MAD Movie teaser Launched:  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ తదుపరి చిత్రం ‘మ్యాడ్’ని విడుదల చేశారు!

IMG 20230831 WA0021

 

సూర్యదేవర నాగవంశీ తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఎదిగారు. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుటుంబం నుండి వచ్చిన ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని, గొప్ప పేరుని సంపాదించుకున్నారు.

IMG 20230830 WA0154

వరుస సినిమాలతో దూసుకుపోతున్న సితార సంస్థ వైవిధ్యమైన చిత్రాలను అందిస్తోంది. అలాగే, సూర్యదేవర నాగ వంశీ తన నిర్మాణ సంస్థ ద్వారా ప్రతిభావంతులైన దర్శకులకు అవకాశాలు ఇవ్వడంపై దృష్టి సారించారు.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తెలుగులో నాణ్యమైన సినిమాకు పర్యాయపదాలుగా మారాయి. ఈ నిర్మాణ సంస్థలు ఇతర భాషలతో పాటు పాన్-ఇండియా మార్కెట్‌ లోకి కూడా ప్రవేశించాయి.

IMG 20230831 WA0021

MAD Still FL TeaserOutNow

తాజాగా సూర్యదేవర నాగ వంశీ, రక్షా బంధన్ సందర్భంగా తమ సంస్థ నుండి ఒక ప్రత్యేక చిత్రాన్ని ప్రకటించారు. చినబాబు కుమార్తె, నాగ వంశీ సోదరి హారిక సూర్యదేవర ఈ కొత్త చిత్రం ‘ప్రొడక్షన్ నెం.18’తో నిర్మాతగా పరిచయమవుతుండటం విశేషం. నాగ వంశీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయి సౌజన్య, హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు.

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘మ్యాడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్,  nnదినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

తారాగణం:

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి

సాంకేతిక నిపుణుల:

రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్

సమర్పణ: ఎస్. నాగ వంశీ

నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఎడిటర్: నవీన్ నూలి

డీఓపీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి

ఆర్ట్: రామ్ అరసవిల్లి

అడిషనల్ స్క్రీన్ ప్లే: ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి

ఫైట్ మాస్టర్: కరుణాకర్

బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *