mammutty new movie ఓపెనింగ్ 1 e1692263396967

ప్రత్యేకంగా హారర్- థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి నిర్మాత చక్రవర్తి రామచంద్ర స్థాపించిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఈరోజు (ఆగస్టు 17న) ప్రారంభమైంది. నైట్ షిఫ్ట్ స్టూ డియోస్ ని ఈరోజు ఉదయం ప్రారంభించారు. ప్రారంభ సమయంలోనే తాము నిర్మించబోయే మొదటి సినిమాని ఈరోజే పక్రటిస్తున్నట్లు నిర్మా తలు తెలిపారు. చెప్పినట్లుగానే మొదటిచిత్రాన్ని ఘనంగా పక్రటించారు.

నైట్ షిఫ్ట్ స్టూ డియోస్ నిర్మిస్తున్న మొదటి చిత్రం ‘ భ్రమయుగం’లో ప్రముఖ నటుడు మమ్ము ట్టి నటిస్తున్నారు. రాహుల్ సదాశివన్ రచన-దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూ డియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

mammutty new movie ఓపెనింగ్ 3

చిత్ర ప్రకటన సందర్భంగా ప్రముఖ నటుడు మమ్ముట్టి మాట్లాడుతూ.. “#NS1 ఒక ఉత్తేజకరమైన చిత్రం. నేను మునుపెన్నడూ పోషించని పాత్రను పోషిస్తున్నందున ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దర్శకుడు రాహుల్ అద్భుత ప్రతిభ, నిర్మాతలు రామ్-శశిల అభిరుచి ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకం చేశాయి.” అన్నారు.

mammutty new movie ఓపెనింగ్

రచయిత, దర్శకుడు రాహుల్ సదాశివన్ మాట్లాడుతూ.. “మమ్ము ట్టిగారి సినిమాకిదర్శకత్వం వహించాలనే కలను సాకారం చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ‘భ్రమయుగం’ అనేది కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగేకథ. దీనిని అద్భు తంగా మలచడానికి నిర్మా తల సహకారం లభించినందుకు సంతోషిస్తున్నా ను. పప్రంచవ్యా ప్తంగా ఉన్న మమ్ము క్కా  అభిమానులకు మరియు ఈ జానర్ ని ఇష్టపడేవారికి ఇది ఒక ట్రీట్ అవుతుందని ఆశిస్తున్నా ను.” అన్నా రు.

 

రామచంద్ర 2016 లో వైనాట్ స్టూడియోస్ లో చేరే వరకు ఒక దశాబ్దం పాటు సొంతంగా చిత్ర నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు వైనాట్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు, నిర్మాత ఎస్.శశికాంత్ భాగస్వామ్యంతో చిత్ర నిర్మాణ రంగంలో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. గత ఏడు సంవత్సరాలుగా శశికాంత్ రామచంద్ర పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

mammutty new movie

నై మాట్లాడుతూట్ షిఫ్ట్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు, నిర్మాత చక్రవర్తి రామచంద్ర.. ” హారర్ జానర్‌పై నాకున్న అభిరుచి, రిచ్ కంటెంట్ మరియు ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్‌లతో సంవత్సరాల తరబడి పనిచేసిన అనుభవం, ప్రపంచస్థాయి చిత్రాలను రూపొందించాలనే తపనతో ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.” అన్నారు.

mammutty new movie ఓపెనింగ్ 2

నిర్మా త శశికాంత్ మాట్లాడుతూ.. “మా సంస్థలో మొదటిసినిమానే లెజెండరీ నటుడు మమ్ము క్కా (మమ్ముట్టి) తో చేసేఅవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా ము. మమ్ము క్కా యొక్క అసమానమైన ఇమేజ్ తో ఈ చిత్రం మరో స్థాయికి వెళ్తుంది.‘ భ్రమయుగం’’ అనేది ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి మా దర్శకుడు రాహుల్ సృష్టించిన అద్భు త పప్రంచం” అన్నా రు. భ్రమయుగం’’ చిత్రాన్ని కొచ్చి మరియు ఒట్టపాలంలో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నా రు.

mammutty new movie ఓపెనింగ్

ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా లిజ్ ఇతర ముఖ్య పాతల్రు పోషిస్తున్నా రు.  సినిమాటోగ్రాఫర్ గా షెహనాద్  జలాల్, ప్రొడక్షన్ డిజైనర్ గా జోతిష్ శంకర్, ఎడిటర్గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్రి్టో జేవియర్ వ్యవహరిస్తున్నా రు. టిడిరామకృష్ణన్ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి మేకప్ రోనెక్స్ జేవియర్, కాస్ట్యూ మ్స్ మెల్వీ జె.

నైట్ షిఫ్ట్ స్టూ డియోస్, వైనాట్ స్టూ డియోస్ సమర్పిస్తున్న ‘ భ్రమయుగం’ 2024 ప్రారంభంలో పప్రంచవ్యా ప్తంగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీభాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *