మహేష్ బాబు ఇప్పుడు చాలా ఆలోచిస్తున్నాడు. తాను నటిస్తున్న త్రివిక్రమ్ సినిమా ఎందుకో మహేష్ బాబుకి నచ్చలేదా లేక ప్రకృతికి నచ్చలేదా ?
ఏదో ఒకే చేద్దాం అని చాలా కాలం ఆలోచించి ఆలోచించి చివరకు ఒక సెడ్యూల్ అనుకొంటే అది మద్యలోనే మరో కారణం తో బ్రేక్ పడి, తరువాత మహేష్ ఇంట్లో వ్యక్తిగత విశయాలతో సినిమా కు బ్రేక్ మెద బ్రేక్ పడి ఇప్పుడు పట్టాలు ఎక్కుతుందా అనే అనుమానం కలుగుతుంది సాటి సినీ ప్రేక్షకుడుకి.
మహేష్ బాబు క్రియేటివ్ టీం మాత్రం ఈ త్రివిక్రమ్ సినిమా ఎంత త్వరగా పూర్తి చేసి అంత త్వరగా మమ అనేసి రాజమౌళి సినిమా లోకి దూరిపోవాలి అని ఆలోచిస్తుంది. ఎందుకంటే అది వరల్డ్ సినిమా కాబట్టి.
ఇలానే ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్ కూడా ఏదో లా మహేష్ సినిమా పూర్తి చేసి తరువాత యన్ టి ర్ సినిమా స్క్రిప్ట్ లోకి దూరిపోవాలి అని। ఎందుకు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మా టీం కొంచెం కొంచెం వారి క్రియేటివ్ టీమ్స్ తో మాటలాడటం వలన తెలిసింది ఏంటంటే మహేష్ – త్రివిక్రమ్ కినేయ ఎప్పుడో వప్పుకున్న సినిమా అది మోహమాటానికి సరే అన్నది అని.
అలానే త్రివిక్రమ్ యన్ టి ర్ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని అది కూడా పాన్ వరల్డ్ రేంజ్ సినిమా అవుతుంది అని అంటున్నారు. కానీ ఈ పేపర్ లెక్కలు కు ప్రాక్టికల్ పరిస్థితులు అనుకూలించాలి కదా. అదే అసలు సమస్య.
మా రీసెర్చ్ ప్రకారం త్రివిక్రమ్- మహేష్ సినిమా కి స్టంట్ మాస్టర్స్ సమస్య వచ్చింది ఇంకా మహేష్ కి కధ యొక్క కధనం (స్క్రీన్ – ప్లే) అంతగా నచ్చలేదు అని. ఈ మార్పులు మహేష్ త్రివిక్రమ్ కి చెప్పి యూరప్ ట్రిప్ కి వెళ్తే ఇంతలోనే మహేష్ ఇంట్లో విషాదాల మీద విషాదాలు జరిగాయి.
అవన్నీ నిన్నటితో (కృష్ణ గారి పెద్ద కర్మ) ముగిశాయి. ప్రొడక్షన్ హౌస్ నుండి అందుతున్న సమాచారం ఏంటంటే డిసెంబర్ 8 నుండి మహేష్ _ త్రివిక్రమ్ సినిమా కి యూనిట్ సబ్యులను రెఢీ చేస్తున్నారు అని అంటే ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగబోతుంది అని.
కానీ ఇప్పుడు యూనిట్ లో మరో సమస్య ఏంటాడుతోంది, అదేంటంటే ఆర్టిస్ట్ ల కాంబినేషన్ డేట్ లు సెట్ కావాలి కదా. అవి ఏదో విధంగా సెట్ చేస్తారు అనుకుంటే..క్రిస్మస్..న్యూ ఇయర్..సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కదా.
తెలుగు రాష్ట్రలలో అయితే సంక్రాంతికి షూటింగ్ లు కచ్చితంగా నిలిచిపోతాయి. సాంకేతిక సిబ్బంది అందరూ తమ స్వంత ఊర్లు వెళ్ళడానికి ఇస్తాపడతారు. ఈ సమస్యను ఎలా అడిగామిస్తారు అనేది చూడాలి.
ప్రస్తుతం కనీసం 100 వర్కింగ్ డేస్ కావాలి ఈ సినిమా పూర్తి చేయడానికి. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ కు, పబ్లిసిటీకి తగినంత టైమ్ వుండాలి. ఇవన్నీ చూసుకుంటే కనీసం ఆరు నెలలు సమయం కావాలి. డిసెంబర్ 8 కి కాస్త అటు ఇటుగా మొదలుపెట్టినా, జూన్ కి కానీ పూర్తి అవ్వదు.
అంటే మరలా మనం మహేష్ బాబు ని వెండి తెర మీద చూడాలి అంటే దసరా కోసం లేదా పోస్ట్ సమ్మర్ లో సరైన డేట్ కోసం చూడాలి. సినీ వర్గాలు ట్రేడ్ పండితులు ఆగస్టు 11 అనువైన డేట అని చెప్తున్నారు. దాదాపు అయిదు రోజులు వరుస సెలవులు కనిపిస్తున్నాయి కాబట్టి వీక్ ఎండ్ కలక్సన్స్ బాగుంటాయి అని పంపిణీధారుల ఆలోచన.
ప్రస్తుతానికి ఆగస్టు 11 నే మహేష్-త్రివిక్రమ్ సినిమా రావడానికి అవకాశం వుంది అని మాకు కూడా అనిపిస్తుంది. అంతకన్నా ముందు రావడానికి చాన్సే లేదు అన్నది మా విశ్లేషణ లో తేలిన నిజం.
కానీ మరో చర్చ ఇలా ఉంది.. ఆలూ లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. షూటింగ్ మొదలు పెట్టి మధ్యలో గాప్ లు ఇస్తూ చేస్తున్న సినిమా కి రిలీజ్ డేట్ ఫిక్స్ ఏంటి అని అంటున్నారు.
ఏది నిజం ఏది అబద్దం అనేది కాలమే నిర్ణయిస్తుంది. మనం జస్ట్ నిమిత్ర మాత్రులమే.. సినిమా ప్రొడక్షన్ హౌస్ లో జరిగే సీక్రెట్ మాటల కు కృష్ణా నగర్ సినీ పండితుల మసాలా జోడించి మా ప్రేక్షకులకు ఇవ్వడమే మా 18f మూవీస్ గాసిప్స్ టీం పని.