“M4M” (మోటివ్ ఫర్ మర్డర్ ) మూవీ హీరోయిన్ జో శర్మకు అరుదైన ఛాన్స్ దక్కింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకకు జో శర్మ వెళ్లారు .
ఈ కలర్‌ఫుల్ ఈవెంట్ ని దగ్గరగా చూడటం ఎంతో సంతోషం గా భావించానని, ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్, నటి అరియానా గ్రాండే ను దగ్గరగా చూడటం ఓ అద్భుతమైన అనుభూతిగా మిగిలిందని జో శర్మ అన్నారు.
హీరోయిన్ పాత్రలో నటించిన “M4M”(మోటివ్ ఫర్ మర్డర్ ) మూవీ విడుదలకు సిద్ధమవుతోందని ఈ సందర్బంగా జో శర్మ తెలిపారు.
మోహన్ వడ్లపట్ల స్వీయదర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ “M4M“(మోటివ్ ఫర్ మర్డర్ ) హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమాలో జో శర్మ ప్రధాన పాత్రలో నటించింది.