గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా జనవరి 21న రిలీజ్ కానున్న ఉన్ని ముకుందన్ నటించిన మలయాళ చిత్రం ‘మలికాపురం’

malikapuram e1673970424500

మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక మంచి సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లాలి అని ఆయనకు ఉండే సంకల్పమే నేడు “ఆహా” ఓటిటి ప్లాట్ ఫ్రామ్.

ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో అందించడం అనేది తెలుగు ప్రేక్షకులకు గొప్ప విషయం. కేవలం ఓటిటిలోనే కాకుండా థియేటర్స్ లో కూడా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు నిర్మాత అల్లు అరవింద్.

malikapuram poster

సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ద్వారా రిలీజ్ చేసారు. రిలీజ్ అయిన మొదటిరోజునుంచే ఈ చిత్రం ఊపందుకుంది.

unnimukundan malikappuram telugu

విడుదలైన అన్ని చోట్ల భారీ రెస్పాన్స్ వచ్చింది. అదే తరహాలో “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” వరుణ్ ధావన్, కృతి సనన్ నటించిన “భేదియా” చిత్రాన్ని కూడా ప్రేక్షకులకి అందించింది. తెలుగులో “తోడేలు” పేరుతో ఈ సినిమాను నవంబర్ 25 న భారీ స్థాయిలో విడుదలైంది.

Malikappuram english poster
ఇప్పుడే అదే తరహాలో ఉన్ని ముకుందన్ నటించిన మలయాళ చిత్రం ‘మలికాపురం’ సినిమాను జనవరి 21 ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు. తన సూపర్‌హీరో అయ్యప్పన్‌ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

malikappuram telugu poster

ఈ చిత్రంలో బాలనటులు శ్రీపత్, దేవానంద ప్రధాన పాత్రలు పోషించారు. కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఉన్ని ముకుందన్ ఇదివరకే తెలిపారు.

మలయాళంలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దీనిని నిర్మించాయి. అంటోన్ జోసెఫ్ యాజమాన్యంలోని యాన్ మెగా మీడియా మరియు వేణు కున్నపిల్లి యాజమాన్యంలోని కావ్య ఫిల్మ్ కంపెనీ నిర్మాణ భాగస్వాములు.

Malikappuram telugu

నరయం, కున్హికూనన్, మిస్టర్ బట్లర్, మంత్రమోతీరం వంటి చిత్రాలతో ఫేమస్ అయిన దర్శకుడు శశిశంకర్ తనయుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎడిటర్- షమీర్ మహ్మద్, కెమెరామెన్- విష్ణు నారాయణన్ నంబూతిరి. పతం వళవ్, నైట్ డ్రైవ్, కడవర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత అభిలాష్ పిళ్లై స్క్రిప్ట్ అందించిన సినిమా ఇది.

ఈ సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా జనవరి 21 విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *