M4M Movie  Teaser Launch by Dil Raju: M4M (మోటివ్ ఫర్ మర్డర్) టైటిల్ టీజర్ లాంచ్ చేసిన దిల్ రాజు గారు!

IMG 20231128 WA0201 e1701178889704

 

నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకుులుగా మారి M4M (మోటివ్ ఫర్ మర్డర్) అనే సినిమాను తెరకెక్కిస్తుంన్నారు. ఈ చిత్రంతో హీరోయిన్‌గా జో శర్మ (USA), సంబీత్ ఆచార్య హీరోగా నటిస్తుంన్నారు. ఈ సినిమాకు మోహన్ వడ్లపట్ల, జో శర్మ, రాహుల్ అడబాల కథను అందించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ టీజర్‌ను దిల్ రాజు రిలీజ్ చేశారు. అనంతరం..

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మోహన్ వడ్లపట్ల ఇరవై ఏళ్ల క్రితం నన్ను కలిశారు. అప్పుడు ఓ సినిమా తీశారు. దర్శకుడితో సమస్యలు వచ్చాయి. అమెరికా నుంచి వచ్చి నిర్మాతగా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్‌లు అనేది కామన్. దర్శకుడిగా మారి మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన M4M మోటివ్ ఫర్ మర్డర్ అనే సినిమాను తీశారు. టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

జో శర్మ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు గారికి అమెరికాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన స్టార్ ప్రొడ్యూసర్. మోహన్ వడ్లపట్ల గారు ఈ సినిమాకు కోసం ఎంతో వర్కు చేసి పెట్టుకున్నారు. ఆయన తీసిన మెంటల్ కృష్ణ ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు ఈ సినిమాతో హాలీవుడ్ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను హలీవుడ్, బాలీవుడ్ లొ కూడా విడుదల చేస్తున్నామ’ని తెలిపారు.

IMG 20231128 WA0200

ఎంఆర్‌సీ చౌదరి మాట్లాడుతూ.. ‘మోటివ్ ఫర్ మర్డర్ అనేది డబ్బులున్నాయని తీస్తుంది కాదు. దీని వెనుక నాలుగేళ్ల కష్టం ఉంది. 15, 20 కథలు విన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా అద్భుతమైన సినిమాను రెడీ చేశారు. ఈ సినిమా కు స్రిన్ ప్లే చాలా బాగా చేసుకున్నాడు మోహన్ వడ్లపట్ల నా సోదరుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను’ అని అన్నారు.

మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ‘రాహుల్ అడబాల, జో శర్మలు ఈ కథను రాయడంలో సహకరించారు. రాహుల్ భవిష్యత్తులో మంచి దర్శకుడిగా రాణిస్తాడు. నేను అతడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తాను. దర్శకుడిగా నేను కొత్త అవతారం ఎత్తాను. నెక్ట్స్ హాలీవుడ్‌లోనూ సినిమాను నిర్మించబోతోన్నాను. ఆనంద్ పవన్ అద్భుతంగా ఎడిట్ చేశారు. వసంత్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. సంతోష్ మంచి కెమెరామెన్. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. నా టీంకు థాంక్స్’ అని అన్నారు.

రాహుల్ అడబాల మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన మోహన్ గారికి, జో మేడంకు థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన డైరెక్షన్ టీంకు థాంక్స్’ అని అన్నారు.

Hero/Heroine : జో శర్మ (USA), సంబీత్ ఆచార్య

 

సాంకేతిక బృందం:

బ్యానర్ : మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్, కథ : మోహన్ వడ్లపట్ల, జో శర్మ, రాహుల్ అడబాల, దర్శకత్వం : మోహన్ వడ్లపట్ల, సంగీతం : వసంత్ ఇసైపెట్టై, కెమెరామెన్ : సంతోష్, ఎడిటింగ్ : పవన్ ఆనంద్, పీఆర్వో : పర్వతనేని రాంబాబు, సాయి సతీష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *