Mahanatulu Movie Update: జాతిరత్నాలు తరహాలో వస్తున్న “మహానటులు” చిత్రం ఈ నెల 25న విడుదలకు సిద్ధం 

IMG 20230813 WA0037 e1691987287326

 

దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కించిన కొత్త సినిమా మహానటులు. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ బోధిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మించారు. అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జాతిరత్నాలు తరహాలో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన మహానటులు సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

IMG 20230813 WA0125

ఈ సందర్భంగా దర్శకుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ – నేను ఇప్పటిదాకా డిఫరెంట్ మూవీస్ చేశాను కానీ కామెడీ జానర్ టచ్ చేయలేదు. ఫన్, హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో నేను రూపొందించిన చిత్రమిది. మన చూట్టూ ఉండే ఓ నాలుగు క్యారెక్టర్స్ కథలో ఉంటారు.

ఈ నలుగురు టీమ్ గా మారి మహానటులు అనే యూట్యూబ్ ఛానెల్ ను ఎలా డెవలప్ చేశారు అనేది కథ. మీరు ఈ సినిమా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెప్పగలను. ఈ నెల 25న థియేటర్ లో మా సినిమా చూడండి. అన్నారు.

Releasing Poster 4 copy OK

ఈ చిత్రానికి కథ, మాటలు – పి సుధీర్ వర్మ, సినిమాటోగ్రఫీ – సిద్ధం నరేష్, మ్యూజిక్ – మార్కస్ ఎం, ప్రొడక్షన్ డిజైనర్ : రాజశేఖర్ ఎడిటింగ్ – కార్తీస్ కట్స్, ఆర్ట్ – హేమంత్ కుమార్, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాతల -అనిల్ బోధిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి, దర్శకత్వం – అశోక్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *