ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ దాతృత్వం కొన‌సాగిస్తూనే వున్నారు. ఒకేసారి ప‌లువురికి ఆర్థిక సాయం చేసి మంచి మ‌న‌సు చాటుకున్నారు.

IMG 20240127 WA0150

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెయిర్ స్టయిలిస్ట్, సీనియ‌ర్ నటి రంగస్థలం లక్ష్మికి ‘మనం సైతం’ కుటుంబం నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం చేశారు. రంగస్థలం లక్ష్మికి మెరుగైన వైద్యం, క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చేలా సాయం చేశారు.

మ‌రోవైపు ఎనుముల విదిష అనే బాలిక‌కు ముక్కుకు సంబంధించిన ఆప‌రేష‌న్ కోసం ‘మనం సైతం’ కుటుంబం నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం చేశారు. అలాగే సినీ ఆర్టిస్ట్, డాన్సర్ చదువులతల్లి సూరేపల్లి చంద్రకళ ఉన్న‌త చ‌ద‌వుల కోసం ఇంగ్లాండ్ వెళ్లడానికి కొంత సాయం కోరితే మనంసైతం కుటుంబం నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం చేశారు.

IMG 20240127 WA0152

ఇటీవ‌ల సీనియ‌ర్ న‌టి పావ‌ల శ్యామ‌ల ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకుని రూ. 25,000 ఆర్థిక సాయం చేసిన‌ కాదంబ‌రి కిర‌ణ్.. మ‌రోసారి ఆమెకు రూ. 6 వేలు అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ పదేళ్లలో ఎంతో మందికి ‘మనం సైతం’ కుటుంబం నుంచి కాదంబ‌రి కిర‌ణ్ సాయం చేస్తున్నారు.

 

అవసరార్థులకు చేతనైన సాయం కోసం కనకదుర్గమ్మ దయతో ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనంసైతం సిద్ధంగా ఉంటుంద‌ని చెబుతారు కాదంబ‌రి కిర‌ణ్. దీనజనాద్దోరణే “మనంసైతం” కుటుంబం ధ్యేయం, గమ్యం, జీవనం అంటారాయన.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *