Mahesh Vitta ‘s Uthutha Herolu First Look Unveiled: మహేష్ విఠా ప్రధాన పాత్రలో ‘ఉత్తుత్త హీరోలు’ మూవీ ఫస్ట్ లుక్ ! 

IMG 20240409 WA0161 e1712648643477

 ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విఠా నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఉత్తుత్త హీరోలు. ప్రముఖ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని, ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మహేష్ విఠా స్వీయ దర్శకత్వంలో మొట్టమొదటిసారి పూర్తి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఉగాది కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు.

తొలిసారిగా హీరోగా నటిస్తున్న మహేష్ విఠా ఈ సినిమాకు నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు. కామెడీ, సస్పెన్స్ ప్రధాన అంశాలుగా ఈ చిత్రాన్ని మొత్తం రాయలసీమ బ్యాగ్రౌండ్ లోనే తెరకెక్కించారు. ఉగాది శుభాకాంక్షలతో విడుదల చేసిన తాజా పోస్టర్ ను గమనిస్తే.. నలుగురు ప్రధాన పాత్రధారులు వారి ఊర్లో ఓ భారీ మోసం చేసి పారిపోతున్నట్లు అనిపిస్తుంది.

అందుకు తగ్గట్టుగానే డబ్బులు, నగలు బ్యాగు నుంచి జారీ గాల్లో ఎగురుతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విశేషం ఏంటంటే అందులో ఒక పాత్రధారుడి చేతిలో కోడిపుంజు ఉండడం చూస్తే ఇది కచ్చితంగా కామెడీని పంచె చిత్రమని తెలుస్తుంది.

IMG 20240409 WA0163

బలమైన కథ, దానికి తగ్గట్టుగానే కామెడీ సన్నివేశాలను అద్భుతంగా రాసుకొని రాయలసీమ భాష, యాసతో సీమ ప్రాంతంలో జరిగే ఓ ఆసక్తికరమైన సంఘటన చుట్టూ ఉత్తుత్త హీరోలు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, సీమ చరిత్రలో ఇది ఒక కల్ట్ ఫిలిమ్ గా మిగిలిపోతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

నటీనటులు:

మహేష్ విఠా, ప్రవీణ సోని, తారక్ సతీష్, వాల్తేర్ వినయ్, రాహుల్ రాజ్ వణం, హర శ్రీనివాస్, భరత్ బెహరా, మనీష్ విశాల్ తాడిమర్రి, ఏం ఎస్ ప్రణయ్, షిన్నింగ్ ఫణి, కోటేశ్వర రావు గన్నా, కట్టా ఆంటోని, ఓబుల్ రెడ్డి, జియా ఉల్ హక్, ఆల్మట్టి నాని తదితరులు.

సాంకేతిక వర్గం:

స్టోరీ, దర్శకత్వం: మహేష్ విఠా, నిర్మాత: మహేష్ విఠా,బ్యానర్: ఎంవీఎం పిక్చర్స్,సంగీత దర్శకుడు: జాన్ కె జోసఫ్,బ్యాగ్రౌండ్ స్కోర్: జీవన్ బాబు(జె బి),ఎడిటర్: చోటా కె ప్రసాద్,పీఆర్ఓ: హరీష్, దినేష్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *