Madhave Madhusudhana Hero Tej special Interview:. ‘మాధవే మధుసూదన’ హీరో తేజ్ బొమ్మదేవర ఇంటర్వూ!

IMG 20231122 WA0136 e1700661186956

తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే‌ జంటగా నటించిన సినిమా ‘మాధవే మధుసూదన’. ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం వహించారు బొమ్మదేవర రామచంద్ర రావు. ఈ మూవీని బొమ్మదేవర శ్రీదేవి సమర్పిస్తున్నారు.

ఈ నెల 24 ‘మాధవే మధుసూదన’ సినిమా థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హీరో తేజ్ బొమ్మదేవర మా 18F మూవీస్ మీడియా ప్రతినిధి తో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము..IMG 20231122 WA0136 1

ఈ చిత్రానికి హీరోగా ఎలా సెలెక్ట్ అయ్యారు? ముంద నుంచీ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేదా?

బీబీఏ కంప్లీట్ చేశాను. విదేశాలకు వెళ్లి ఎంబీఏ చేద్దామని అనుకున్నా. కానీ కరోనా వల్ల అంతా తారుమారైంది. ఆ టైంలోనే మా నాన్న ఈ కథను రెడీ చేసుకున్నారు. ఆయనతో పాటు నేను కూడా ట్రావెల్ చేశాను. ఎంతో మంది వద్దకు వెళ్లి కథ చెప్పాం. కానీ సెట్ అవ్వలేదు. చివరకు మా నాన్న నన్నే అడిగారు. నటనలో శిక్షణ తీసుకుని ఇందులో హీరోగా నటించాను.

 కెమెరా ముందు వెళ్లిన తరువాత ఎలా అనిపించింది?

కెమెరామెన్ కూడా మాకు బంధువే. ఆయన ఎన్నో సలహాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రీ క్లైమాక్స్ షూట్‌ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. ఆ సీన్ చేసిన తరువాత నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది.

తెలుగు లో ఏ హీరో అంటే ఇష్టం?

మహేష్ బాబు గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇంటెన్స్ యాక్టింగ్ అంటే నాకు విపరీతంగా ఇష్టం. నాగార్జున గారంటే మాకు గౌరవం. వారి వల్లే మేం ఈ స్థాయిలో ఉన్నాం.

IMG 20231121 WA0152

 ఈ కథ ఎలా ఉండబోతోంది? మీకు నచ్చిన పాయింట్ ఏంటి?

చాలా మంచి కథ. తెలుగులో ఇది కొత్త జానర్‌లా అనిపిస్తుంది. క్లైమాక్స్ అందరినీ టచ్ చేస్తుంది. ఇంత వరకు అలాంటి క్లైమాక్స్ చూసి ఉండరు. లవ్, థ్రిల్, కామెడీ ఇలా అన్ని అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది.

 ఈ సినీమా లో హీరోయిన్‌ పాత్ర ఎలా ఉండబోతోంది?

హీరోయిన్ చక్కగా నటించింది. ఆమె ముంబై నుంచి వచ్చారు. తెలుగు అంతరాదు కదా? అని అనుకున్నాం.. కానీ ఆమె తెలుగులో చక్కగా మాట్లాడేది. ఆమె పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది.

IMG 20231118 WA0083

 మీ సినిమాపై నాగార్జున గారు ఏం అన్నారు? ఎలాంటి సలహాలు ఇచ్చారు?

మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన టైంలో నాగార్జున గారు కొన్ని సలహాలు ఇచ్చారు. ‘నాన్న కష్టపడి పైకి వచ్చారు.. నువ్వు కూడా చాలా కష్టపడాలి.. డ్యాన్సులు బాగా చేశావ్’ అని నాగార్జున గారు అన్నారు.

 డబ్బింగ్ చెప్పడం మొదటి సారి కదా? ఎలా అనిపించింది?

ముందు నా వాయిస్ టెస్ట్ చేశారు. అయితే మెల్లిగా నాతో డబ్బింగ్ చెప్పించారు.

 హీరో అయ్యారు కదా? మీ ఫీలింగ్ ఎలా ఉంది?

 

హీరోలు ఒకప్పుడు స్పీచులు ఇస్తే ఏదో అనుకునేవాడ్ని. కానీ హీరోలు పడే కష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎంతో కష్టపడితే గానీ హీరోలుగా నిలబడలేరని తెలిసింది. మున్ముందు ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తాను. హీరోగా అయినా, కారెక్టర్లు వచ్చినా చేస్తాను.

ఓకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ బ్రదర్…

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *